BigTV English

Sridhar Babu on KTR: డ్రామాలు ఆపు కేటీఆర్.. ఇంత దారుణానికి పాల్పడతారా.. మంత్రి శ్రీధర్ బాబు, దయాకర్ ఫైర్

Sridhar Babu on KTR: డ్రామాలు ఆపు కేటీఆర్.. ఇంత దారుణానికి పాల్పడతారా.. మంత్రి శ్రీధర్ బాబు, దయాకర్ ఫైర్

Sridhar Babu on KTR: డ్రామాలు ఆపు కేటీఆర్.. దాడులు చేయించింది మీరేనని తెలిశాక, రైతులు అంటూ కొత్త నినాదం తీస్తావా.. మీ రౌడి బ్యాచ్ పై కేసులు పెడితే, రైతులు అంటావా.. ఇప్పటికైనా మారు.. లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.


వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసుకు సంబంధించి, తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కిన విషయం తెలిసిందే. ఓ వైపు కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ కుటిల రాజకీయాలు ఈ దాడితో బయటపడ్డాయని విమర్శిస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ మాత్రం దాడి సాకు చూపి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా ప్రతి విమర్శలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. అసలు దాడికి ఉసిగొలిపింది బీఆర్ఎస్ పార్టీ అంటూ.. పైకి మాత్రం కేటీఆర్ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నట్లు దయాకర్ అన్నారు. దాడులు చేయించింది మీరే అంటూ తెలిపిన దయాకర్.. అందరికీ అసలు విషయం తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండేందుకు రైతుల పేరు మీద పరామర్శలు చేయడం కేటీఆర్ కే చెల్లిందన్నారు.


ప్రభుత్వం రైతులపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదని, సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పై దాడికి పాల్పడ్డ బీఆర్ఎస్ పార్టీ రౌడీ మూకలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఏడాది కాంగ్రెస్ ప్రజా సంక్షేమ పాలనను ఓర్వలేక అధికారం కోసం పాకులాడేందుకు బీఆర్ఎస్ పార్టీ మరింత దిగజారడం మంచి పద్ధతి కాదంటూ సూచించారు. అధికారుల మీద దాడులు చేయించిన మీతో తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా పొలిటికల్ డ్రామాలు ఆపాలంటూ హితవు పలికారు.

Also Read: BRS party – KCR: కేటీఆర్ ఫెయిల్.. బీఆర్ఎస్‌కు దిక్కెవరు? ఉద్యమకారులకు ప్రాధాన్యమేది?

అధికారులను చంపడం ప్రజాస్వామ్యమా.. మంత్రి శ్రీధర్ బాబు
పరిశ్రమలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంటే, బీఆర్ఎస్ కు చెందిన గూండాలు మరో వైపు అధికారులను చంపే ప్రయత్నం చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి మాట్లాడుతూ.. కేటీఆర్ అరెస్ట్ కోసం పాకులాడుతున్నారని, ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారితో విచారణ సాగిస్తున్నామన్నారు.

అమాయకులైన గిరిజన రైతులను అడ్డుపెట్టుకొని, కేటీఆర్ దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వారి పాలనలో బలవంతంగా భూములు లాక్కున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి ప్రజల వద్దకు కలెక్టర్ ను పంపిస్తే, బీఆర్ఎస్ ముసుగు వేసుకున్న కొందరు దాడికి యత్నించినట్లు ఆరోపించారు. రాష్ట్రం ప్రగతి పథంలో నడిచేందుకు పరిశ్రమలు అవసరమని, అప్పుడే నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.

Related News

Heavy Rains: తెలంగాణకు భారీ వర్షం సూచన.. ఆ ప్రాంతాల్లో ఉరుములతో, దీపావళికి ముసురు?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. మొదలైన నామినేషన్ల ప్రక్రియ, గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే

Hyderabad Water Cut: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. నగరంలో రెండు రోజులు తాగునీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్

Telangana: భయం గుప్పిట్లో చందనపల్లి గ్రామం.. నెల రోజుల్లో 20 మంది బలి

CM Progress Report: దేశానికే ఆదర్శం టీ -ఫైబర్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ

Telangana Bandh: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?

Global Study Expo 2025: గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో- 2025, తక్కువ ఖర్చుతో విదేశీ విద్య, స్టూడెంట్స్ మాటల్లో

Hyderabad Accident: ఎల్‌బీనగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం, బైక్‌ని ఢీ కొట్టిన కారు, నుజ్జుయిన కారు

Big Stories

×