Sarkaar 5 Promo: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). ఈ షోలో స్క్రిప్ట్ రైటర్ గా కెరియర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగి తన టాలెంట్ తో అందరిని అబ్బురపరిచారు. అటు సినిమాలలో హీరోగా కూడా నటించి ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం డ్రామా జూనియర్స్ తో పాటు ఫ్యామిలీ స్టార్స్, సర్కార్ 5 వంటి షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వేదికగా ప్రసారమవుతున్న షో సర్కార్ 5. తాజాగా ఐదవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సర్కార్ 5 ప్రోమో రిలీజ్.. రాజు దెబ్బకు బబ్లూ కన్నీళ్లు..
తాజాగా 5వ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేయగా.. ఈసారి ఎపిసోడ్ కి బబ్లూ(Babloo), విరాజిత(Viraajita), రీతు చౌదరి(Ritu Chaudhary), యాదమ్మ రాజు(Yadamma Raju) గెస్ట్లుగా వచ్చారు. ఇక ప్రోమో స్టార్ట్ అవ్వగానే బబ్లూ స్టేజ్ పైకి రాగానే కోటి ఇస్తే వెళ్ళిపోతాను అంటూ సుధీర్ తో చెబుతాడు. కోటి ఇస్తే ఏం చేస్తావని సుధీర్ అడగగా..సినిమా తీస్తాను అని బబ్లు సమాధానం చెబుతారు .టైటిల్ ఏంటి అని అడగ్గా..” ఎవరికి తెలుసు” అని బబ్లు అంటే.. టైటిల్ బాగుంది అంటూ ఆట పట్టిస్తారు సుధీర్. ఇక తర్వాత యాదమ్మ రాజు తనదైన కామెడీతో పంచులు విసురుతూ హైలెట్గా నిలిచారు. ఇక సినిమా తీస్తానని చెప్పిన బబ్లుని అటు విరాజిత ఒక ఆట ఆడుకుంది. కావాలనే ప్రతిసారి ఎవడికి తెలుసు? ఎవడికి తెలుసు? అంటూ షోలో నవ్వులు పూయించింది. ఇక దీనికి తోడు యాదమ్మ రాజు వేసే పంచులకు తట్టుకోలేక బబ్లూ కన్నీళ్లు పెట్టుకోవడం మనం చూడవచ్చు. మొత్తానికి అయితే సినిమా తీస్తానని షోకి వచ్చిన బబ్లూ యాదమ్మ రాజు చేసే కామెడీకి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు.
సుధీర్నే బోల్తా కొట్టించిన విరాజిత..
ఇకపోతే ఈ షో కి విరాజిత కూడా వచ్చినట్లు ప్రోమోలో చూపించారు. ఇక రావడం రావడమే నువ్వు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడం కాదు.. నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి అంటూ కొన్ని ప్రశ్నలు సంధించింది. దీంతో వాటికి సమాధానం చెప్పలేక తికమక పడిపోయారుసుదీర్. ఇక విరాజిత కూడా తన కామెడీ పంచులతో ప్రోమోకి హైలెట్గా నిలిచింది. మొత్తానికైతే తాజాగా విడుదల చేసిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక పూర్తి ఎపిసోడ్ జూలై 4 రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.
ALSO READ:Peddi Shooting Update: ఢిల్లీకి పయనమవుతున్న యూనిట్.. సెట్లో జాన్వీ ఆరోజే జాయిన్!