Nirma Washing Powder Failure Story: ‘వాషింగ్ పౌడర్ నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా.. పాలలోని తెలుపు.. నిర్మాతో వచ్చింది..’ అంటూ సాగే వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చిన్న పాప ఎంతో ముద్దుగా కనిపించే ఈ యాడ్ ను ఎవరూ మర్చిపోలేరు. జనాలకు అంతగా కనెక్ట్ అయ్యింది. 1980, 1990 జెనరేషన్ వారికి నిర్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో ఈ యాడ్ ఓ సెన్సేషన్. ఇంతకీ ఈ నిర్మా కథ ఏంటి? మార్కెట్ ను షేక్ చేసిన ఈ నిర్మా.. ఎందుకు కనుమరుగైంది?
నిర్మా వాషింగ్ పౌడర్ ప్రస్థానం ఎలా మొదలయ్యింది?
గుజరాత్ కు చెందిన కర్సన్ భాయ్ పటేల్ అనే వ్యక్తి కెమిస్ట్రీలో డిగ్రీ పట్టా తీసుకుని.. ప్రభుత్వ సంస్థలో కొంత కాలం పని చేశాడు. జీతం సరిపోకపోవడంతో ఏదైనా కొత్తగా ఆలోచించాలి అనుకున్నాడు. తన తెలివితో ఒక కొత్త ప్రొడక్ట్ ను తయారు చేశాడు. బహుశ అది దేశంలోని ప్రతి గడపకు చేరుకుంటుందని మొదట్లో తను కూడా ఊహించి ఉండడు. అదే వాషింగ్ పౌడర్ నిర్మా. ఈ పేరు ఆయన కుమార్తె నిరుపమ పేరు నుంచి తీసుకున్నాడు. తక్కువ ధరకే అద్భుతమైన శుభ్రతను అందించేలా తయారు చేశాడు. అప్పట్లో సర్ఫ్ కేజీ రూ. 15 ఉంటే.. నిర్మా కేవలం రూ. 3.5కే లభించేది. ధరలో ఉన్న తేడా నిర్మాకు కలిసి వచ్చింది. నిర్మా కొద్ది రోజుల్లోనే ఎంతో ప్రజాదరణ పొందింది. మార్కెట్లో ఉన్న అన్ని వాషింగ్ పౌడర్లను వెనక్కి నెట్టి నెంబర్ వన్ గా నిలిచింది నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ ప్రతి టీవీలో కనిపించింది. ప్రతి వారి నోట వినిపించింది. గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య ప్రజలు బట్టలు ఉతికేందుకు ఎక్కువగా నిర్మా పౌడర్ ను వాడేవారు.
అప్ డేట్ కాకపోవడమే పతనానికి కారణం
రోజు రోజుకు నిర్మా దేశ వ్యాప్తంగా విస్తరించడంతో అహ్మదాబాద్ లో నిర్మా పౌడర్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేశాడు కర్సన్ భాయ్. అదే సమయంలో నిర్మా యాడ్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఏకంగా భారతీయ డిటర్జెంట్ మార్కెట్లో 60 శాతానికి పైగా నిర్మా సొంతం చేసుకుంది. నిర్మా దూకుడు.. HLL లాంటి పెద్ద కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అదే సమయంలో నిర్మాకు భిన్నంగా చక్కటి సువాసనతో HLL వీల్ వాషింగ్ పౌడర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిర్మా ఆధిపత్యాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది. అదే సమయంలో నిర్మా ఇతర సోడా, యాష్, సిమెంట్ రంగాలపై దృష్టి పెట్టింది. వీల్ కొత్త తరహా వాషింగ్ పౌడర్ ముందు తట్టుకోలేకపోయింది. 2017 నాటికి నిర్మా మార్కెట్ వాటా 4 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ఘడి డిటర్జెంట్ పౌడర్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఓవైపు నిర్మా, మరోవైపు ఘడి కలిసి నిర్మాను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఇతర కంపెనీల మాదిరిగా అప్ డేట్ కాకపోవడంతో నిర్మా పతనమైంది. ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మా, నెమ్మదిగా కనుమరుగు అయ్యింది.
Read Also: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్.. ఇండియాలోనే నెంబర్ 1గా ఎలా ఎదిగింది?