BigTV English

Viral Video: వరద నీటిలో వెళ్తే బట్టలు తడుస్తాయని ప్రిన్సిపల్ ఏం చేశాడో తెలుసా..

Viral Video: వరద నీటిలో వెళ్తే బట్టలు తడుస్తాయని ప్రిన్సిపల్ ఏం చేశాడో తెలుసా..

Viral Video: వర్షాకాలం ప్రారంభమైందో లేదో దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో చాలా చోట్ల కుండపోత వర్షాల కారణంగా ఎక్కడికక్కడ జనజీవనం స్థంబించిపోతుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు కురుస్తున్న కారణంగా కొండల నుంచి కొండచరియలు విరిగిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ఓ ప్రిన్సిపల్ చేసిన పని అందరిని ఆగ్రహానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఓ ప్రిన్సిపల్ వర్షం నీటిలో తడవకూడదని ఏకంగా ఎవరు చేయని ప్రయత్నం చేశాడు. వరద నీటిలో వెళితే తన దుస్తులు, తాను తడిచిపోతాయనే భయంతో ఏకంగా స్ట్రెచర్ పై కాలేజీకి వెళ్లాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని షాజహాన్ పూర్‌లో వెలుగుచూసింది. భారీ వర్షాల కారణంగా యూపీని వరదలు ముంచెత్తాయి. ఈ తరుణంలో షాజహాన్ పూర్ లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా నీట మునిగిపోయింది. ఈ తరుణంలో కాలేజీ ప్రిన్సిపల్ కాలేజీ నుంచి కారు వద్దకు వెళ్లే సమయంలో తాను నీటిలో తడిచిపోతానని స్ట్రెచర్ పై వెళ్లాడు. ప్రిన్సిపల్ రాజేశ్ కుమార్ తన వస్తువులును స్ట్రెచర్ పై తీసుకుని వెళ్తూ ముఖం ఎవరికీ కనపడకుండా కర్చీఫ్ అడ్డుపెట్టుకుని మరి వెళ్లాడు.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాజేశ్ కుమార్ తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విమర్శలకు రాజేశ్ కుమార్ కూడా స్పందించారు. సుమారు 300 మంది రోగులు, సిబ్బంది వర్షం నీటిలో చిక్కుకున్నారని, అంబులెన్సులు, బస్సుల ద్వారా రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే వర్షపు నీటిని చూసి భయంతో తన కాలికి గాయం ఉండడం వల్ల ఇలా స్ట్రెచర్ పై వెళ్లాల్సి వచ్చిందని వివరించారు.


Related News

Delhi News: మహీంద్రా షోరూమ్‌.. థార్‌ ఎస్‌యూవీ ఒక్కసారిగా పల్టీలు, వైరల్ వీడియో

Gigi Hadid: కేవలం ఆ టేపు చుట్టుకుని నడిచినందుకు రూ.80 కోట్లు చెల్లించారట.. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటీ?

Viral Video: మినీ బస్సులో సముద్రంలో షికారు.. ఒక్క భారీ కెరటంతో సీన్ మారిపోయింది!

Viral News: కొట్టేయడం నా హాబీ.. చోరీ కేసులో మహిళ సర్పంచ్ అరెస్ట్, ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు ఔట్!

Viral Video: పరాయి మగాడితో అడ్డంగా దొరికిన భార్య.. తట్టుకోలేక భర్త..

Shocking: శిశువును ఫ్రీజర్ లో పెట్టి నిద్రపోయిన తల్లి.. వామ్మో ఇదేం ఘోరం?

×