Karun Nair: ఇండియా వెటరన్, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కరుణ్ నాయర్ తన ఇండియన్ ప్రీమియర్ లీగ్ { IPL 2025} పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటి మళ్లీ ఐపీఎల్ లోకి వచ్చిన కరుణ్ నాయర్ అదరగొట్టాడు. ఏప్రిల్ 13 ఆదివారం రోజు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కరుణ్ నాయర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయినప్పటికీ.. కరుణ్ నాయర్ {89} ఇన్నింగ్స్ మాత్రం గుర్తుండిపోతుంది.
Also Read: MI vs DC: ముంబై బాల్ ఎందుకు మార్చింది.. అంబానీ ఫిక్సింగ్ చేయించాడా ?
ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన కరుణ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఓవర్ లోనే క్రీజ్ లోకి వచ్చిన కరుణ్.. ముంబై బౌలర్లను ఉతికారేశాడు. క్రీజ్ లో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. మైదానం నలుమూలలా బౌండరీలు కొడుతూ అభిమానులను అలరించాడు. బుమ్రా వంటి స్టార్ పేసర్ బౌలింగ్ లో కూడా అలవోకగా బౌండరీలు బాదేశాడు. ఈ మ్యాచ్ లో 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కరుణ్.. 40 బంతుల్లోనే 89 పరుగులు సాధించాడు.
ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా కరుణ్ నాయర్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే కరుణ్ పోరాడినప్పటికీ ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయిన నేపథ్యంలో మ్యాచ్ అనంతరం పలు ఆసక్తికర విజయాలను వెల్లడించాడు కరుణ్. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ” నేను బాగా ఆడుతున్నాననే నమ్మకం నాలో ఉంది.
నేను ఓ ఫ్లోలో ఉన్నాను. అప్పుడు దాన్ని ఆపకూడదు. బుమ్రా ప్రపంచంలోనే టాప్ బౌలర్. కాబట్టి నేను జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. కానీ నేను నన్ను బలంగా నమ్మాను. నా బలమైన షాట్లను గుర్తించి ఆ దిశగా ఆడాను. మ్యాచ్ గెలవాలనే మేము కసిగా ఆడతాం. కానీ ఇప్పుడు ఓడిపోవడం నిరాశగా ఉంది. ఎంత స్కోర్ చేసినా.. జట్టు గెలవకపోతే దానికి విలువ ఉండదు. నా వరకు మా జట్టు గెలవడమే నాకు ముఖ్యం.
Also Read: Virat Kohli: ఫ్యాన్స్ కు షాక్.. గ్రౌండ్ లోనే గుండె పట్టుకున్న కోహ్లీ.. అసలేమైంది..?
కానీ అలా జరగలేదు. ఈ ఓటమి నుండి తప్పులు నేర్చుకొని ముందుకు సాగుతాం. నేను ఇలాంటి మంచి ప్రదర్శనే కొనసాగిస్తానని ఆశిస్తున్నాను. ఇకనుండి మేం ఖచ్చితంగా గెలుస్తాం. ప్రస్తుతం నా ఇన్నింగ్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను బాగా ఆడినప్పటికీ ఆటను ముగించలేకపోయాను. ఇది నాకు బాధను కలిగిస్తోంది. చివర్లో మేము వరుసగా వికెట్లు కోల్పోయాం. ఆ కారణంగానే ఓడిపోయాం. ముంబై బౌలింగ్ ను అభినందించాలి. వాళ్లు మాపై ఒత్తిడి తెచ్చారు” అని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు కరుణ్ నాయర్.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">