Matar Paneer Sugarcane Juice: సోషల్ మీడియాలో ఇటీవల ఒక విచిత్రమైన వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. సాధారణంగా వేసవిలో చెరకు రసం తాగేందుకు చాలా మంది ఇష్టపడుతారు. చల్లగా, తీపిగా ఉండే ఈ పానియాన్ని అందరూ ఇష్టంగా తాగుతారు. కానీ, తాజాగా ఓ చెరకు రసం వ్యాపారి చేసిన ప్రయోగం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎందుకంటే, అతడు చెరకు రసంలో మటర్ పనీర్ కలిపి కొత్తరకం డ్రింక్ తయారు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. సదరు వ్యాపారి ముందుగా చెరకు రసం తీసే మిషన్ దగ్గరికి మటర్ పనీర్ కర్రీని తీసుకొచ్చాడు. చెరకు గడలో ఆ కర్రీన్ ఉంచి మిషన్ లో పెట్టాడు. టమాటా గ్రేవీతో పాటు మొత్తం కూరనే చెరకుతో కలిపి మిషన్‌లో వేశాడు. తర్వాత ఆ మిశ్రమాన్ని రసం లాగా బయటకు తీసాడు. అలా వచ్చిన జ్యూస్ ను ఆరెంజ్ కలర్‌లో కనిపించింది. చివరగా దాన్ని గ్లాసులో పోసి కస్టమర్లకు ఇచ్చాడు. దానిని ఓ కస్టమర్ తాగి సూపర్ ఉందంటూ ప్రశంసించాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టిన వెంటనే.. బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోపై జోరుగా చర్చ మొదలైంది. చాలా మంది ఈ కాంబినేషన్ చూసి ఆశ్చర్యపోయారు. మరికొందరు అసహ్యంగా ఉందని కామెంట్లు చేశారు. “ఇది ఫుడ్ కాదు, ఫుడ్ క్రైమ్” అంటూ చాలా మంది నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కొందరు అయితే ఇలాంటి ప్రయోగాలు ఆరోగ్యానికి కూడా మంచివి కావని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ప్రయోగాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని మరికొంత మంది కోరుతున్నారు.
Matar-Paneer sugarcane juice😭 pic.twitter.com/KoH3DYHsIn
— rareindianclips (@rareindianclips) May 7, 2026
ఇటీవల సోషల్ మీడియాలో విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐస్ క్రీమ్ దోసె, చాక్లెట్ బిర్యానీ, ఫాంటా మ్యాగీ లాంటి ప్రయోగాల తర్వాత ఇప్పుడు మటర్ పనీర్ చెరకు రసం కూడా ఆ జాబితాలో చేరింది. వ్యూస్, లైక్స్ కోసం కొందరు వ్యాపారులు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని నెటిజన్లు అంటున్నారు. కొంతమంది మాత్రం “ఒక్కసారి రుచి చూసిన తర్వాతే కామెంట్ చేయాలి” అని సరదాగా స్పందించారు. కానీ ఎక్కువ మంది మాత్రం ఈ కాంబినేషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరకు రసం తీపి రుచికి, మటర్ పనీర్ మసాలా రుచిని కలపడం చాలా వింతగా ఉందని మరికొంతమంది చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ప్లాట్ ఫారమ్ లలో బాగా వైరల్ అవుతోంది. లక్షలాది మంది ఈ వీడియోను చూసి తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కొందరు నవ్వుకుంటే, మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఇషా అంబానీ వజ్రాల చీర.. 50 మంది కళాకారులు, 1200 గంటల శ్రమతో తయారీ!