కేరళలో ఘోరం జరిగింది. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్ధులు దారుణంగా ప్రవర్తించారు. చిత్రహింసలకు గురి చేశారు. అవమానాన్ని భరించలేక 15 ఏండ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 26వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఎర్నాకులం జిల్లా త్రిప్పునితురలో జరిగింది. జనవరి 15న విద్యార్థి చనిపోగా, అందరూ ఒత్తిడితో సూసైడ్ చేసుకున్నారని భావించారు. కానీ, తాజాగా ఆ విద్యార్ధి తల్లి.. కొడుకు మరణానికి గల కారణాలను వెల్లడించడంతో అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కొడుకు ఎలా చనిపోయాడో ఆరా తీసిన తల్లి
మిహిర్ అనే 15 ఏండ్ల బాలుడు త్రిప్పునితురలోని గ్లోబల్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్నాడు. రీసెంట్ గా ఆ అబ్బాయి, సూసైడ్ చేసుకున్నాడు. అయితే, తన కొడుకు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటని అతడి తల్లి ఆరా తీసింది. ఏ ఇబ్బందితో తను చనిపోయాడో తెలుసుకునే ప్రయత్నం చేసింది. తన భర్తతో కలిసి స్కూల్ సిబ్బందిని, తోటి విద్యార్ధులను అడిగింది. అతడి పుస్తకాలు, సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలించింది. అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యింది. తాజాగా తన కొడుకు మరణానికి గల కారణాను వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. మిహిర్ ను తోటి విద్యార్ధులు ర్యాగింగ్ పేరుతో చిత్రహింసలకు గురి చేశారని, ఆ అవమానాన్ని తట్టుకోలేక చనిపోయాడని వెల్లడించింది.
మరీ అంత దారుణంగా ప్రవర్తించారా?
మిహిర్ కు తోటి విద్యార్థుల నుంచి వేధింపులు తీవ్ర స్థాయిలో ఎదురయ్యాయని రాజ్మా తెలిపింది. తన కొడుకు పట్ల తోటి విద్యార్ధులు ర్యాగింగ్ పేరుతో క్రూరంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసింది. బెదిరింపులు, భౌతిక దాడులకు దిగారని చెప్పింది. అత్యంత ఘోరం టాయిలెట్ సీటు నాకించడంతో పాటు, టాయిల్ కమ్మోడ్ లో తలపెట్టి ఫ్లష్ కొట్టారంటూ కంటతడి పెట్టింది. ఈ టార్చర్ భరించలేకే తను చనిపోయాని చెప్పుకొచ్చింది. మిహిర్ కలర్ కూడా హేళన చేశారని చెప్పింది. నల్లోడా అంటే వేధించారని చెప్పింది. మిహిర్ మరణాన్ని కూడా ర్యాగింగ్ చేసిన విద్యార్థులు సెలబ్రేట్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్స్ ను షేర్ చేసింది.
ముఖ్యమంత్రికి, డీజీపీకి మిహిర్ పేరెంట్స్ లేఖ
అటు తన కొడుకు మృతికి కారణకులపై చర్యలు తీసుకోవాలని మిహిర్ పేరెంట్స్ సీఎం కార్యాలయంతో పాటు డీజీపీకి లేఖ రాశారు. తాము సేకరించిన ఆధారాలతో కేసు నమోదు చేయాలని కోరారు. పారదర్శకంగా కేసును విచారించి బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి త్రిప్పునితుర హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
మిహిర్ పేరెంట్స్ ఆరోపణలను ఖండించి గ్లోబల్ స్కూల్
అటు మిహిర్ తల్లిదండ్రుల ఆరోపణలను గ్లోబల్ పబ్లిక్ స్కూల్ ఖండించింది. తమ స్కూల్ మీద ర్యాగింగ్, బెదిరింపుల ఆరోపణలను రావడం బాధాకరంగా ఉందని తెలిపింది. తమ స్కూల్ లో తాము ఇలాంటి వాటిని సహించబోమని తేల్చి చెప్పింది. ఎలాంటి ఆధారాలు లేకుండా చర్యలు తీసుకోలేమని ప్రకటించింది.
Read Also: సూదులతో గుచ్చుతూ.. కొవ్వొత్తితో కాల్చుతూ.. 16 ఏళ్ల అమ్మాయిపై 44 రోజులు.. 100 మంది అలాంటి చర్య!