E-Paper
Advertisement

Viral story: సినిమాను తలపించే సీన్.. మనుషులు చేయలేని పనిని ఈ కుక్కలు చేసి చూపించాయి!

Viral story: సినిమాను తలపించే సీన్.. మనుషులు చేయలేని పనిని ఈ కుక్కలు చేసి చూపించాయి!
Advertisement

Viral story: కుక్కలకు, మనుషులకు మధ్య ఉండే అనుబంధం ఈనాటిది కాదు. మాటలు రాకపోయినా, మనసులోని భావాలను కనిపెట్టడంలోనూ, ప్రాణాలకు తెగించి యజమానిని కాపాడుకోవడంలోనూ కుక్కల తర్వాతే ఏదైనా. యజమాని అడుగుల చప్పుడును మైళ్ల దూరం నుంచే గుర్తుపట్టే శ్రవణ శక్తి, వాసనతో దారిని వెతుక్కునే అద్భుతమైన చాకచక్యం వాటి సొంతం.

సరిగ్గా ఇలాంటి అపురూపమైన సంఘటనే చైనాలోని జిలిన్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. సాధారంణంగా దొంగల బారిన పడితే తిరిగి రావడం కష్టమే, అది కూడా డాగ్ మీట్ మార్కెట్ లాంటి భయంకరమైన ప్రదేశానికి తరలిస్తుంటే ఇక ఆశలు వదులుకోవాల్సిందే. కానీ అక్కడ ఆ శునకాలు తమ తెలివితేటలతో మృత్యువును జయించాయి.

Advertisement

అక్రమ రవాణాదారులు ఈ కుక్కలను దొంగిలించి డాగ్ మీట్ మార్కెట్‌కు తరలిస్తుండగా… ఒక కార్గీ జాతి కుక్క నాయకత్వంలో అవి చాకచక్యంగా ట్రక్కు నుండి తప్పించుకున్నాయి. ఈ ప్రయాణంలో ఒక జర్మన్ షెఫర్డ్ తీవ్రంగా గాయపడినప్పటికీ .. మిగిలిన కుక్కలు దానిని వదిలి పెట్టకుండా అండగా నిలిచాయి. హైవేలు, ప్రమాదకరమైన ప్రాంతాల గుండా సుమారు 17 కి. మీ కలిసికట్టుగా ప్రయాణించాయి.

వాటికి  ఎలాంటి దారి తెలియకపోయినా.. కేవలం తమ వాసన చూసే శక్తితో.. ఐక్యమత్యంతో రెండు రోజుల పాటు శ్రమించి అవి సురక్షితంగా తమ యజమాని ఇంటికి చేరుకున్నాయి. యజమానులు తమ కుక్కలను తిరిగి చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలోవైరల్ గా మారింది.

Advertisement

Also Read: తగ్గేదేలే అంటున్న ఈటల.. బీజేపీలో సెగలు పుట్టిస్తున్న రాజేందర్ లేటెస్ట్ వార్నింగ్

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA%3D%3D

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×