BigTV English

Sperm Racing Event: పురుషుల్లో సంతానలేమి సమస్యలు.. ప్రపంచంలోనే తొలిసారి స్పెర్మ్ రేసింగ్ పోటీలు

Sperm Racing Event: పురుషుల్లో సంతానలేమి సమస్యలు.. ప్రపంచంలోనే తొలిసారి స్పెర్మ్ రేసింగ్ పోటీలు

Sperm Racing Event| ప్రపంచంలోనే తొలిసారి పురుషుల వీరకణ్యాల రేసింగ్ పోటీలు జరుగబోతున్నాయి. వినడానికే విచిత్రంగా ఏదో హాలీవుడ్ సినిమాల కాన్సెప్ట్ లా అనిపించినా నిజంగా ఈ పోటీలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది కామేడీ కాదుండోయ్.. నిజం. చాలా సూక్ష్మంగా ఉండే పురుషుల వీర్య కణాలను మైక్రోస్కోప్ ద్వారా రేసింగ్ చేస్తూ చూడవచ్చు. ఈ వీర్య కణాలు రేసింగ్ చేయడానికి నిర్ధారిత రేసింగ్ ట్రాక్స్ కూడా తయారు చేశారు.


అమెరికాలోని ఓ స్టార్టప్ కంపెనీ హలీవుడ్ పల్లాడియంలో ఏప్రిల్ 25, 2025 ఈ స్పెర్మ్ పోటీలను నిర్వహిస్తోంది. ఈ సూక్ష్మ పోటీలను ప్రజలు చూడగలిగే విధంగా రికార్డ్ చేయడానికి హై డెఫినెషన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. ప్రతి సెకండ్ వాటి కదలిక ఎలా ఉండబోతోందనేది ఈ కెమెరాలు క్యాప్చర్ చేస్తుండగా.. వాటి గురించి క్రికెట్ తరహాలో కామెంటరీ, రీప్లేలు, బెట్టింగ్ సౌలభ్యం కూడా అందిస్తున్నారు.

‘స్పెర్మ్ రేసింగ్’ అనే స్టార్ట్‌ అప్ కంపెనీ నిర్వహిస్తున్న.. ఈ విచిత్ర రేసింగ్ చూసేందుకు ఇప్పటికే 1000 మంది రాబోతున్నారని సమాచారం. ఈ పోటీల గురించి తెలసుకొని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. తాము కూడా ఈ పోటీలు ఎలా వీక్షించాలని ప్రశ్నిస్తున్నారు. కంపెనీ సంస్థాపకులు మాట్లాడుతూ.. ఈ రేస్ ని మేము మంచి ఉద్దేశంతోనే చేయబోతున్నాం. ఆరోగ్యాన్ని ఒక ఆటల పోటీగా మార్చి ఆరోగ్య సమస్యలపైన మనుషులు చర్చించుకునే వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నాం. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఈ పోటీల కోసం రెండు అతిచిన్న సూక్ష్మంగా ఉండే రెండు ట్రాక్స్ ను నిర్మించాం. వీటిపై ఇద్దరు వేర్వేరు మనుషుల వీర్యం శాంపిల్స్ ని పరుగులు పెట్టిస్తాం. చూడడానికి ఇది స్విమ్మింగ్ పోటీల లా ఉంటాయి. మహిళల గర్భంలో ఈ వీర్య కణాలు ఎలా ఈదుకుంటూ వెళతాయో అందరూ చూడవచ్చు. ఈ రెండు వేర్వేరు ట్రాక్స్ లో ఫాస్ట్ గా ఈదుకుంటూ ముందుగా వెళ్లిన స్పెర్మ్ ని విజేతగా ప్రకటిస్తాం.


Also Read: 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలిక.. కష్టాలుపడి ఇంటికి తిరిగివస్తే షాకింగ్ దృశ్యం

“ప్రపంచవ్యాప్తంగా పరుషుల్లో పెరిగిపోతున్న సంతాన లేమి సమస్యలు, స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గిపోవడం వంటి సమస్యలపైన అవగాహన కల్పించి.. ఎలా వాటిని పరిష్కిరించుకోవాలి.. ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలో నిపుణుల ద్వారా సూచనలందిస్తాం. గత 50 సంవత్సరాలుగా పురుషల స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గిపోయింది. ఈ సమస్యను అందరూ సీరియస్ తీసుకోవాలి.. ఇలా రేసింగ్ అనే కాన్సెప్ట్ తో చెబితే అందరూ ఆసక్తిగా తెలుసుకుంటారు.” అని స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకులు చెప్పారు.

“మీరు స్పోర్ట్స్ కోసమో లేదా బాడి బిల్డింగ్ కోసమో శిక్షణ తీసుకుంటూ ఉంటారు. అలాగే స్పెర్డ్ కౌంట్ పెంచుకోవడానికి ఎందుకు శిక్షణ తీసుకోకూడదు. పోటీలో ఎందుకు పాల్గొన కూడదు.?” అని ఆ స్టార్టప్ కంపెనీ ప్రశ్నిస్తోంది. ఈ కంపెనీలో ఇప్పటికే అమెరికా దిగ్గజ కంపెనీలు కరాటాగె, ఫిగ్మెంట్ క్యాపిటల్ 1 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయి. ఈ స్పెర్మ్ రేసింగ్ పోటీల్లో ఇంకా సెలెబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, అథ్టెట్ల వీర్యం కూడా సేకరించి వాటి మధ్య పోటీలు కూడా ఉంటాయని.. వారి అభిమానులు బెట్టింగ్ చేసేందుకే ఇదంతా చేస్తున్నామని కంపెనీ తెలిపింది.

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×