BigTV English

Thandel Twitter Review : ‘తండేల్’ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే?

Thandel Twitter Review : ‘తండేల్’ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే?

Thandel Twitter Review : అక్కినేని హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి రెండో సారి జోడిగా నటించిన మూవీ తండేల్.. చందు మొండేటి దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పకుడిగా అభిరుచి గల నిర్మాత బన్నీ వాసు నిర్మించిన చిత్రం తండేల్. ప్రేమ కథగా, దేశభక్తిని రగిలించే కథతో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన భారీ బడ్జెట్ మూవీ ఇది. ఈ మూవీ కోసం ఎదురు చూసిన అభిమానుల కోరిక నేటితో తీరినట్లే. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా నేడు థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో..? ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..


తండేల్ సినిమా ప్రీమియర్లు ప్రారంభానికి ముందు హీరో శ్రీ విష్ణు ట్వీట్ చేసి విష్ చేశారు. నాగచైతన్య అక్కినేని, సాయిపల్లవి, చందూ మొండేటి, డీఎస్పీ, ఇతర చిత్ర యూనిట్ సభ్యులందరికి నా ధన్యవాదాలు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా బన్నీ వాసు, అల్లు అరవింద్ గారికి, ప్రతీ ఒక్కరికి విషెస్ తెలియజేస్తూ భారీ విజయం సాధించాలని కోరుకొంటున్నాను అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు.

సాయి పల్లవి ఉంటే ఆవిడ హైలైట్ అవుతుంది. ఆవిడ నటన గురించి జనాలు మాట్లాడతారు. కానీ, ‘తండేల్’ సినిమాలో నాగ చైతన్య నటన గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ఆయన మెచ్యూర్, సెటిల్డ్ యాక్టింగ్ చేశారని పేర్కొంటున్నారు.. సాయి పల్లవి ఈ మూవీలో వన్ పీస్ అన్నట్లు నటించింది. అందరి దృష్టిని ఆకట్టుకుంది.

 

ఇక ఈ మూవీ భారీగా అంచనాలతో వచ్చింది.. ఫస్టాఫ్ ఫ్యాన్స్ కు కాస్త నిరాశను మిగిల్చిందనే టాక్.. ఎదో స్టోరీని లాగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటర్వెల్ ముందు వరకు సినిమాలో డ్రామా పికప్ కాలేదట. అప్పటి వరకు సినిమా ఫ్లాట్గా నడిచిందట. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే… ఎమోషనల్ రైడ్ తీసుకుంది. దర్శకుడు చందూ మొండేటి కథను చెప్పడంలో ఫెయిల్ అయ్యాడని మెజార్టీ జనాలు అభిప్రాయపడుతున్నారు.. నాగ చైతన్య మరియు సాయి పల్లవిల పెర్ఫార్మన్స్ఈ చిత్రానికి కలిసి వచ్చాయి… ఇక డీస్పీ అందించిన అద్భుతమైన సంగీతం ఈ చిత్రానికి అతిపెద్ద వెన్నెముక. ఇటీవలి కాలంలో డీఎస్పీలు ఉత్తమంగా పనిచేస్తున్నారు. అయితే, బలహీనమైన రచన మరియు నిస్తేజమైన కథన శైలి కొన్ని సమయాల్లో దాన్ని లాగినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రం రెండు భాగాలలో కొన్ని మంచి అనుభూతిని కలిగిస్తుంది. చివరి 20 నిమిషాల బ్లాక్‌ను బాగా అమలు చేసింది, అయితే 2వ భాగంలో మొత్తం ఇండియా-పాకిస్తాన్ సీక్వెన్స్ ప్రవాహాన్ని తీవ్రంగా అడ్డుకుంటుంది మరియు చాలా కృత్రిమంగా ఉంది. నాగ చైతన్య, సాయి పల్లవిల ప్రయత్నాలను అంతటా చూడవచ్చు మరియు ఇద్దరూ తమ ఉత్తమమైనదాన్ని అందించారు, అయితే రచన కొన్ని సమయాల్లో మాత్రమే మద్దతు ఇవ్వగలిగిందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

 

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బిగ్గెస్ట్ అసెట్ అంటోంది ఆల్రెడీ సినిమా చూసిన ప్రేక్షక లోకం. డీఎస్పీ అందించిన పాటల్లో ‘బుజ్జి తల్లి’, ‘నమో నమః’ విడుదలకు ముందు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. స్క్రీన్ మీద ఆ సాంగ్స్ పిక్చరైజ్ చేసిన తీరు సైతం చాలా బావుందని జనాలు చెబుతున్నారు. రీ రికార్డింగ్ అయితే అదిరిపోయిందట. సీన్స్ ఎలివేట్ కావడంలో ఆయన మ్యూజిక్ హెల్ప్ చేసిందట… ఈ మూవీకి దేవీ మ్యూజిక్ బాగా హైలెట్ అయ్యింది. సాంగ్స్ అద్భుతంగా వచ్చాయి.

ఇక మొదటి షో తోనే మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్స్ కలిసి వస్తాయేమో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×