E-Paper
Advertisement

పాకిస్తాన్ క్రికెట్‌లో జీరోలు తప్ప, హీరోలు ఒక్కడూ లేడు.. అందుకే మ్యాచ్‌లు ఎవడూ చూడటం లేదు

పాకిస్తాన్ క్రికెట్‌లో జీరోలు తప్ప, హీరోలు ఒక్కడూ లేడు.. అందుకే  మ్యాచ్‌లు ఎవడూ చూడటం లేదు
Advertisement

Shoaib Akhtar On Pakistan Cricket:  పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఒకప్పుడు పులిలా గాండ్రించిన పాకిస్తాన్, ఈ మధ్య కాలంలో జింబాబ్వే లాంటి పసికూన జట్ల చేతుల్లోనూ ఓడిపోతూ పరువు తీసుకుంటోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్స్ లలో కనీస పోటీని ఇవ్వకుండా గ్రూప్ స్టేజ్ ల్లోనే ఎలిమినేట్ అవుతూ వస్తోంది. ఇక టీమిండియాతో జరిగే మ్యాచ్ ల్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోతూ వస్తోంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లను ఆ దేశపు అభిమానులు కూడా చూడటం లేదు. దీంతో వ్యూయర్ షిప్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇలాంటి తరుణంలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ రోజు రోజుకు దిగజారుతోందని ఫైర్ అయ్యాడు. ఒకప్పుడు పాకిస్తాన్ జట్టులో హీరోలు ఉండేవారని, ఇప్పుడు అందరూ జీరోలేనని పరువు తీశాడు. 25 కోట్లకు పైగా జనాభా ఉన్నప్పటికీ, పాకిస్తాన్ జట్టును కాపాడేందుకు హీరో లాంటి క్రికెటర్లు ఎవరూ రావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశాడు.

పాకిస్తాన్ క్రికెట్‌లో జీరోలు తప్ప, హీరోలు ఒక్కడూ లేడు – షోయబ్ అక్తర్

పాకిస్తాన్ క్రికెట్ జట్టును కాపాడేందుకు ఇమ్రాన్ ఖాన్ లాంటి హీరోలను తయారు చేయడం లేదంటూ పీసీబీ బోర్డుపై మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్  ( Shoaib Akhtar On Pakistan Cricket) ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ జట్టు పేరు చెబితే బాబర్ ఆజం పేరు తప్ప, మరో ప్లేయర్ పేరు వినిపించడం లేదని విమర్శించాడు. బాబర్ ఆజం పని ఎప్పుడో అయిపోయిందని, కానీ ఇప్పటికీ వాడి జపమే చేస్తున్నారని చురకలు అంటించాడు. ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్‌లో జీరోలు తప్ప, హీరోలు ఒక్కడూ లేడని.. అందుకే మ్యాచ్‌లు ఎవడూ చూడటం లేదని ఎద్దేవా చేశాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

ఇమ్రాన్ ఖాన్ కాలంలో పాకిస్తాన్ జట్టు పేరు చెబితేనే టీమిండియా వణికిపోయేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో టీమిండియా, పాక్ మ్యాచ్ లు జరిగినప్పుడు తన కొడుకులను స్టేడియానికి ఇమ్రాన్ ఖాన్ తీసుకొచ్చేవాడని గుర్తు చేశాడు. మ్యాచ్ అంటే దాయాది జట్లదేనని వాళ్లకు హితోపదేశం చేసేవాడని పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ జట్టు ఆడే మ్యాచ్ లు చూడాలనే ఆసక్తి ఒక్కడికి ఉండటం లేదని పరువు తీశాడు. నా కొడుకులు కూడా పాకిస్తాన్ మ్యాచ్ లు చూడబోరని, వాళ్లకు చూపించే సాహసం తాను చేయనంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లు చూస్తే అసహ్యం వేస్తోందని, తన కొడుకులు వాటిని చూడలేరన్నాడు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

Related News

జాకబ్ బెథెల్ మాములోడు కాదు.. 2030 ఐపీఎల్ నాటికి రూ.150 కోట్లు కొల్లగొడతాడు

నవంబర్ 22న టీమిండియాకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఓటమిని రుచి చూపిస్తాం

అమిత్ షా కొడుకనే ఐసీసీ చైర్మ‌న్ కూర్చీలో జై షాను కూర్చోబెట్టారు!

2023లో ధోనిని చెన్నై ప్లేయ‌ర్లు ప‌చ్చి బూతులు తిట్టాడు..ఆకాశ్ చోప్రా సంచ‌ల‌నం

ట్రావిస్ హెడ్ పోతే ఏంటి? భ‌యంక‌ర‌మైన కాటేర‌మ్మ కొడుకుల‌ను దించుకున్న కావ్య పాప‌

జై షా కార‌ణంగా టీమిండియా, పాకిస్తాన్ క్రికెట‌ర్లు త‌న్నుకు చస్తున్నారు!

ధోనిని జ‌న్మ‌లో క్ష‌మించ‌ను…ఐపీఎల్ రిటైర్మెంట్ పై యోగరాజ్ సింగ్ ఫైర్

Big Stories

Advertisement
×