E-Paper
Advertisement

Viral Video: చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. వీడియో వైరల్

Viral Video: చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. వీడియో వైరల్
Advertisement

Viral Video: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాను చూసిన స్ఫూర్తి దాయకమైన వీడియోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. అంతే కాకుండా ప్రతిభ, సంస్కారం కలిగిన వారిని పోత్సహిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్టు చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఓ చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. రద్దీగా ఉన్న రోడ్డుపై వెళుతున్న చిన్నారికి సంబంధించిన ఓ వీడియో ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకుంది. దీంతో ఆయన ఆ వీడియోను ఎక్స్(ట్విట్టర్ ) లో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోలో ఓ చోట చిన్నారి వీల్ చైర్ లో ఉన్న ఓ వ్యక్తిని తోసుకుంటూ రోడ్డు దాటుతోంది. రద్దీగా ఉన్న రోడ్డు దాటుతున్న చిన్నారి..ప్రతీ మూడు అడుగులకు ఒక సారి వాహనదారులకు వంగి ధన్యవాదాలు తెలిపింది. చిన్నారి రోడ్డు దాటుతుండగా అనేక వాహనాలు నిలిచిపోవడం వీడియోలో చూడవచ్చు.

Advertisement

Also Read: బాల్కనీ నుంచి జారిపడిన 8 నెలల పసికందు.. రూఫ్ చివరిలో చిక్కుకున్న దృశ్యాలు వైరల్

అయితే ఈ చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయారు. వీడియోను షేర్ చూస్తూ దానిపై తన స్పందనను తెలియజేసారు. ప్రపంచం అంతా ఎందుకు ఇలా ఉండకూడదు అని మహీంద్రా అన్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇలాంటి విలువలను భవిష్యత్తు తరాలకు తెలపాలి అంటూ  కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

 

 

 

 

 

 

 

 

 

 

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×