Chai Reel On Busy Road| బాబోయ్ సోషల్ మీడియాలో రీల్స్ చేయాలనే పిచ్చి ఇప్పుడు జనానికి బాగా ఎక్కేసింది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో గుర్తింపు కోసం విచిత్రంగా వీడియోలు చేయాలనే ఆలోచనతో ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. కొంత మంది ప్రాణాలకు తెగించి రైళ్లపై పరిగెడుతుంటే, మరొకొందరు హై వేల పై ఉన్న సైన్ బోర్డుకు వేలాడుతూ వ్యాయమం చేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఒక మహానుభావుడు.. ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ కోసం ఏదైనా వినూత్నంగా చేయాలని భావించాడు. అందుకే విచక్షణా రహితంగా ప్రవర్తించాడు.
వివరాల్లోకి వెళితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ బాగా వైరల్ అవుతోంది. అందులో ఒక యువకుడు అందరి దృష్టిని ఆకట్టుకోవడానికి.. బాగా బిజీ రోడ్డులో ఒక స్టంట్ చేస్తున్నాడు. రోడ్డుపై ఆటోలు, బైక్‌లు, కార్లు వేగంగా వెళుతుండగా.. రోడ్డు మధ్యలో ఓ ఆఫీసు కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని దర్జాగా టీ తాగుతున్నాడు. దీంత అతడిని రోడ్డుపై వెళ్లే వాహనదారులందరూ విచిత్రంగా చూస్తున్నారు. అలా చేయడం అతడికే కాకుండా వాహనదారులు కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఆ మాత్రం విచక్షణ లేకుండా కేవలం తాను ఫేమస్ అయిపోవాలని ఆ యువకుడు ఈ వీడియోలో స్టంట్ చేస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియోలోని కనిపిస్తున్న దృశ్యాలు బెంగుళూరు నగరానికి చెందినవి.
తిక్క కుదిర్చిన బెంగుళూరు పోలీసులు
వెస్ట్ బెంగుళూరులోని ఆర్టేరియల్ రోడ్డు మగాడి ప్రాంతంలో ఈ వీడియోని షూట్ చేశారు. ఏప్రిల్ 12, 2025న ఈ వీడియో షూట్ చేసి అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. విపరీతంగా వైరల్ అయింది. దీంతో విషయం తెలుసుకున్న బెంగుళూరు పోలీసులు ఆ యువకుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
బెంగుళూరు పోలీసులు ఈ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసి దానికి క్యాప్షన్ కూడా పెట్టారు. “టీ తాగేందుకు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ ఫైన్ పడడంతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. అంతే కాని మీరు ఫేమస్ అయిపోరు.” అని ఆ క్యాప్షన్ లో రాశారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడితే పరిణామాలు సీరియస్ గా ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు.
Taking tea time to the traffic line will brew you a hefty fine, not fame !!! BEWARE BCP is watching you#police #awareness #weserveandprotect #stayvigilant pic.twitter.com/5A8aCJuuNc
— ಬೆಂಗಳೂರು ನಗರ ಪೊಲೀಸ್ BengaluruCityPolice (@BlrCityPolice) April 17, 2025
Also Read: పురుషుల్లో సంతానలేమి సమస్యలు.. ప్రపంచంలోనే తొలిసారి స్పెర్మ్ రేసింగ్ పోటీలు
ఇలాంటి డేంజరస్ స్టంట్స్ చేసేవారికి ఇటీవలి కాలంలో కొరత లేదు. నెల రోజుల క్రితమే ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు ప్రాణాలు ఫణంగా పెట్టి ఒక భయంకరమైన స్టంట్ చేశారు. అందులో ఎత్తుగా ఉన్న బిల్డింగ్ పై కప్పు నుంచి ఈ భద్రత లేకుండా వేలాడుతూ కనిపించారు. ఒక యువకుడి చేయి మాత్రమే పట్టుకొని కిందకు వేలాడారు. కొంచెం చేయి జారినా వారు ప్రాణాలు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. వారు ఈ స్టంట్ వీడియో రికార్డ్ చేయడానికే ఇదంతా చేశారు. ఆ టీనేజ్ అమ్మాయిలు పుణె నగరానికి చెందినవారిగా తెలిసింది. వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేయాలని నెటిజెన్లందరూ కామెంట్లు చేశారు.
మరి కొందరు నెటిజెన్లు అయితే వారు ఇలాంటి ప్రమాదకర వీడియోలు చేయకుండా కౌన్సెలింగ్ చేయించాలని చెప్పాడు.
Punekars doing life threatening stunt just to create reel. God knows what is going wrong with the teen crowd of Pune.
India is definitely not for beginners
pic.twitter.com/5VEJg9XR1D— Radhika Bajaj (@radhika_bajaj) June 20, 2024