BigTV English

IPL Betting: ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్.. డబ్బులు కోసం బుల్లెట్, ఐఫోన్ అమ్మి చివరకు

IPL Betting: ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్.. డబ్బులు కోసం బుల్లెట్, ఐఫోన్ అమ్మి చివరకు

IPL Betting: క్రికెట్ గ్రౌండ్‌లో ఆట. కానీ గ్రౌండ్ బయట అదో పెద్ద బిజినెస్. ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు వందకోట్లు ఖర్చయితే ఆ మ్యాచ్ మీద 200 కోట్ల బెట్టింగ్ నడుస్తోంది. క్రికెటర్లు, బోర్డులు అడ్వడైజ్ మెంట్స్ ఏజెన్సీలు, చీర్ గాళ్స్ ఎంత సంపాదిస్తారో తెలీదు కానీ, జన్మలో క్రికెట్ ఆడకుండా అదే క్రికెట్ పై కోట్లు రూపాయలు సంపాదిస్తున్నారు బెట్టింగ్ రాయళ్లు. ఈ బెట్టింగ్ మోజులో పడి అస్తులు పోగొట్టుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తమ జీవితాలతో పాటు కుటుంబ సభ్యుల జీవితాలను కూడా పణంగా పెట్టి పందాలు కడుతున్నారు. ఇప్పుడు క్రికెట్ అంటే ఆట మాత్రమే కాదు.. క్రికెట్ అంటే వ్యాపారం.


క్రికెట్లో ఎప్పటి నుంచో బెట్టింగ్ ఉంది. కానీ ఐపీఎల్ రాకతో బెట్టింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. గంటల్లో కోట్లు సంపాదించవచ్చని, స్టాక్ మార్కెట్లో కలలో కూడా ఊహించని రాబడి వస్తుందన్న మోజే బెట్టింగ్ లకు క్రేజ్ పెంచుతోంది. బెట్టింగ్‌‌‌కు పల్లె, పట్టణం అనే తేడా లేదు. వ్యక్తుల ఆదాయంతో సంబంధమే లేదు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల నుంచి కాలేజీ స్టూడెంట్ల వరకు, ఉద్యోగం నుంచి రిటైర్డ్ వ్యక్తుల వరకు అందరూ బెట్టింగ్ మోజులో బుక్కైపోతున్నారు.

తాజాగా ఇదే బెట్టింగ్ యాప్‌తో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈజీ మనీ వేటలో కూరుకుపోయి తన ఊపిరే తీసుకున్నాడు ఓ యువకుడు. హైదరాబాద్ లో ఓ యువకుడు బెట్టింగ్ కు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గద్వాల్ జిల్లా కు చెందిన పవన్ మాసబ్ ట్యాంక్ లోని ఓ కాలేజీలో ఎమ్ టెక్ చదువుతున్నాడు. ఈజీమనీకి అలవాటు పడి బెట్టింగులు వేయండం మొదలు పెట్టాడు. తన తల్లిదండ్రుల పంపిన డబ్బులను సైతం ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ లో పెట్టేవాడు. ఎక్కువ డబ్బులు వస్తాయని వద్ద ఉన్న ఐ ఫోన్, బైక్ అమ్మి బెట్ వేశాడు. డబ్బులు మొత్తం పోవడంతో మనస్థాపానికి గురైన పవన్ అత్తా పూర్ లోని తన రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పవన్ మరణ వార్త విని అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.


Also Read: ముచ్చటగా మూడో పెళ్లికి ప్లాన్.. నాలుగు నెలలకే ఆ పాపకు నూరేళ్లు

ఇదే ఇష్యూపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌ల బాధితులకు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. సమస్య ఏదైనా ఆత్మహత్య పరిష్కారం కాదని అన్నారు. వద్దు.. ఆత్మహత్య ఆలోచనే రానివ్వొద్దు. కష్టం వచ్చిందని క్షణికావేశంలో నిండు ప్రాణాన్ని నిమిషంలో తీసుకుని ఏం సాధిస్తారు. ఆత్మహత్యలు చేసుకుంటే కష్టాలు, బాధలు పోతాయా? అయిన వాళ్ళందరిని వదిలి ఇలా హఠాత్తుగా వెళ్లిపోయాలనే ఆలోచన మంచిది కాదన్నారు. చనిపోవడానికి ఒక్కటే కారణం కానీ, బతకడానికి 1000 కారణాలు ఉంటాయని తెలుసుకోండి. బలవన్మరణాలు వద్దు.. బతికి సాధించడమే ముద్దు అని సజ్జనార్ పేర్కొన్నారు.

అసలు బెట్టింగ్ అంటే ఏంటో కూడా తెలీనోడికి, ఆన్ గేమ్ అంటే ఇంట్రస్ట్ లేనోడికి.. గ్యాంబ్లింగ్ గురించి కొంచెం కూడా అవగాహన లేనోడికి.. డబ్బుల మీద ఆశ చూపించి.. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఇంట్రస్ట్ పుట్టించినవే.. ఈ బెట్టింగ్ యాప్స్. సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్ల మాటల్ని గుడ్డిగా నమ్మి.. అడ్డంగా బుక్కైపోయిన వాళ్ల లెక్కలెన్నో ఉన్నాయి. వాళ్లు పోగొట్టుకున్న డబ్బులకు లెక్కే లేదు. వాళ్లు కోల్పోయిన జీవితాలకు.. విలువ కట్టగలమా? వాళ్ల నష్టాన్ని ఎవరు తీర్చగలరు.

ఏమాత్రం ఆలోచించకుండా, తమనెవరు అడుగుతారులే అని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లందరికీ.. ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం.. రోజుకో మలుపు తీసుకుంటోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లందరిపై.. వరుసగా కేసులు నమోదవుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. బెట్టింగ్స్, ఆన్ లైన్ గేమ్స్ ఆడేలా ప్రేరేపించిన బెట్టింగ్ రాయుళ్ల బెండు తీస్తున్నారు పోలీసులు. ఇటీవల పాపులర్ సెలబ్రిటీలు, యాక్టర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు సహా 25 మందిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×