Pahalgam Terror Attack: పహల్ గామ్ ఉగ్ర దాడితో యావత్ భారతదేశం ఉలిక్కి పడింది. విహారయాత్ర కోసం వెళ్లిన టూరిస్టులపై ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. ఏకంగా 28 మందిని తుపాకులతో కాల్చి చంపాయి. ఆయా టూరిస్టులు ముస్లీంలా? కాదా? అని చెక్ చేసి మరీ దారుణానికి ఒడిగడ్డారు ముష్కరులు. కల్మా చెప్పించి, అండర్ వేర్ లోకి తొంగి చూసి మరీ, ముస్లీంలు కాని వారిని పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపారు. భారతీయ స్విట్జర్లాండ్ గా పిలుచుకునే పహల్ గామ్ ను రక్తసిక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రపంచాధినేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇస్లామిక్ టెర్రరిజాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు.
పాక్ హై కమిషన్ ఆఫీస్‌లో సంబరాలు
పహల్ గామ్ ఉగ్రదాడిలో భారత పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోన్న వేళ, పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలో వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకల కోసం ఓ వ్యక్తి ఏకంగా కేక్ తీసుకెళ్తూ మీడియాకు కనించాడు. ఈ కేక్ ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పాలని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పటికీ సైలెంట్ గా తీసుకెళ్లాడు. రెండు దేశాల నడుమ భీకర వాతావరణ పరిస్థితులు నెలకొన్న వేళ, ఎంబసీలోకి కేక్ తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
While India mourns, the Pakistan High Commission is celebrating with cake.pic.twitter.com/C9dljJ1jMB
— Rishi Bagree (@rishibagree) April 24, 2025
పాక్ ఎంబసీ వద్ద ఉద్రిక్తత
అటు ఢిల్లీలోని పాక్ ఎంబసీ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హై కమిషన్ లో వేడుకలు చేశారన్న వార్తలతో కోపోద్రిక్తులైన వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. ‘పాకిస్తాన్ ముర్దాబాద్’ అంటూ గళం విప్పారు. ప్రజలను చంపి సంబురాలు చేసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది ఆవేశంతో గేట్లు దాటేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. నిరసనకారులను అదుపుచేసేందుకు భద్రతా దళాలు భారీగా మోహరించాయి. ఎలాంటి అంవాఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మరోవైపు ప్రజల ప్రాణాలను తీసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరసనకారులు. పాక్ ఎంబసీ అధికారులను జైల్లో వేసి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: పీఓకే స్వాధీనం..! యుద్ధం శరణం గచ్చామి.. ప్రతీకారం తీసుకోవాల్సిందే..!
పాక్ ఎంబసీ అధికారులను బహిష్కరించిన భారత్
అటు పహల్ గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ ఘటన వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపించింది. పాకిస్తాన్ తో అన్ని రకాల సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయ అధికారులను వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు వాఘా-అట్టారీ బార్డర్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఉగ్రదాడికి పాల్పడిన వారితో పాటు వారి వెనుకున్నవారిని చేరుకుంటామని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. ఉగ్రదాడి వెనుకున్న ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు.
Read Also: వారికి ఊహకు అందని శిక్ష.. వెంటాడి వేటాడుతాం.. పాక్‌కు మోదీ మాస్ వార్నింగ్