E-Paper
Advertisement

Horrible Incident: బంగీ జంపింగ్ లో తాడు తెగి.. 80 ఫీట్ల ఎత్తు నుంచి పడి..షాకింగ్ వీడియో వైరల్!

Horrible Incident: బంగీ జంపింగ్ లో తాడు తెగి.. 80 ఫీట్ల ఎత్తు నుంచి పడి..షాకింగ్ వీడియో వైరల్!
Advertisement

ఉత్తరాఖండ్‌ లోని రిషికేశ్‌ లో జరిగిన ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బంగీజంప్ చేస్తుండగా, తాడు తెగి ఓ యువకుడు ఏకంగా 180 అడుగుల ఎత్తు నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఈ నెల 12న తపోవన్-శివపురి రోడ్డులోని థ్రిల్ ఫ్యాక్టరీ అడ్వెంచర్ పార్క్‌ లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సిసిటివి ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గాయపడిన వ్యక్తిని హర్యానాలోని గురుగ్రామ్ కు చెందిన 24 ఏళ్ల సోను కుమార్‌ గా గుర్తించారు.  గాయపడిన వెంటనే అతడిని ఎయిమ్స్ రిషికేశ్‌ లో చేర్చారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఈ ఘటనపై పోలీసులు ఏం చెప్పారంటే?

ఈ ఘటనపై పోలీసులు కీలక ప్రటన చేశారు. అడ్వెంచరస్ గేమ్స్ కోసం సోను శివపురికి వెళ్లినట్లు చెప్పారు. అతను బంగీ జంపింగ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, జంప్ చేసిన తర్వాత అకస్మాత్తుగా తెగిపోవడంతో అతడు ఏకంగా 180 ఫీట్ల ఎత్తు నుంచి కింద పడిపోయాడు. నేరుగా అతడు చెట్టు కొమ్మల మీద పడుతూ.. చివరికి ఒక టిన్ షెడ్ పై పడి ఆసుపత్రి పాలయ్యాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. ఫిర్యాదు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు  వెల్లడించారు. అటు ఓ వ్యక్తి తన స్నేహితుడు జంగీ జంప్ కోసం రిషికేశ్‌ లోని థ్రిల్ ఫ్యాక్టరీకి వెళ్లాడని, అతడు జంప్ చేసని కాసేపటికే ఈ ప్రమాదం జరిగిందని ఎక్స్ వేదికగా వెల్లడించాడు. గతంలోనూ ఈ థ్రిల్ ఫ్యాక్టరీలో కొన్ని ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటన దేశంలోని అడ్వెంచరస్ క్రీడలలో సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి ఆందోళనలను లేవనెత్తింది.

Advertisement

ఇంతకీ బంగీ జంపింగ్ అంటే ఏంటి?   

Advertisement

బంగీ జంపింగ్ అనేది ఓ అడ్వెంచర్ గేమ్. ఈ గేమ్ లో ఓ వ్యక్తి కాళ్లకు పెద్ద సాగే తాడును కడతారు. సుమారు 200 ఫీట్ల మీద ఎత్తు నుంచి దూకమంటారు. పై నుంచి దూకిన తర్వాత సాగే తాడు కారణంగా మళ్లీ అతడు పైకి ఎగురుతాడు. మళ్లీ కిందికి వెళ్తాడు. కొద్ది సమయం పాటు ఇలాగే కొనసాగుతుంది. బంగీ జంప్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రదేశాలలో ఆనందించే ఒక రకమైన గేమ్. కానీ, ఇది చాలా డేంజరస్ గేమ్. ఏమాత్రం అటు ఇటు అయినా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అందుకే, ఈ గేమ్ ఆడేవాళ్లు శారీరకంగా, మానసికంగా బలంగా ఉడటం అవసరం.

Read Also: జపాన్‌లో ఇళ్లన్నీ ఖాళీ.. ఫ్రీగా ఇచ్చేయడానికి సిద్ధమవుతోన్న ప్రభుత్వం, మీకు కావాలా?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×