E-Paper
Advertisement

Viral Video: భారతీయులకు ఫిట్‌నెస్ లేదు.. బాగా సోమరిపోతులు, అమెరికన్ టూరిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు

Viral Video: భారతీయులకు ఫిట్‌నెస్ లేదు.. బాగా సోమరిపోతులు, అమెరికన్ టూరిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు
Advertisement

రాజస్థాన్‌లోని చారిత్రక నగరమైన జైపూర్‌కు వచ్చే పర్యాటకులు అంబర్ ఫోర్ట్ అందాలను చూడకుండా వెనుదిరగరు. అయితే.. తాజాగా ఒక అమెరికన్ టూరిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో పెను దుమారాన్ని రేపుతోంది. భారతీయుల శారీరక దృఢత్వం (Fitness), జీవనశైలిని కించపరిచేలా అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చార్లీ ఈవాన్స్ అనే అమెరికన్ పర్యాటకుడు అంబర్ కోట వైపు వెళ్లే నిటారైన మార్గంలో నడుస్తూ ఒక వీడియోను రికార్డ్ చేశాడు. ఆ మార్గంలో చాలా మంది భారతీయులు అలసటతో మధ్యమధ్యలో ఆగి విశ్రాంతి తీసుకోవడాన్ని అతను గమనించాడు. దీనిపై స్పందిస్తూ.. ‘భారతీయులు ఎందుకు ఫిట్‌గా ఉండరో నాకు ఇప్పుడు అర్థమైంది. వేల సంఖ్యలో ప్రజలు కింద ఉన్నారు కానీ, పైన కోట వరకు చేరుకునే వారు తక్కువ. భారతీయులు సోమరిపోతులు.. అది ఈరోజే ప్రూఫ్ అయ్యింది’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.

Advertisement

?utm_source=ig_web_copy_link

మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్న పర్యాటకులు టీ, కోక్ తాగుతూ ఉండటంపై కూడా అతను అసహనం వ్యక్తం చేశాడు. ‘వీరు ప్రవేశ రుసుము చెల్లించి కూడా కోట చివరి వరకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. మధ్యలోనే ఆగిపోయి, ఇంకా ఎంత దూరం ఉంది అని అడుగుతున్నారు. వీరికి కష్టపడే తత్వం లేదు’ అని అతను వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు ఒక్కసారిగా మండిపడ్డారు.

Advertisement

ఒక కొద్దిమందిని చూసి యావత్ భారతదేశాన్ని విమర్శించడం సరికాదని నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఈవాన్స్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ నెటిజన్లు ఫైరవుతున్నారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశాడు. ‘మేము 16,000 అడుగుల ఎత్తు ఉన్న కొండలను, గుట్టలు కూడా ఎక్కి అలవోకగా తిరుగుతాము. అందరినీ ఒకేలా చూడకండి’  అని కామెంట్ చేయగా.. మరొక నెటిజన్ స్పందిస్తూ.. ‘నువ్వు కేవలం 2 శాతం ఉన్న పట్టణ జనాభాను మాత్రమే చూస్తున్నావు. తెల్లవారుజామునే లేచి ఈ కొండలను సునాయాసంగా ఎక్కే స్థానిక భారతీయుల సామర్థ్యం నీకు తెలియదు’ అని కామెంట్ చేసుకొచ్చాడు.

ఈ వివాదం సాంస్కృతిక భేదాల గురించి కూడా చర్చకు దారితీసింది. భారతదేశంలో వివిధ వయసుల వారు, వివిధ ప్రాంతాల వారు పర్యాటక ప్రాంతాలకు వస్తుంటారని, ఎండ వేడిమి, వ్యక్తిగత ఆరోగ్య కారణాల దృష్ట్యా విశ్రాంతి తీసుకోవడం సహజమని పర్యాటక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద.. ఒక విదేశీ టూరిస్ట్ చేసిన సాధారణ వ్యాఖ్యలు భారతీయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండటంతో సోషల్ మీడియాలో ఆ టూరిస్ట్‌పై విమర్శల వర్షం కురుస్తోంది..

ALSO READ: C-DAC Recruitment: డిగ్రీ అర్హతతో 805 ఉద్యోగాలు.. గోల్డెన్ అపార్చునిటీ, నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×