E-Paper
Advertisement

Kaantha Movie Review : ‘కాంత’ మూవీ రివ్యూ : దుల్కర్ కోసం మాత్రమే కొంత

Kaantha Movie Review : ‘కాంత’ మూవీ రివ్యూ : దుల్కర్ కోసం మాత్రమే కొంత
Advertisement

Kaantha Movie Review : దుల్కర్ సల్మాన్, రానా కలయికలో రూపొందిన పీరియాడికల్ మూవీ ‘కాంత’. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…

కథ :

1950 లలో సినిమా నేపథ్యంలో సాగే కథ ఇది. అయ్య(సముద్రఖని) తన తల్లి జీవితాన్ని ఆధారం చేసుకుని ‘శాంత’ అనే టైటిల్ తో ఓ సినిమా తీయాలనుకుంటాడు.ఒక రకంగా ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్. దీని కోసం అతని శిష్యుడు టి.కె.మహదేవన్ ని హీరోగా ఎంపిక చేసుకుంటాడు. అతను కూడా అవకాశాల కోసం చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అయితే ‘శాంత’ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోతుంది. అయినప్పటికీ టి.కె.మహదేవన్ కి వేరే సినిమాల్లో అవకాశాలు వస్తాయి. అతను పెద్ద స్టార్ హీరో అయిపోతాడు.

Advertisement

దాదాపు 8 ఏళ్ళ తర్వాత ‘శాంత’ ప్రాజెక్టు మళ్ళీ సెట్స్ పైకి వెళ్లాల్సి వస్తుంది. అయితే టి.కె.మహదేవన్ అప్పటికే స్టార్ హీరో అవ్వడం వల్ల.. కథలో మార్పులు కావాలని కోరతాడు. అందుకు అయ్య ఒప్పుకోడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. మరోపక్క నిర్మాత కోసం సినిమాని కంప్లీట్ చేయాలి. వీరి మధ్య సంధి కుదిర్చేందుకు కుమారి(భాగ్య శ్రీ బోర్సే) ప్రయత్నిస్తుంది. అలా షూటింగ్ చివరి రోజు వరకు వెళ్తుంది. అయితే అదే రోజున సెట్స్ లో ఓ వ్యక్తి చనిపోతాడు. దీంతో ఇన్స్పెక్టర్ దేవరాజ్(రానా దగ్గుబాటి) రంగంలోకి దిగుతాడు. షూటింగ్ స్పాట్లోనే అతను ఎంక్వైరీ చేస్తుంటాడు. చివరికి సినిమా కంప్లీట్ అయ్యిందా? హత్య చేయబడ్డ వ్యక్తి ఎవరు? అతన్ని ఎవరు చంపారు? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా

విశ్లేషణ :

సినిమా బ్యాక్ డ్రాప్లో సినిమా అనేసరికి చాలా మంది ప్రేక్షకులకు ఆసక్తి సన్నగిల్లుతుంది. కానీ ‘మహానటి’ బ్లాక్ బస్టర్ అయ్యి ఆ అభిప్రాయాన్ని కొంతవరకు మార్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ అదే బ్యాక్ డ్రాప్లో వచ్చిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. ‘కాంత’ టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించడంలో విఫలమయ్యాయి. అందువల్ల ‘కాంత’ ప్రీమియర్స్ టాక్ పై ఆధారపడాల్సి వచ్చింది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ గురు శిష్యులు అయినటువంటి దర్శకుడు, హీరోల మధ్య వచ్చే ఇగో క్లాష్ ఎపిసోడ్ ను బాగా రాసుకున్నాడు.

Advertisement

అలాగే సెట్ లో హత్య జరగడం దాని కోసం పోలీసులే అక్కడకి వచ్చి ఇన్వెస్టిగేట్ చేయడం అనే పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవి 2 తీసేస్తే కథనం చాలా వీక్ గా సాగుతుంది. స్క్రీన్ ప్లేలో డిటైలింగ్ ఎక్కువ ఉండటం వల్ల.. ప్రేక్షకులకి ఆవలింతలు వచ్చేస్తాయి అనడంలో సందేహం లేదు. టెక్నికల్ గా మాత్రం 1950 ..ల వాతావరణాన్ని తీసుకొచ్చిన విధానం బాగుంది. అందుకు సినిమాటోగ్రాఫర్ ని మెచ్చుకోవాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంపాక్ట్ చూపించింది. చెప్పుకోడానికి టెక్నికల్ అంశాలు ఎన్ని ఉన్నా.. కథనం వీక్ గా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. ‘కాంత’ విషయంలో అదే జరిగింది.

నటీనటుల విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్ మరోసారి తన ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ తో ఔరా అనిపించాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. క్లోజప్ షాట్స్ లో ఇతను తన తండ్రి మమ్ముట్టిని మించిపోయి ఎక్స్ప్రెషన్స్ పలికించాడు అనడంలో సందేహం లేదు. ఇక హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఈ సినిమాలో కొంచెం పెర్ఫార్మన్స్ చేసింది. క్లోజప్ షాట్స్ లో కూడా ఆకట్టుకుంది. వాస్తవానికి ఇదే ఆమె ఫస్ట్ సినిమా అట. కానీ షూటింగ్ డిలే అవ్వడంతో ‘మిస్టర్ బచ్చన్’ ‘కింగ్డమ్’ వంటివి ముందుగా వచ్చాయి. ఇక సముద్రఖని ఎప్పటిలానే సింగిల్ ఎక్స్ప్రెషన్ తో లాగించేశాడు. రానా కనిపించింది కాసేపే అయినా.. బాగా ఇవాల్వ్ అయ్యి చేశాడు. మిగిలిన నటీనటులు ఓకే.

ప్లస్ పాయింట్స్ :

దుల్కర్ సల్మాన్
టెక్నికల్ వాల్యూస్
సంభాషణలు

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే
సెకండాఫ్

మొత్తంగా ‘కాంత’ టెక్నికల్ గా నెక్స్ట్ లెవెల్లో ఉన్నప్పటికీ.. కథనంలో ల్యాగ్ ఉండటం వల్ల సదా సీదా సినిమాగా మిగిలిపోతుంది.

Kaantha Movie Rating : 1.75 / 5

Related News

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

Big Stories

Advertisement
×