BigTV English

London Stabbing: లండన్‌లో కత్తితో ఉన్మాది దాడి.. 13 ఏళ్ల బాలుడు మృతి.. మరో ఐదుగురు..

London Stabbing: లండన్‌లో కత్తితో ఉన్మాది దాడి.. 13 ఏళ్ల బాలుడు మృతి.. మరో ఐదుగురు..

London Stabbing: ప్రశాతంగా ఉన్న బ్రిటన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. లండన్‌లో ఒక ఉన్మాది కత్తితో స్వైరవిహారం చేశాడు. ఆ దుండగుడు దాడిలో ఓ బాలుడు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు లండన్‌లోని హైనాల్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.


మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఒక ఇంట్లోకి దూసుకొచ్చిన వాహనం నుంచి దిగిన ఆగంతకుడు విచక్షణా రహితంగా వారిపై కత్తితో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసుల హుటాహుటిన అక్కడికి వెళ్లి నిందితుడ్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా.. వారిపై కూడా అతడు దాడికి యత్నించినట్టు వెల్లడించారు.

తీవ్రంగా గాయపడిన వారిని పోలీసులు అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ దాడిలో ఓ 13 ఏళ్ల బాలుడు మృతి చెందగా.. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 36 ఏళ్ల వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, అతడిని అరెస్టు చేశామని డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఏడ్ ఎడిలేకన్ తెలిపారు.


Also Read: లోయలో పడిన బస్సు.. 25 మంది మృతి

ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. అయితే ఈ ఘటనపై బ్రిటన్ హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ కూడా స్పందించారు. దీనికి సంబంధించిన ఊహాగానాలు, దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసారు. బాధితులకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×