BigTV English

Lady Aghori – Sri Varshini : నాకు సంబంధం లేదు.. అఘోరీ-శ్రీవర్షిణి ప్రేమ కథలో ఊహించని ట్విస్ట్

Lady Aghori – Sri Varshini : నాకు సంబంధం లేదు.. అఘోరీ-శ్రీవర్షిణి ప్రేమ కథలో ఊహించని ట్విస్ట్

Lady Aghori – Sri Varshini : శ్రీవర్షణి ఎక్కడ? లేడీ అఘోరీ ఎక్కడికి తీసుకెళ్లింది? వాళ్లిద్దరూ ఏమైపోయారు? ఎక్కడికి పారిపోయారు? అక్కడ వాళ్లేం చేస్తున్నారు? కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న విషయం. శ్రీవర్షిణి ఫ్యామిలీలో తీవ్ర కలకలం. ఆ కుటుంబంతో సంబంధంలేని వాళ్లు సైతం అయ్యో అంటున్నారు. అఘోరి మాయలో పడి శ్రీవర్షిణి జీవితం పాడు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురును అఘోరీ కిడ్నాప్ చేసిందంటూ ఆమె ఫ్యామిలీ పోలీసులకు కంప్లైంట్ చేశారు. శ్రీవర్షిణి మాత్రం తాను ఇష్టపూర్వకంగానే ఆమెతో వెళ్లినట్టు చెబుతోంది. ఇలా కొంతకాలం పాటు కొనసాగిన రచ్చలో లేటెస్ట్‌గా మరో ట్విస్ట్.


గుజరాత్‌లో చిక్కిన అఘోరీ-శ్రీవర్షిణి

లేడీ అఘోరీ, శ్రీవర్షిణిలు గుజరాత్‌లో ఉన్నట్టు గుర్తించారు. వాళ్ల కోసం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. శ్రీవర్షిణి పేరెంట్స్ సైతం పోలీసులతో గుజరాత్ వెళ్లారు. అక్కడ ఓ పెట్రోల్ పంప్‌లో నిద్రిస్తున్న వాళ్లిద్దరిని అర్థరాత్రి పట్టుకున్నారు పోలీసులు. శ్రీవర్షిణి ఫ్యామిలీతో పాటు విష్ణు, శ్రీహర్ష, భవాని తదితరులు పోలీసులతో పాటు ఉన్నారు.


అఘోరీ లేటెస్ట్ వీడియో వైరల్

అయితే, అఘోరీని వీడి తాను రానంటూ శ్రీవర్షిణి ఏడుపు మొదలుపెట్టింది. తన ఇష్ట ప్రకారమే ఆమెతో ఉంటున్నానని చెప్పింది. అయినా పోలీసులు, ఆమె ఫ్యామిలీ వినలేదు. శ్రీవర్షిణిని బలవంతంగా తమతో తీసుకెళ్లారు. ఆ ఘటనను లేడీ అఘోరీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమను బలవంతంగా విడదీస్తున్నారని మండిపడింది. వర్షిణి కోసం వెక్కి వెక్కి ఏడ్చింది అఘోరీ. ఇకపై శ్రీవర్షిణికి ఏం జరిగినా తనకు సంబంధం లేదని అఘోరీ చెప్పింది. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

అఘోరీ – శ్రీవర్షిణి.. అసలేం జరిగింది?

లేడీ అఘోరీ. ఏడాదికి పైగా తెలుగు రాష్ట్రాల్లో హల్‌చల్ చేస్తోంది. సనాతన ధర్మం, మహిళా ఉద్యమం అంటూ కొంతకాలంగా ఏపీ, తెలంగాణలో రచ్చ చేసింది. నగ్నంగా తిరగడం, రోడ్లపై బైఠాయించడం, పోలీసులతో గొడవ.. ఇలా నానారకాల న్యూసెన్స్ చేసింది. కట్ చేస్తే.. ఓ రోజు విజయవాడ జనసేక ఆఫీసు ముందు ఆమె కారు పాడైంది. విష్ణు అనే యువకుడు ఆ లేడీ అఘోరీని తనకు దగ్గరి వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇంటి అమ్మాయే శ్రీవర్షిణి. అఘోరీ ఆ ఇంట్లో దాదాపు రెండు వారాలు ఉంది. ఐఫోన్లు, గోల్డ్ ఛైన్, ఖరీదైన గిఫ్ట్స్ ఆ కుటుంబానికి ఇచ్చింది. వాళ్లంతా లేడీ అఘోరీకి ఫిదా అయిపోయారు. శ్రీవర్షిణి మాత్రం ఏకంగా ఆమె మైకంలో పడిపోయింది. వన్ ఫైన్ మార్నింగ్.. అఘోరితో కలిసి శ్రీవర్షిణి మాయం అయింది. వాళ్లిద్దరూ ఎక్కడికో వెళ్లిపోయారు. శ్రీవర్షిణి కుటుంబం తల్లడిల్లింది. కూతురు కోసం వెతికింది. ఆమె మాత్రం తాను ఇష్టపూర్వకంగానే అఘోరీతో వెళ్లానని పేరెంట్స్‌కు చెబుతోంది. తల్లిదండ్రులు మాత్రం ఆ అఘోరీ మాయలో పడొద్దని.. వెంటనే ఇంటికి తిరిగిరావాలని అన్నారు. అప్పటికే అఘోరీ, వర్షిణి పలు రాష్ట్రాలు దాటేశారు. పోలీసుల సాయంతో వాళ్లిద్దరినీ గుజరాత్, సౌరాష్ట్రలో ఉన్నట్టు గుర్తించి.. అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. ఆ సమయంలో జరిగిన సీన్ ఇది. ఆ వీడియోలో.. శ్రీవర్షిణిని ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తీసుకెళుతుండటం.. అది తట్టుకోలేక లేడీ అఘోరీ గుక్కపెట్టి ఏడుస్తుండటం కనిపిస్తోంది. అర్థరాత్రి గుజరాత్‌తో పెద్ద హంగామా జరిగినట్టుంది.

Related News

Indonesian Elderly Couple: గూగుల్ స్ట్రీట్ వ్యూలో వృద్థ జంట.. పదేళ్ల జీవితం కళ్ల ముందు.. గుండె బరువెక్కడం ఖాయం!

Viral Video: పిల్లలా? నా వల్ల కాదు.. ఆడ సింహన్ని చూసి మృగరాజు పరుగోపరుగు!

Marriage: శోభనం రాత్రి.. బాల్కనీ నుంచి దూకిన వధువు.. కట్ చేస్తే, పెద్ద స్కామ్!

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Big Stories

×