BigTV English

Naa Anvesh latest video: అంత దరిద్రమైన వీడియోస్ అవసరమా.. నా అన్వేష్ పై నెటిజన్స్ ఫైర్!

Naa Anvesh latest video: అంత దరిద్రమైన వీడియోస్ అవసరమా.. నా అన్వేష్ పై నెటిజన్స్ ఫైర్!

Naa Anvesh latest video: నా అన్వేష్ వీడియోలు వచ్చాయంటే మిలియన్స్ లలో వ్యూస్ రావాల్సిందే. అలాంటి నా అన్వేష్ తాజాగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. ఈ వీడియోను చూసి కొందరు సీరియస్ కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు ఉన్న విషయమేగా చెప్పింది అంటూ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇంతకు అన్వేష్ చెప్పిందేంటి? ఎందుకింత సీరియస్ కామెంట్స్ వస్తున్నాయో తెలుసుకుందాం.


ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ అంటే తెలియని వారుండరు. నిరంతరం ప్రపంచం చుట్టేస్తూ.. అక్కడి వింతలు విశేషాలు తెలపడంలో ఎప్పుడూ బిజీగా ఉండడం నా అన్వేష్ వంతు. అయితే ఇటీవల కొద్ది రోజులు బెట్టింగ్ మాఫియా అంటూ తెగ వైరల్ అయ్యాడు. ఒక్కొక్క సెలబ్రిటీ పేరిట వీడియోలు చేస్తూ.. బెట్టింగ్ ఇక ఆపాలని లేకుంటే ఇదే తీరున విమర్శలు ఉంటాయని ప్రకటించాడు. ఆ బెట్టింగ్ వ్యవహారం ఇప్పుడు కాస్త చల్లబడగానే, నెటిజన్స్ చేసే కామెంట్స్ కు స్పందించడం మొదలుపెట్టాడు. తాజాగా ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన నా అన్వేష్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారాయి.

నెటిజన్ అడిగిందేంటి?
విదేశాలలో గల వ్యక్తులకు, ఇండియన్స్ కు ఒక విషయంలో వివరణ అడిగినట్లు నా అన్వేష్ మాటలను బట్టి అర్థమవుతోంది. విదేశీయులు మల విసర్జన కు వెళ్ళినప్పుడు ఏం చేస్తారని నెటిజన్ అడిగాడట. దీనితో నా అన్వేష్ ఆ నెటిజన్ మాటకు స్పందిస్తూ వీడియో చేయడమే ఇప్పుడు సంచలనంగా మారింది.


Also Read: Sarkaar 5 Promo: సినిమా తీస్తానంటున్న బబ్లూ.. రాజు దెబ్బకు కన్నీళ్లు!

నా అన్వేష్ మాట ఇదే..
తాజాగా నా అన్వేష్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా విడుదల చేసిన వీడియో మేరకు.. విదేశీయులు మల విసర్జన కు వెళ్ళిన సమయంలో టిష్యూ పేపర్స్ వాడతారని, మనం అలా కాదు కదా అంటూ బాత్ రూమ్ వద్ద ఉండి మరీ కాస్త నా అన్వేష్ వివరణాత్మకంగా వివరించాడు. మనం నీటిని వినియోగిస్తాం కాబట్టి మన శుభ్రత వారికి రాదని కూడా అన్వేష్ తేల్చి చెప్పాడు. ఇదే ఇప్పుడు కొందరు నెటిజన్స్ కు ఆగ్రహం తెప్పించింది.

కొందరు ఆగ్రహం.. మరికొందరు మరోలా!
నా అన్వేష్ విడుదల చేసిన వీడియోకు నెటిజన్స్ నుండి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మరీ ఇలాంటి చెత్త వీడియోలు చేయాల్సిన అవసరం నా అన్వేష్ కు ఏమొచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ యాత్రికుడి వీడియోలు అంటే క్రేజ్ ఉందని, అటువంటప్పుడు ఇలాంటి వీడియోలు మహిళలు చూడగలరా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరికొందరు నా అన్వేష్ కు మద్దతు ఇచ్చే వారు కూడా లేకపోలేరు. ఔను ఉన్న విషయం చెప్పాడు.. ఇందులో తప్పేముందని కొందరు అనేస్తున్నారు. అయితే నా అన్వేష్ వీడియోలో కొన్ని పదాలు వాడకుండా ఉండాల్సిందని, ఇలాంటి వీడియోలు చేయవద్దని కొందరు సూచిస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై కూడా నా అన్వేష్ వీడియో చేస్తాడేమో వేచిచూడాలి.

Related News

Viral Video: గుడ్డుపై 150మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు.. ఈ వండర్ ఫోటోను ఇప్పుడే చూసేయండి బ్రో!

ఇది రియల్లీ మైండ్ బ్లోయింగ్ వీడియా.. తాళాన్ని క్షణాల్లో ఓపెన్ చేశాడు.. ఇక దొంగలకు తెలిస్తే..?

Drunken Trump: ఫుల్‌గా మందుకొట్టి.. పుతిన్ ముందుకు.. ట్రంప్ మామ దొరికిపోయాడు, ఎలా తడబడ్డాడో చూడండి

Mumbai Hotel: ముంబై హోటల్‌లో కప్పు టీ అక్షరాల రూ.1000.. ఈ ఎన్ఆర్ఐ రియాక్షన్ చూడండి, వీడియో వైరల్

Leopard Attack: సఫారీ రైడ్‌లో బాలుడిపై చిరుత అటాక్.. పరిగెత్తుకుంటూ వచ్చి మరీ.. వీడియో వైరల్

Viral Video: ఈ రెస్టారెంట్‌ లో గాల్లో ఎగురుతూ వడ్డిస్తారు.. భలే ఉందే!

Big Stories

×