Leopard Attack In Madhya Pradesh: “పులిని దూరం నుంచి చూడాలనిపిస్తే చూస్కో! పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసుకోవచ్చు! సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం, వేటాడేస్తది!” అంటూ ‘యమదొంగ’ సినిమాలో ఓ డైలాగ్ చెప్తాడు. నిజానికి రియల్ లైఫ్ లో ఎవరూ అలాంటి ప్రయత్నం చేయరు. కానీ, ఇలాంటి ప్రయత్నం చేసి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు ముగ్గురు వ్యక్తులు. చిరుత దాడిలో తీవ్ర గాయాలపాలై బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఉత్తర ప్రదేశ్ కు చెందిన సుమారు 50 మంది మిత్రులు మధ్యప్రదేశ్ కు విహారయాత్రకు వెళ్లారు. షాదోల్ జిల్లాలోని గోహ్పారు- జైత్ పూర్ అడవుల్లోని వాటర్ ఫాల్స్ చూడాలి అనుకున్నారు. అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓ ముగ్గురు వ్యక్తుల మాత్రం అడవిలో కాస్త లోపలికి వెళ్లారు. కొద్ది దూరంలో చిరుత పులిని చూశారు. వెంటనే వెనక్కి రావాల్సింది పోయి, దానిని వీడియోలు తీస్తూ, సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. అప్పటికే దూరంగా ఉన్న ఫ్రెండ్స్ వెనక్కి రావాలని కేకలు వేశారు. అయినా, వారి మాటలను పట్టించుకోలేదు. అప్పటికే వారిని గమనించిన చిరుత పులి వేగంగా వారి మీదకి దూసుకొచ్చింది. ముగ్గురు వ్యక్తులు తప్పించుకునేందుకు ప్రయత్నించినా చిరుత వేగం ముందు సాధ్యం కాలేదు. ముగ్గురిపై తన పంజా విసిరింది. చిరుత తాకిడికి ముగ్గురు అల్లంత దూరాన పడిపోయారు. చిరుత దాడిలో గాయపడిన వారిలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ నితిన్ సమ్దరియా, 23 ఏళ్ల యువకుడు ఆకాష్ కుష్వాహా, 25 ఏళ్ల నందిని సింగ్ ఉన్నారు. చిరుత పులి మొదట ఆకాష్ మీద దాడి చేసి, అతడి తొడను కొరికింది. మరో కాలుపై పంజాతో దాడి చేసింది. పక్కనే ఉన్న నందిని తలకు బలమైన గాయాలయ్యాయి. మరో వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. మిగతా ఇద్దరితో పోల్చితే నందినికి ఎక్కువ గాయాలయ్యాయి. ఫ్రెండ్స్ అంతా గట్టిగా అరవడంతో చిరుతపులి అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది. క్షణకాలంలో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. అక్కడే ఉన్న వాళ్లు కూడా ఈ ఘటన చూసి షాక్ అయ్యారు. వెంటనే ఆ ముగ్గురిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. నందిని తలకు డాక్టర్లు సర్జరీ చేసి కుట్లు వేసినట్లు తెలుస్తోంది.
मध्य प्रदेश के शहडोल जिले में पिकनिक स्थल पर मौज-मस्ती कर रहे कुछ युवकों पर मादा तेंदुए ने किया हमला . हमले में तीन लोग बुरी तरह घायल हो गए.#UttarPradesh #MadhyaPradesh #Leopard #Nedricknews pic.twitter.com/JezcOtb3hs
— Nedrick News (@nedricknews) October 22, 2024
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
పిక్నిక్ కు వెళ్లిన వారిపై చిరుత పులి దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పులితో గేమ్స్ ఆడితే ఇలాగే ఉంటుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. పులిని తక్కువగా అంచనా వేయకూడదని మరికొందరు అంటున్నారు. మరికొంత మంది ఫన్నీ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.
Read Also: హిమాలయాల్లోని అరుదైన పాముకు ఆ రొమాంటిక్ హీరో పేరు పెట్టిన పరిశోధకులు.. అది అంత స్పెషలా?