Hyderabad International Airport: హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు.. దేశంలోనే అన్నింటి కంటే పెద్ద ఎయిర్ పోర్టు. విస్తీర్ణం పరంగా 5,500 ఎకరాల్లో విస్తరించి ఉంది. దేశంలోని 5 బెస్ట్ ఎయిర్ పోర్టులలో ఇదీ ఒకటి. ప్రతి ఏటా సుమారు 2 కోట్లకు పైగా ప్రయాణీకులు ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగిస్తారు. దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎయిర్ పోర్టు. పంక్చువాలిటీలోనూ టాప్ లో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పంక్చువాలిటీ కలిగిన ఎయిర్ పోర్టులలో హైదరాబాద్ ఎయిర్ పోర్టు రెండో స్థానంలో నిలిచింది. ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో కొత్త టెర్నినల్ తో పాటు మరో రన్ వేను నిర్మించాలని కేంద్ర విమానయానశాఖ భావిస్తోంది. ఈ ఎయిర్ పోర్టు ఇంతలా ఎదగడానికి వెనుక ఎన్నో ఏండ్ల కృషి ఉంది. ఇంతకీ ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పునాది రాయి ఎలా పడింది?
ఒకప్పుడు హైదరాబాద్ బేగంపేటలో ఎయిర్ పోర్టు ఉండేది. నగరం నడి మధ్యలో తక్కువ విస్తీర్ణంలో ఉండేది. ప్రయాణీకుల రద్దీ పెరగడంతో మరో ఎయిర్ పోర్టు అనివార్యం అయ్యింది. 1990 నుంచి కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు కొనసాగాయి. 1998లో మూడు చోట్ల ఎయిర్ పోర్టు నిర్మించాలని ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో ఒకటి బెంగళూరు, మరొకటి నాదర్ గుల్, ఇంకొకటి శంషాబాద్. చాలా చర్చల తర్వాత శంషాబాద్ ను ఫైనల్ చేశారు. రెండు జాతీయ రహదారులతో పాటు రైల్వే స్టేషన్ కు సమీపంలో అత్యంత విశాలంగా నిర్మించే అవకాశం ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఎయిర్ పోర్టును పీపీపీ పద్దతిలో నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రభుత్వాలవి 26 శాతం, ప్రైవేట్ కంపెనీలవి 74 శాతం పెట్టుబడులు ఉన్నాయి. 2002లో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ గా మారింది. ఎయిర్ పోర్టు బాగా నడవడానికి, లాభాల్లోకి వెళ్లడానికి 2004లో అగ్నిమెంట్ ను మార్చారు. తొలుత 30 ఏళ్లు ఉండగా, దాన్ని 60 ఏళ్లకు పెంచారు. అంతేకాదు, ఈ ఎయిర్ పోర్టుకు 150 కిలో మీటర్ల పరిధిలో మరో ఎయిర్ పోర్టు నిర్మించకూడదనే కండీషన్ పెట్టింది జీఎంఆర్ సంస్థ.
2005 మార్చిలో ఎయిర్ పోర్టు నిర్మాణం ప్రారంభం
ఇక శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణం 2005 మార్చిలో ప్రారంభం అయ్యింది. మూడేళ్లలో ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయ్యింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అని పేరు పెట్టారు. మార్చి 14, 2008లో ఈ ఎయిర్ పోర్టును ప్రారంభించారు. ఈ ఎయిర్ పోర్టు ఆపరేషన్స్ ప్రారంభించిన 2 గంటల్లోనే 2 డొమెస్టిక్ ప్లైట్స్, ఓ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఎయిర్ పోర్టులో 2 రన్ వేలు ఉన్నాయి. ఒకటి 4.5 కిలో మీటర్ల పొడవు, మరొకటి 3.7 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాసింజర్ ప్లైట్ ఎయిర్ బస్ కూడా ఇక్కడ ల్యాండ్ కావచ్చు.
ప్రస్తుతం ఈ ఎయిర్ పోర్టు కెపాసిటీ 3.4 కోట్లుగా ఉంది. ఈ ఎయిర్ పోర్టు నుంచి 85 దేశ, విదేశీ ప్రాంతాలకు విమానాలను నడిపిస్తుంది. ఈ ఎయిర్ పోర్టు నుంచి వారానికి అత్యధికంగా 164 విమానాలు ఢిల్లీకి వెళ్తున్నాయి. దుబాయ్, మస్కట్ కు ఇక్కడి నుంచి ఎక్కువ మంది ప్రయాణీకులు వెళ్తున్నారు. 10.50 గంటల లాంగెస్ట్ జర్నీ చేసే విమానం లండన్ వరకు వెళ్తుంది. ఇక్కడి నుంచి ఇండిగో ఎయిర్ లైన్స్ మొత్తం 30 విమానాలను నడుపుతుంది. నెలకు 4400 విమానాలను ఆపరేట్ చేస్తుంది. ఎయిర్ ఇండియా నెలకు 400 విమానాలను నడిపిస్తుంది. ఎయిర్ బస్ లాంటి పెద్ద విమానాలు కూడా ఈ ఎయిర్ పోర్టు నుంచి నడిపించబడుతున్నాయి. సౌత్ ఇండియాలోనే బిజీయెస్ట్ కార్గో టెర్మినల్ ఇక్కడ ఉంది. త్వరలోనే ఈ ఎయిర్ పోర్టుకు మెట్రో రైల్ యాక్సెస్ రాబోతోంది. మరింతగా విమానాశ్రయం నుంచి రాకపోకలు పెరిగే అవకాశం ఉంటుంది.
Read Also: ప్రపంచంలోనే అత్యంత భయానకమైన రైలు ప్రమాదం.. ఏకంగా 1700 మంది దుర్మరణం!