E-Paper
Advertisement

మృణాల్ ఠాకూర్ స్టైలిష్ లుక్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అదరగొట్టేస్తోందిగా!

మృణాల్ ఠాకూర్ స్టైలిష్ లుక్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అదరగొట్టేస్తోందిగా!
Advertisement

Mrunal Thakur:మృణాల్ ఠాకూర్.. సీతగా సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన ఈ ముద్దుగుమ్మ సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌తో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుందన్న సంగతి చెప్పక్కర్లేదు. తాజాగా ఈ భామ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో షేర్ చేసిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో మంటలు పుట్టిస్తున్నాయి.

‘నోయిర్.. విత్ ఏ ఫెమినైన్ ట్విస్ట్’ అనే క్యాప్షన్ తో వదిలిన ఈ లుక్‌లో మృణాల్ చాలా క్లాసీగా, రాయల్‌గా కనిపించందనే చెప్పాలి. ఇక ఈ ఫొటోషూట్‌లో మృణాల్ ధరించిన స్లీవ్‌లెస్ బ్లాక్ అవుట్‌ఫిట్ ఈ లుక్ కి మరింత ఎసెట్ గా నిలిచిపోయింది. సింపుల్‌గా కనిపిస్తూనే రిచ్ లుక్‌ను మెయింటేన్ చేసిన ఈ భామ మెడకు ధరించిన లేయర్డ్ నెక్లెస్‌లు, గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ, చేతులకు బ్రేస్‌లెట్లు, చెవులకు అందమైన ఇయర్ రింగ్స్ ఈ లుక్‌ను మరింత అందంగా మార్చాయనడం లో సందేహం లేదు.ఇక మేకప్ విషయానికి వస్తే కళ్లు హైలైట్ అయ్యేలా బోల్డ్ ఐ మేకప్, న్యూడ్ లిప్‌స్టిక్, వదులుగా వదిలేసిన జుట్టు ఈ అందాన్ని డబల్ చేసేశాయి.

Advertisement

సినిమాల పరంగా చూస్తే మృణాల్ ఠాకూర్‌కు తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన క్రేజ్ ఉందన్న సంగతి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.దుల్కర్ సల్మాన్ సరసన నటించిన ‘సీతారామం’ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. ఆ తర్వాత నానితో కలిసి నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రంలో యష్న పాత్రతో మరోసారి అలరించిన మృణాల్ విజయ్ దేవరకొండతో ‘ది ఫ్యామిలీ స్టార్’, ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది.

ఇక తెలుగు తో పాటు హిందీలో ‘సూపర్ 30’, ‘జెర్సీ’ వంటి సరికొత్త సినిమాల్లో నటించి సత్తాచాటింది . అలాగే 2026లో ‘దో దివానే షెహర్ మే’, ‘డాకోయిట్’, ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’, ‘పూజా మేరీ జాన్’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది కూడా. అలరించడానికి సిద్ధమయ్యారు.

Advertisement

మొత్తానికి సినిమాల్లో వెరైటీ పాత్రలు పోషిస్తూనే, రియల్ లైఫ్‌లో ఫ్యాషన్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపుతుంది మృణాల్. ఇక ట్రెడిషనల్ శారీలలో ఎంత అందంగా కనిపిస్తారో, మోడ్రన్ బ్లాక్ అవుట్‌ఫిట్స్‌లోనూ అంతే స్టైలిష్‌గా మెరిసిపోగలనని మరోసారి ప్రూవ్ చేసేసింది.ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి బ్లాక్ అండ్ గోల్డ్ లుక్‌తో మరోసారి నెటిజన్లని తనవైపు తిప్పుకుని అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ !

Tags

Related News

రామకృష్ణకు అప్పటికే పెళ్లైందా? గీతాంజలి కొడుకు షాకింగ్ కామెంట్స్!

సీఎం విజయ్ కు ధనుష్ స్పెషల్ థాంక్స్..ఎందుకంటే?

హైదరాబాద్ వేదికగా గ్లోబల్ హంగామా.. టాలీవుడ్ రెడీ!

ఏడాది జైలు శిక్ష.. కోర్టు తీర్పుపై బండ్ల గణేశ్ రియాక్షన్ వైరల్!

రూ.50 పెట్టుబడితో ఈ స్థాయిలో ఉన్నా.. అలీ సక్సెస్ సీక్రెట్ అదేనా?

వారణాసి విడుదల వాయిదా?కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?

15 నిమిషాల కార్ జర్నీలో పుట్టిన పాట.. ఇప్పుడు అందరి మనసుల్లో!

Big Stories

Advertisement
×