BigTV English

Lady Aghori : అఘోరీ పెద్ద చీటర్.. మొదటి భార్య ఎంట్రీ.. వర్షిణి వదిలేస్తుందా?

Lady Aghori : అఘోరీ పెద్ద చీటర్.. మొదటి భార్య ఎంట్రీ.. వర్షిణి వదిలేస్తుందా?

Lady Aghori : లేడీ అఘోరీ ఎపిసోడ్ మరో సంచలన టర్న్ తీసుకుంది. ఆ అఘోరీ నా మొగుడేనంటూ ఓ మహిళ బయటకు వచ్చింది. తన పేరు రాధ అని.. ఏడాది క్రితం కొండగట్టు అంజన్న ఆలయంలో అఘోరీ తన మెడలో తాళి కట్టాడని చెబుతోంది. ఇటీవల వర్షిణి అనే మరో యువతిని పెళ్లి చేసుకున్నట్టు తెలిసి.. అసలు నిజాలు బయటపెట్టేందుకు వచ్చానని అంటోంది. అందుకు ఆధారంగా.. అఘోరీ తనతో మాట్లాడిన ఆడియో క్లిప్స్ రిలీజ్ చేసింది రాధ.


వర్షిణి కూతురు లాంటిది..

శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరీ.. గతేడాది జనవరి ఫస్ట్‌న తనను పెళ్లాడాడని రాధ చెబుతోంది. తన మెడలో వెండి తాడు కట్టాడని.. అయితే ఇటీవల ఇంటికి వచ్చి తన తాళి తనకు ఇచ్చేయమని గొడవ చేసి.. ఆ వెండి తాడి తీసుకెళ్లిపోయాడని అంటోంది. 20 రోజుల క్రితం వర్షిణి గురించి తాను టీవీల్లో చూశానని.. ఎవరు ఆమె అని అఘోరీని అడిగానని చెప్పింది. వర్షిణి తనకు కూతురు లాంటిదని.. తాను ఆమెకు గురువునని అఘోరీ చెప్పాడంది. అయితే, 4 రోజుల క్రితం వర్షిణిని అఘోరీ పెళ్లి చేసుకున్నాడనే మేటర్ తెలిసి.. ఫోన్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదని.. తన నెంబర్ బ్లాక్ చేశాడనేది రాధ ఆరోపణ.


అఘోరీతో ఎంతమంది జీవితాలు నాశనం?

వర్షిణి చిన్న పిల్ల అని.. ఆమె జీవితం ఏమైపోతుందోనని రాధ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మొదటి భార్యను తాను బతికే ఉండగా.. వర్షిణిని ఎలా పెళ్లి చేసుకుంటాడని.. ఎంత మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తాడని.. నిలదీస్తోంది రాధ. పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకుని.. ఆ లేడీ అఘోరీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.

అఘోరీ లవ్ తట్టుకోలేం..

మొదట్లో అఘోరీ చాలా లవ్ చూపిస్తాడని.. మగవాళ్లు కూడా చూపించనంత ప్రేమను వ్యక్తం చేస్తాడని రాధ తన అనుభవాలను తెలిపింది. సనాతన ధర్మం, భక్తి మార్గంలో తాను మొదటిసారి అఘోరీని కలిసానని చెబుతోంది. అది కాస్తా ప్రేమగా మారిందని.. పెళ్లి కూడా చేసుకున్నామని.. ఓ ల్యాండ్ తీసుకుని.. ఆశ్రమం కట్టుకుందామని.. అనుకుంటుండగా.. ఇప్పుడిలా వర్షిణి మోజులో పడి తనను వదిలేశాడని రాధ ఆరోపించింది. అఘోరీ ఒక మాట మీద నిలబడడని.. రోజుకో మాట మార్చేస్తుంటాడని రాధ మండిపడింది. వర్షిణి జీవితం ఏమైపోతుందోనని అంటోంది.

ఆమె చాలా రొమాంటిక్!

ఇక, అఘోరీ తనకు పంపిన వాయిస్ మెసేజ్‌లను బిగ్ టీవీకి అందజేసింది రాధ. ఆ ఆడియోలో అఘోరీ.. రాధపై చాలా ప్రేమ వొలకబోసాడు. రాధే..రాధే.. అని ముద్దుగా పిలుస్తున్నాడు. ఆ ఆడియోలో ఏముందంటే.. “ఐ లవ్ యూ రాధే.. నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నేను రాగానే తాళి కడతా.. గుండెలో చాలా పెయిన్ ఉంది.. మనం జీవితాంతం కలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక.. అందరూ వేరు.. నువ్వు వేరు..” ఇలా సాగింది అఘోరీ ప్రేమ వ్యవహారం. ఇంకో ఆడియోలో.. “సరేనే నా ముద్దుల పెళ్లామా.. నువ్వెట్ల అంటే అట్ల..” అని అంటున్నాడు అఘోరీ.

Also Read : వీధి కుక్కలపై అత్యాచారం.. వాడసలు మనిషేనా?

వర్షిణి ఫ్యూచర్ ఏంటి?

రాధతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, రుద్ర స్వామి సైతం మీడియా ముందుకు వచ్చారు. శ్రీనివాస్ అసలు అఘోరీనే కాదని.. ఫేక్ అని.. ఎంత మంది మహిళల జీవితాలను నాశనం చేస్తాడని రుద్రస్వామి ప్రశ్నించారు. రాధ కుటుంబ సభ్యులు సైతం అఘోరీపై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. మరి, ఈ మేటర్ వర్షిణికి తెలిస్తే..? ఊరుకుంటుందా? అఘోరీని వదిలేస్తుందా? రెండో భార్యగా అడ్జస్ట్ అవుతుందా? ముందుముందు మరిన్ని ట్విస్ట్‌లు తప్పకపోవచ్చు.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×