E-Paper
Advertisement

Karnataka Divorce Case: అమ్మ పేరున ఆస్తులు.. భార్యకు గుండు సున్నా.. ‘దేశీ హకీమీ’ మాస్టర్ ప్లాన్!

Karnataka Divorce Case: అమ్మ పేరున ఆస్తులు.. భార్యకు గుండు సున్నా.. ‘దేశీ హకీమీ’ మాస్టర్ ప్లాన్!
Advertisement

Karnataka Divorce Case: విడాకుల సమయంలో భార్యకు భరణం (Alimony) ఇవ్వకుండా తప్పించుకునేందుకు ఓ వ్యక్తి వేసిన ప్లాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటకలోని ఓ ఫ్యామిలీ కోర్టు బయట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కర్ణాటకకు చెందిన ఓ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే, తన భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని గ్రహించిన భర్త, ముందుగానే అప్రమత్తమై తన ఆస్తులన్నింటినీ తన తల్లి పేరు మీదకు బదిలీ చేశాడు. దీంతో భర్త పేరు మీద ఆస్తులేవీ లేకపోవడంతో, భార్యకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మాజీ భార్య.. కోర్టు బయట అందరూ చూస్తుండగానే అతని చొక్కా పట్టుకుని, చెప్పుతో దాడి చేసింది. అయినప్పటికీ, ఆ వ్యక్తి ఏమాత్రం కోప్పడకుండా విజయగర్వంతో చిరునవ్వులు చిందిస్తూ (Smiling) అక్కడి నుంచి వెళ్లిపోవడం వీడియోలో రికార్డైంది.

Advertisement

ఈ ఘటన చూస్తుంటే 2023లో జరిగిన ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ అచ్రాఫ్ హకీమీ వ్యవహారం గుర్తొస్తోంది. అప్పట్లో హకీమీ కూడా భార్యతో విడాకుల సమయంలో తన 70 మిలియన్ల యూరోల ఆస్తిని తల్లి పేరున రాసి, భార్యకు చిల్లిగవ్వ కూడా దక్కకుండా చేశారు. ఇప్పుడు కర్ణాటకకు చెందిన వ్యక్తి కూడా సరిగ్గా ఇదే ప్లాన్ వేయడంతో, నెటిజన్లు అతన్ని ‘లెజెండ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గృహ హింస విషయంలో జెండర్ డబుల్ స్టాండర్డ్స్ (Gender Double Standards) ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. “ఒకవేళ భర్త భార్యను ఇలా నడిరోడ్డుపై కొట్టి ఉంటే సమాజం, మీడియా రియాక్షన్ వేరేలా ఉండేది. కానీ ఇక్కడ పురుషుడు బాధితుడు కాబట్టి ఎవరూ పట్టించుకోవడం లేద.” అని కామెంట్స్ చేస్తున్నారు. భారతీయ చట్టాల ప్రకారం భరణం నుంచి తప్పించుకోవడానికి అతను చేసిన పనిని మరికొందరు సమర్థిస్తున్నారు.

Advertisement

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×