BigTV English

Shocking Video: బాల్కనీ నుంచి జారిపడిన 8 నెలల పసికందు.. రూఫ్ చివరిలో చిక్కుకున్న దృశ్యాలు వైరల్

Shocking Video: బాల్కనీ నుంచి జారిపడిన 8 నెలల పసికందు.. రూఫ్ చివరిలో చిక్కుకున్న దృశ్యాలు వైరల్

 


Shocking Video: ఇటీవల చిన్నారులు ప్రమాదంలో పడుతున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు లేని సమయంలో ఆటలు ఆడుతూ ప్రమాదంలో పడుతున్న ఘటనలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటిదే తమిళనాడులో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. 8 నెలల చిన్నారి ఏకంగా రెండు అంతస్తుల భవనంపై నుంచి కిందపడబోయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నడకలు రాని పసికందు రెండు అంతస్తుల భవనంపై చిక్కుకుపోయిన దృశ్యాలు అందరినీ భయాందోళనకు గురిచేశాయి.

8 నెలల అభం శుభం తెలియని చిన్న పసికందు రెండు అంతస్తుల భవనంపై నుంచి కింద పడబోయింది. ఈ తరుణంలో ఓ చిన్న బాల్కనీపై చిక్కుకుంది. బాల్కనీలోని ప్లాస్టిక్ షీట్ చివరలో చిన్నారి చిక్కుపోయింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే చిన్నారిని రక్షించేందుకు సాహసాలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే చిన్నారి బాల్కనీ నుంచి కిందపడబోయిన తరుణంలో ఓ ప్లాస్టిక్ షీట్ పై చిక్కుకుపోయింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే చిన్నారిని రక్షించేందుకు బయలుదేరారు. కింద ఓ పెద్ద కారు పరదాను పట్టుకుని పలువురు నిల్చుని ఉన్నారు. వెంటనే మొదటి అంతస్తులోని ఓ కిటికీ నుంచి చిన్నారి కాపాడేందుకు కొంతమంది ప్రయత్నించారు.


బాల్కనీలోని కిటికీ పైకి ఎక్కి చిన్నారిని పట్టుకుని కిందకు లాగేందుకు ప్రయత్నించారు. తొలుత చిన్నారని పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. దీంతో నెమ్మదిగా బ్యాలెన్స్ చేస్తూ చిన్నారిని పట్టుకుని కిందకు దిగారు. ఈ తరుణంలో అక్కడి నుండి ఎవరు కిందకు పడకుండా ఉండేందుకు కింద ఉన్న పలువురు కారు పరదాను పెద్దగా చాచి పట్టుకున్నారు. ఈ ఘటన మొత్తాన్ని పక్కనే ఉన్న టవర్ పై నుంచి కొంతమంది చిత్రీకరించారు. నెమ్మదిగా ఓ వ్యక్తి చిన్నారిని పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×