BigTV English

Pharmacist Anjali Death: ప్రాణం తీసిన ఎర్ర చీర.. మెడికో డెత్

Pharmacist Anjali Death: ప్రాణం తీసిన ఎర్ర చీర.. మెడికో డెత్

Pharmacist Anjali Death : లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకున్న మెడికల్ విద్యార్థిని నాగాంజలి మృతి చెందింది. పది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ.. రాత్రి రెండు గంటల సమయంలో కన్నుమూసింది. నాగాంజలి మృతి చెందినట్లు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్దకు వైద్య బృందం చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా కిమ్స్ హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.


నాగాంజలి మృతదేహాన్ని కిమ్స్ హాస్పిటల్ నుండి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి తరలించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో మరికొద్ది సేపట్లో నాగాంజలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం నాగాంజలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు వైద్యులు అప్పగించనున్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు భారీ ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

నాగాంజలి మృతిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటి వరకు నిందితుడిని విచారణ జరిపిందే లేవని.. ఒక మెడికల్‌ విద్యార్థిని లైంగిక వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడితే.. ఇంత వరకు సీఎం, డిప్యూటీ సీఎం, హోమ్‌ మినిస్టర్‌ స్పందించలేదని.. వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. నాగాంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామంటున్నారు.


వైద్యురాలిగా నాగాంజలి ఉద్యోగం చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచేదని.. అలాంటి విద్యార్థినిని లైంగికంగా వేదించి.. ఆమె చావుకు కారణమైన వాడిని ఉరిశిక్షతో శిక్షాంచాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. నాగాంజలి మృతిపై రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయకుండా ఆమె కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని కోరుతున్నారు.

తమకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశిస్తుస్తానమని నాగాంజలి తండ్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పాపకు న్యాయం చేయాలని.. మరో విద్యార్థినికి ఇలాంటి సంఘటన జరగకూడదని నాగాంజలి తండ్రి కోరుతున్నారు. సెంట్రల్‌ జైలులో ఉన్న దీపక్‌ను విచారణ జరిపి.. వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తామని.. సిసి టీవీ ఫుటేజ్‌ ఆధారంగా విచారణ జరుపుతామని పోలీసులు తెలుపుతున్నారు.

ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఆదిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి కుటుంబ సభ్యులకు రెండు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సాయం అందిస్తానని కుటుంబ సభ్యులకి హామీ ఇచ్చారు. నిందితుడు దీపక్ విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా ఉందని.. నాగాంజలి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Also Read: రన్నింగ్ ట్రైన్‌లో వీడియోలు తీసి.. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు..

AGM దీపక్‌ లైంగిక వేధింపుల నేపథ్యంలో తన ఆత్మహత్యయత్నంకు ముందు వైద్య విద్యార్థిని నాగాంజలి రాసిన సూసైడ్‌ నోట్‌ను పరిశీలిస్తే.. లైంగిక వేదింపుల మూలంగా ఆమె ఎంత మానసిక వేదనకు గురైందో అర్థమైపోతుంది. నేను చాలా మోసపోయాను.. నా జీవితం ఎందుకు ఇలా తయారయిందో నాకే అర్థం కావట్లేదని నాగాంజలి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ హాస్పిటల్‌లోకి రావడం.. ఆ ఫంక్షన్‌లో రెడ్‌ శారీ కట్టుకొని వాడి కళ్లల్లో పడటం.. అదంతా లేకపోయి ఉంటే బాగుండేది. నేను చాలా హ్యాపీగా నా పేరెంట్స్‌తో ఉండేదాన్ని. ఆ రెడ్‌ శారీలో చూసినప్పటి నుంచి వాడికి నా మీద కన్ను పడింది.. ఇంక వదలలేదు. మొత్తానికి వాడుకున్నాడు. ఇంక వదలేస్తున్నాడు. నాకు ఇంక ఎక్కడికి వెళ్లే దారి లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది నాగాంజలి.

నన్ను ఎంత కొట్టినా, తిట్టినా నేను చాలా ఓపిక పట్టి భరించాను. ఇంకా తట్టుకునే శక్తి లేదు అంటూ సూసైడ్‌ నోట్‌ పేర్కొంది నాగాంజలి. లైంగికంగా నన్ను చాలా వేధించాడు. తన కొడుకు, భార్య గురించి ఆలోచించి నేను నోరు తెరవలేదు. ఎందుకు సడెన్‌గా ఏదో పోగొట్టుకున్నట్టు అయిపోతున్నావు? అని అందరూ నన్ను అడుగుతున్నారు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి గొంతు కోశాడు. ఇక నాకు ఎవరి గురించి ఆలోచించే ఓపిక లేదంటూ పేర్కొంది. ఇదంతా.. నాగాంజలి తన ఆత్మహత్యయత్నంకు ముందు పడ్డ మానసిక వేదన. నాగాంజలి సూసైడ్‌ నోట్‌ చదివినవారికి దీపక్‌ మూలంగా ఆమె అనుభవించిన మానసిక వేదన అర్థమవుతుంది.

Tags

Related News

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

Big Stories

×