Asia Cup 2025 Schedule: క్రికెట్.. ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించిన గేమ్. అయితే అలాంటి క్రికెట్లో కొన్ని జట్ల మధ్య మ్యాచ్ జరిగితే జనాలు ఆసక్తిగా చూస్తారు. అలాంటి వాటిలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఒకటి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిందంటే అభిమానులకు పండగే. బయట ఎంత పెద్ద పని ఉన్నప్పటికీ కూడా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ చూసేందుకు ఇంటి దగ్గరే ఉండిపోతారు. బయటకు వెళ్లినా కూడా హోటల్లో లేదా.. క్లబ్బుల్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉండిపోతారు. అంతలా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కు మంచి పాపులారిటీ ఉంది.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ షెడ్యూల్ వచ్చేసింది
ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్లీ టోర్నమెంట్ మరొకటి రాబోతోంది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఈ సంవత్సరం చివర్లో జరగబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ మాసంలో ఆసియా కప్ 2025 టోర్నమెంట్ జరగబోతుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ టి20 ఫార్మాట్లో జరగనుంది.
పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్
ఆసియా కప్ 2025 t20 ఫార్మాట్లో జరగబోతోంది. సెప్టెంబర్ మాసంలో జరగబోతున్న ఈ టోర్నమెంటులో ఆసియా ఖండంలోని క్రికెట్ జట్లు అన్ని పాల్గొంటాయి. ఈ లిస్టు ప్రకారం మొత్తం ఆరు జట్లు పాల్గొనబోతున్నాయి. పాకిస్తాన్, టీమిండియా, జట్టతో పాటు ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా పాల్గొంటాయి. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్ ను జూలై మొదటి వారంలోనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన సెప్టెంబర్ 10వ తేదీన ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే టోర్నమెంట్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ టి20 ఫార్మాట్ లో రాబోతున్న నేపథ్యంలో….. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరు దూరం కాబోతున్నారు. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు టెస్టులతో పాటు టి20 లకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే ఈ టోర్నమెంట్లో వాళ్ళిద్దరూ ఆడబోరు. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈ టోర్నమెంట్ టీమిండియా ఆడనుంది. ఇది ఇలా ఉండగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య… గత రెండు నెలల కింద యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. భారతదేశానికి సంబంధించిన యాత్రికులను పాకిస్తాన్ ఉగ్రవాదులు దారుణంగా చంపిన నేపథ్యంలో… రివర్స్ అటాచ్ చేసింది ఇండియా. దీంతో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించారు. ఆ తర్వాత యుద్ధం జరిగి శాంతి.. జరిగాయి. ఇక ఈ యుద్ధం తర్వాత మళ్లీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నిర్వహించబోతున్నారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా కచ్చితంగా ఈ రెండు జట్లు తలపడే ఛాన్సులు ఉన్నాయి.
Reports add that the tournament will consist of 6 teams, including India & Pakistan, and the schedule can be out by the 1st week of July.
Afghanistan, Sri Lanka, Bangladesh, and the UAE are the other 4 participating teams in the tournament.
Source: Cricbuzz #AsiaCup #T20I… pic.twitter.com/ft40NXmE3l
— InsideSport (@InsideSportIND) June 29, 2025