E-Paper
Advertisement

ఇషా అంబానీ వజ్రాల చీర.. 50 మంది కళాకారులు, 1200 గంటల శ్రమతో తయారీ!

ఇషా అంబానీ వజ్రాల చీర.. 50 మంది కళాకారులు, 1200 గంటల శ్రమతో తయారీ!
Advertisement

Isha Ambani’s Luxe Look at Met Gala 2026: మెట్ గాలా 2026 ఈవెంట్ లో భారతీయ బిలియనీర్ ఇషా అంబానీ కళ్లు చెదిరే ఎంట్రీతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పటికే ఈ ఈవెంట్ కు ఐదుసార్లు హాజరు కాగా, ఆరోసారి కూడా యూనిక్ లుక్ తో కనువిందు చేశారు. ఆమె స్టైల్, ఆభరణాలు, క్రేజీ డిజైన్  కలిసి గ్రాండ్ ప్రెజెన్స్‌ ను క్రియేట్ చేశాయి.

 ప్రత్యేక ఆకర్షణగా బంగారు చీర

ఈసారి ఇషా అంబానీ ధరించిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అవాంట్ గార్డ్ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ఈ గోల్డ్ చీరలో ఫ్రెస్కో పెయింటింగ్ ప్రేరణతో చేసిన డిజైన్లు కనిపించాయి. చేతితో చిత్రించిన ఆర్ట్‌ వర్క్, ఎంబ్రాయిడరీ పని తనం, శిల్పకళను పోలిన డ్రేపింగ్ కలిసి ఈ చీరను ఒక కళాఖండంగా మార్చాయి. ఈ డ్రెస్‌ ను స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అడజానియా  ప్రత్యేకంగా స్టైల్ చేశారు.

50 మంది కళాకారులు, 1200 గంటల సమయం

Advertisement

ఈ చీర తయారీలో ఎంతో మంది కష్టపడ్డారు. దాదాపు 50 మంది కళాకారులు, 1,200 గంటలకు పైగా కష్టపడి ఈ చీరను తయారు చేశారు. చీర అంటే కేవలం వస్త్రం కాదు, అది ఓ కళారూపం అనే ఆలోచనతో రూపొందించారు. భారతీయ సంప్రదాయం, హస్తకళలను ఆధునిక ఫ్యాషన్‌ తో కలిపి ఈ చీరకు ఓ కొత్త రూపాన్ని ఇచ్చారు.

1800 క్యారెట్లకు పైగా విలువైన వజ్రాలు

ఇక ఆభరణాల విషయానికి వస్తే, ఇషా ధరించిన నగలు మరింత హైలైట్ అయ్యాయి. ఆమె మొత్తం 1,800 క్యారెట్లకు పైగా విలువైన వజ్రాలు, పచ్చలు, ఇతర రత్నాలను ధరించారు. ఇవన్నీ ఆమె తల్లి నీతా అంబానీ ప్రైవేట్ కలెక్షన్ నుంచి తీసుకున్నవే. పాత కాలపు వజ్రాలు, పోల్కీ స్టోన్స్, అరుదైన పచ్చలు కలిపి గ్రాండ్ లుక్‌ ను ఇచ్చాయి. ఆమె ధరించిన బ్లౌజ్‌ పైన కూడా విలువైన రత్నాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ ఆభరణాలు మొత్తం ఆమె లుక్‌ ను మరింత విలాసవంతంగా మార్చాయి. అంతేకాకుండా, ఓ ఆసక్తికరమైన యాక్సెసరీగా, ఆమె ట్రాన్స్ పరెన్స్ పర్సులో ఒక మామిడి పండును తీసుకెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆహా అనిపించే అందంతో..

Advertisement

అందం విషయంలో కూడా ఇషా అంబానీ ప్రత్యేకంగా కనిపించారు. ఆమె హెయిర్ స్టైల్ సింపుల్‌ గా హాఫ్ అప్, హాఫ్ డౌన్ లుక్‌ లో ఉండగా, మేకప్ మాత్రం గ్లోయింగ్ ఫినిష్‌ తో మెరిసిపోయింది. బంగారు రంగు టోన్స్, నిగనిగలాడే పెదవులు, మెరిసే చర్మంతో మొత్తం లుక్ చాలా గ్రేస్‌ ఫుల్‌ గా కనిపించింది.

ఇక గత ఏడాది కూడా ఆమె ఇదే ఈవెంట్‌ లో భారీ వజ్రాల నెక్లెస్‌ తో హైలైట్ అయ్యారు. ఆ నెక్లెస్‌  89 వజ్రాలతో మొత్తం బరువు 481 క్యారెట్లకు పైగా ఉంది. దాన్ని తయారు చేయడానికి 15,000 గంటలకు పైగా సమయం పట్టింది. ఈసారి కూడా ఇషా తన క్రేజీ ఫ్యాషన్ తో ఆకట్టుకున్నారు. ఆమె ధరించిన చీర, ఆభరణాలు, మొత్తం స్టైలింగ్ మెట్ గాలాలో మరోసారి  ప్రత్యేకంగా నిలబెట్టాయి.

Read Also: మిస్సైన 37 ఏళ్లకు తిరిగొచ్చిన విమానం, ఇప్పటికీ అంతు చిక్కని పాన్ ఆమ్ 914 ఫ్లైట్ మిస్టరీ!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×