BigTV English

PM Modi X Followers: ప్రపంచ నేతల్లో మోదీయే టాప్.. ఎక్స్‌లో 100 మిలియన్ల ఫాలోవర్స్

PM Modi X Followers: ప్రపంచ నేతల్లో మోదీయే టాప్.. ఎక్స్‌లో 100 మిలియన్ల ఫాలోవర్స్

PM Modi X Followers: ప్రధాని మోదీ ఎక్స్ ( గతంలో ట్విట్టర్)లో 100 మిలియన్ల ఫాలోవర్లను దాటేశారు. ఫలితంగా ఇప్పుడు ప్రపంచంలో ఎక్స్‌లో అత్యధికంగా ఫాలోవర్స్ కలిగిన నేతగా మోదీ నిలిచారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. గత 3 సంవత్సరాలుగా మోదీ ఎక్స్ హ్యాండిల్‌లో ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగింది. మూడేళ్లలో 3 కోట్ల మంది యూజర్లు మోదీని ఫాలో అయ్యారు. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మోదీకి ఫాలోవర్స్ ఉన్నారు.


ప్రధాని మోదీకి రోజు రోజుకు క్రేజ్ పెరుగుతోంది. అటు రాజకీయాలైనా ఇటు సోషల్ మీడియా అయినా తగ్గేదేలే అంటూ ప్రధాని దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో ప్రధాని మోదీ టాప్‌లో ఉన్నారు. ఏ దేశ నేతలకు లేనంత క్రేజ్ భారత ప్రధానమంత్రికి ఉంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ అనతికాలంలోనే సోషల్ మీడియాలో ఈ రికార్డు సృష్టించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం దుబాయ్ పాలకుడు హెచ్‌హెచ్ షేక్ మహ్మద్‌కు 11.2, పోప్ ఫ్రాన్సిస్ కు 18. 5 మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ప్రపంచ నాయకుల కంటే ప్రధాని మోదీ ఫాలోవర్ల సంఖ్యలో ముందు ఉన్నారు. భారత్ లో వివిధ రాజకీయ నాయకుల సోషల్ మీడియా ఫాలోవర్లతో పోల్చినపుడు మోడీ ప్రత్యేకంగా నిలిచారు. రాహుల్ గాంధీకి 26.4 మిలియన్లు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 27.5 మిలియన్లు, అఖిలేశ్ యాదవ్‌‌కు 19 మిలియన్లు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 7.34 మిలియన్ల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు.


మోదీకి ఉన్న ప్రజాదరణ చూసి ప్రపంచ నాయకులు సోషల్ మీడియాలో ప్రధానిని అనుసరించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే మోదీతో కనెక్ట్ అవ్వడం వల్ల వారి ఫాలోవర్ల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. ఇటీవల ఇటలీతో పాటు ఆస్ట్రియాలో కూడా ఇదే కనిపించింది. విరాట్ కోహ్లీ 64 మిలియన్లు, బ్రెజీలియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు నెమార్ 63.6 మిలియన్లు, అమెరికన్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ 52.19 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు.

Also Read: డేంజర్ జోన్ లో మోదీ సర్కార్..కొంప ముంచిన ఉప ఎన్నికలు

గ్లోబల్ అథ్లెట్లతో పోల్చినప్పుడు మోదీకే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. 2009 లో మోదీ ఈ ప్లాట్‌ఫామ్‌లోకి చేరినప్పటి నుంచి నిర్మాణాత్మక పోస్టులు చేస్తూ ఉన్నారు. ఆయన తరుచూ ఆకర్షణీయమైన పోస్టులను పోస్ట్ చేస్తూ ఉంటారు. అనేక మంది సాధారణ పౌరులు సైతం మోదీని అనుసరిస్తున్నారు. ఎవరైనా సందేశాలు పంపిస్తే వాటికి స్పందించి మోదీ రిపోర్టు కూడా చేస్తారు. మోదీ ఇప్పటి వరకు ఎవ్వరినీ బ్లాక్ చేయలేదు. ఆకర్షణీయమైన పోస్టులతో మోదీ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ఆకర్షించారు.

 

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×