E-Paper
Advertisement

Mother Endangers Son: షాకింగ్ వీడియో.. చీర కోసం కొడుకును 4వ అంతస్తు నుంచి వేలాడదీసిన తల్లి!

Mother Endangers Son: షాకింగ్ వీడియో.. చీర కోసం కొడుకును 4వ అంతస్తు నుంచి వేలాడదీసిన తల్లి!
Advertisement

Mother Endangers Son: మాతృత్వానికే మచ్చ తెచ్చేలా.. ఒక చిన్న వస్తువు కోసం కన్న బిడ్డ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగో అంతస్తులో నివసించే ఒక మహిళ.. మూడో అంతస్తు బాల్కనీలో పడిపోయిన తన చీరను ఎలాగైనా తిరిగి తెచ్చుకోవాలని భావించింది. అయితే నేరుగా వెళ్లి తెచ్చుకునే మార్గం లేకపోవడంతో ఆమె అత్యంత ప్రమాదకరమైన.. పిచ్చి నిర్ణయం తీసుకుంది. తన కొడుకు నడుముకు మరో చీరను కట్టి నాలుగో అంతస్తు గ్రిల్స్ నుండి మూడో అంతస్తు బాల్కనీకి వేలాడదీస్తూ కిందకు దించింది.

ఈ భయంకరమైన దృశ్యం చూస్తుంటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. ఆ బాలుడు గాలిలో వేలాడుతూ కష్టమ్మీద మూడో అంతస్తు బాల్కనీలోకి దిగి అక్కడ ఉన్న చీరను అందుకున్నాడు. ఆ తర్వాత సదరు మహిళ తన కొడుకును తిరిగి పైకి లాగింది. ఈ మొత్తం వ్యవహారం జరుగుతున్న సమయంలో చీర ఏమాత్రం పట్టు తప్పినా లేదా గ్రిల్స్ నుండి జారినా ఆ బాలుడు నేరుగా కింద పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కేవలం ఒక చీర కోసం ఇంతటి సాహసానికి ఒడిగట్టడం ఆ తల్లి మూర్ఖత్వానికి నిదర్శనమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఈ ఘటనను ఎదురుగా ఉన్న భవనంలోని వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ దృశ్యాలు చూసిన వారంతా “చీర పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు.. కానీ బిడ్డ ప్రాణం పోతే తిరిగి వస్తుందా?” అంటూ సదరు తల్లిపై మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన తల్లిగా ఉండాల్సిన ఆమె.. స్వల్ప కారణాల కోసం పసివాడి ప్రాణాలను పణంగా పెట్టడం పట్ల పోలీసులు.. చైల్డ్ వెల్ఫేర్ అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Read Also:Mahalakshmi Smart Cards: మహిళలకు బిగ్ అలర్ట్.. ఫ్రీగా బస్సులో వెళ్లాలంటే.. ఆ కార్డు తప్పనిసరి!

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×