BigTV English
Advertisement

OTT Movie : బొమ్మను ప్రేమించే అబ్బాయి… ఆ సంబంధం పెట్టుకునే మొగుడు, పెళ్ళాలు… లేచిపోయే ప్రేమ జంట

OTT Movie : బొమ్మను ప్రేమించే అబ్బాయి… ఆ సంబంధం పెట్టుకునే మొగుడు, పెళ్ళాలు… లేచిపోయే ప్రేమ జంట

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి రకరకాల కథలతో సినిమాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో ఓకే సినిమాను  మూడు కథలతో తెరకెక్కించారు మేకర్స్. ఈ మూడు కథలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మనసుకు హత్తుకునే విధంగా తెరికెక్కించిన ఈ సినిమా పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే..


నెట్ఫ్లిక్స్ (Netflix) లో

2021లో రిలీజ్ అయిన ఈ బాలీవుడ్ మూవీ పేరు ‘అంకాహి కహానియా‘ (Ankahi Kahaniya). ఈ మూవీకి అభిషేక్ చౌబే, సాకేత్ చౌదరి, అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వం వహించారు. ఇందులో అభిషేక్ బెనర్జీ, రికునాల్ బెనర్జీ, రికునాల్ బెనర్జీ నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 2021 నుండి నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ప్రదీప్ ఒక బట్టల కొట్టులో సేల్స్ బాయ్ గా పనిచేస్తుంటాడు. ఇతని ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ, ఇతనికి మాత్రం ఎవరూ ఉండరు. ఒంటరితనానికి ఎక్కువ అలవాటు పడిపోయి ఉంటాడు. ఒకరోజు బట్టల షాపు యజమాని ఒక బొమ్మని ఆర్డర్ చేస్తాడు. ఆ బొమ్మని ప్రదీప్ ను తీసుకు రమ్మంటాడు. ప్రదీప్ కి ఆ బొమ్మను చూసిన వెంటనే బాగా నచ్చుతుంది. ఆ బొమ్మతోనే ఎక్కువగా మాట్లాడుతూ, తన బాధలు కూడా చెప్పుకుంటూ ఉంటాడు. ఆ బొమ్మకి మంచిగా డ్రెస్ వేసి, నగలు కూడా పెడతాడు. అప్పటినుంచి సేల్స్ కూడా బాగా పెరుగుతాయి. షాప్ యజమాని ప్రదీప్ కి ఇంక్రిమెంట్ కూడా పెంచుతాడు. ఒకరోజు ఆ బొమ్మని బయటకు తీసుకెళ్లి, సరదాగా అలా గడుపుతూ వస్తాడు. ఇది చూసిన యజమాని అతన్ని పనిలో నుంచి తీసేస్తాడు. ఇంటికి వచ్చిన ప్రదీప్ కి పెళ్లి చూపులు జరుగుతాయి. తన చిన్ననాటి స్నేహితురాలని పెళ్లి చేసుకోబోతాడు. ఈ విషయం తన యజమానికి చెప్పి, ఇంకెప్పుడు అలా చేయనని ఉద్యోగం కావాలని అడుగుతాడు. సేల్స్ లో మంచి ప్రావీణ్యం ఉన్న ప్రదీప్ కి మళ్ళీ ఉద్యోగం ఇస్తాడు. అయితే బొమ్మను మాత్రం షాపు యజమాని వేరే వాళ్ళకి అమ్మేస్తాడు. అది ఎక్కడుందో కనుక్కొని, ఆ బొమ్మకి తను పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్తాడు. ఇలా మొదటి కథ ముగుస్తుంది.

రెండవ కథలో … అనాధ అయిన రాజ్ కు, రాణి అనే అమ్మాయికి పరిచయం ఏర్పడుతుంది. వీరి పరిచయం ప్రేమగా మారుతుంది. వీళ్ళు ఉంటున్న ఇండ్లలో, వీళ్ళని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఇల్లు వదిలి బయటకు వెళ్లి, స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటారు. అలా వీళ్ళిద్దరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఇలా రెండో కథ ముగుస్తుంది.

మూడవ కథలో… భార్యా,భర్తలు అక్రమ సంబంధాలతో ఈ మూవీ నడుస్తుంది. అయితే చివరికి తన తప్పులు తెలుసుకొని వాళ్ళు జీవితాన్ని సరిదిద్దుకుంటారు ఇలా మూడో కథ కూడా ముగుస్తుంది. డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ చూసి ఎంజాయ్ చేయండి.

 

Related News

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

OTT Movie : అమ్మాయిల మధ్య తేడా యవ్వారం… ట్రిప్పు కోసం వెళ్లి సైకో కిల్లర్ల చేతిలో అడ్డంగా బుక్… బ్రూటల్ బ్లడ్ బాత్

OTT Movie : మిస్సైన కూతురి కోసం వెళ్తే ప్యాంటు తడిచే హర్రర్ సీన్లు… ఇలాంటి హర్రర్ మూవీని ఇప్పటిదాకా చూసుండరు భయ్యా

Biker OTT: శర్వానంద్ బైకర్ ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే!

Bad Girl OTT: ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్శీ గర్ల్.. ఎందులో చూడొచ్చంటే..?

OTT Movie : కర్ణాటక కదంబ రాజవంశం నిధికి దేవత కాపలా… దాన్ని టచ్ చేయాలన్న ఆలోచనకే పోతారు… ‘కాంతారా’లాంటి క్రేజీ థ్రిల్లర్

Big Stories

×