BigTV English

Ram Charan: మేడమ్ టుస్సాడ్స్‌లో గ్లోబల్ స్టార్ మైనపు విగ్రహం.. క్వీన్ ఎలిబిబెత్ తర్వాత ఆ గౌరవం అందుకున్న చెర్రీ, ఫొటో వైరల్..!

Ram Charan: మేడమ్ టుస్సాడ్స్‌లో గ్లోబల్ స్టార్ మైనపు విగ్రహం.. క్వీన్ ఎలిబిబెత్ తర్వాత ఆ గౌరవం అందుకున్న చెర్రీ, ఫొటో వైరల్..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఐఫా వేదిక మీద ప్రకటించిన తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ మైనపు బొమ్మ తయారీ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు కీలక ప్రకటన చేయడం జరిగింది. మరి దానిని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.


మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చెర్రీ విగ్రహం..

రాజమౌళి (Rajamouli )దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR) , రామ్ చరణ్ (Ram Charan)సంయుక్తంగా నటించిన చిత్రం ఆర్.ఆర్.ఆర్ (RRR). మగధీర తర్వాత ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ ఇప్పుడు ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్థాయిని సొంతం చేసుకున్నారు. ఒక్క సినిమాతో గ్లోబల్ రేంజ్ కి ఎదిగిపోయింది ఆయన క్రేజ్. ఈ క్రమంలోనే ఈ అరుదైన గౌరవం లభించిందని సమాచారం. ఎంతో గర్వంగా భావించే ఈ జాబితాలో రామ్ చరణ్ కూడా లభించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచంలోని అనేకమంది ప్రముఖుల మైనపు విగ్రహాలు అచ్చం వారిలాగే తయారు చేసి ఈ మేడమ్ టుస్సాడ్స్ కి సంబంధించిన మ్యూజియంలో పెడతారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షారుఖ్ ఖాన్ (Sharukh Khan)మొదలుకొని.. అల్లు అర్జున్ (Allu Arjun), ప్రభాస్ (Prabhas), మహేష్ బాబు (Mahesh Babu)లాంటి దిగ్గజ హీరోల మైనపు విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి.


అధికారిక ప్రకటన చేసిన ప్రతినిధులు..

అయితే వీరందరి కంటే రామ్ చరణ్ మైనపు విగ్రహం అత్యంత ప్రాముఖ్యతను సంచరించుకుందని సమాచారం. ఎందుకంటే ఆయన పెంపుడు కుక్క రైమ్ తో కలిపి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోతే ఈ విషయాన్ని అబూదాబిలో జరిగిన ఐఫా వేడుకలలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు కూడా. ఇటీవలే రామ్ చరణ్ తో పాటు ఆయన పెట్ డాగ్ రైమ్ లకు సంబంధించిన కొలతలను , ఫోటోలను అలాగే వీడియోలను కూడా ఆ ప్రతినిధులు తీసుకున్నారు.

వచ్చే ఏడాది సమ్మర్లో ప్రతిష్టాపన..

ఇదిలా ఉండగా మరోవైపు చరణ్ మైనపు బొమ్మ తయారీ శరవేగంగా జరుగుతోందని , అందులో భాగంగానే తాజాగా మ్యూజియం ప్రతినిధులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టు సమాచారం. ఇకపోతే రామ్ చరణ్ విగ్రహాన్ని సింగపూర్ లోని తమ మ్యూజియంలో వచ్చే ఏడాది వేసవిలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రతినిధులు ప్రకటించారు. ఇకపోతే తమ అభిమాన హీరోకి ఈ అరుదైన గౌరవం లభించడంతో రామ్ చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు రామ్ చరణ్ కూడా ఈ విషయంపై సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నా మైనపు విగ్రహాన్ని పెట్టడం నేను గర్వంగా భావిస్తున్నాను. త్వరలోనే టుస్సాడ్స్ మ్యూజియంలో కలుద్దాం అంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా రాంచరణ్ కూడా ఈ అరుదైన జాబితాలో చేరడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

క్వీన్ ఎలిజిబెత్ తర్వాత ఆ గౌరవం అందుకున్న చెర్రీ..

సాధారణంగా హీరోల మైనపు విగ్రహాలు మాత్రమే ఏర్పాటు చేస్తారు. కానీ పెంపుడు కుక్కతో కలిపి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా అరుదు. క్వీన్ ఎలిజిబెత్ తర్వాత రామ్ చరణ్‌కే ఈ అవకాశం దక్కింది. అందుకే ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×