BigTV English

Lady Aghori : అఘోరీపై రేప్ అటెంప్ట్ కేసు.. అక్కడ చేతులు వేసి…

Lady Aghori : అఘోరీపై రేప్ అటెంప్ట్ కేసు.. అక్కడ చేతులు వేసి…

Lady Aghori : శ్రీనివాస్ అలియాస్ అఘోరీ. లేడీ ట్రాన్స్‌జెండర్‌. మగాడా? కాదా? అనే డౌట్ ఇప్పటికీ ఉంది. మగాడు కాకపోతే.. అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం ఏంటనేది ప్రశ్న. శ్రీవర్షిణిని ముచ్చటగా మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు. అంతకు ముందే అఘోరీకి వేరే యువతితో వివాహం జరిగింది. లేటెస్ట్‌గా మరో బాధితురాలు పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. తనకు లేడీ అఘోరీ బలవంతంగా తాళి కట్టిందని.. రేప్ అటెంప్ట్ కూడా చేసిందంటూ సంచలన ఆరోపణలు చేసింది.


అఘోరీపై కేసు..

ఏప్రిల్ 28న అఘోరీ శ్రీనివాస్‌పై కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్లో అత్యాచారయత్నం కేసు నమోదు అయిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. లేడీ అఘోరీపై 64(1), 87, 318(4), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.


అఘోరీ చాలా టాలెంటెడ్ గురూ..

సనాతన ధర్మం పేరుతో బాధితురాలితో అఘోరీ ఫోన్లో పరిచయం పెంచుకున్నట్టు తెలుస్తోంది. తెలుసుగా.. అఘోరీ మంచి మాటకారి. ఒక్కసారి కనెక్ట్ అయితే.. ఇక విడిచి ఉండలేనంతగా అతుక్కుపోతుంది. చిట్టి, కన్నా, బంగారం అంటూ బోలెడ్ మాటలు చెబుతుంది. ఖరీదైన గిఫ్టులు గట్రా ఇస్తుంది. పూర్తిగా తన ట్రాప్‌లో పడిందని కన్ఫామ్ చేసుకున్నాక.. ఇక ఐ లవ్ యూ చెప్పడం, నిన్ను విడిచి నేనుండలేనంటూ రొమాంటిక్‌గా మాట్లాడటం చేస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్‌గా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంది. మూడు కేసుల్లోనూ.. ముగ్గురు యువతులతోనూ.. లేడీ అఘోరీ సేమ్ టు సేమ్ ఒకేలా డీల్ చేసింది.

ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులేసి..

లేటెస్ట్ కేసులోనూ అలానే జరిగింది. ఆ బాధితురాలిని బలవంతంగా కొండగట్టు ఆలయానికి తీసుకెళ్లి మెడలో తాళి కట్టిందట. ఆ తర్వాత కొత్తపల్లి కెనాల్ దగ్గరికి ఆ యువతితో వెళ్లి.. అక్కడ మగాడిలా ప్రవర్తించింది లేడీ అఘోరీ. బాధితురాలి ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులు వేసి.. అత్యాచారయత్నం చేయబోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. అక్కడితో అయిపోలేదు లేడీ అఘోరీ ఆగడాలు. బాధితురాలిని బెదిరించి 3 లక్షలు తన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకుందట. జరిగిన విషయాలన్నీ ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించిందట. భయపడిపోయిన ఆ యువతి కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో.. లేడీ అఘోరీపై రేప్ అటెంప్ట్ కేసు నమోదు చేశారు పోలీసులు.

ముగ్గురు యువతులు.. మూడు పెళ్లిళ్లు..

లేడీ అఘోరీ ఆగడాలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే తాంత్రిక పూజల పేరుతో ఓ మహిళ నుంచి 10 లక్షలు వసూలు చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తోంది. శ్రీవర్షిణి కంటే ముందే తనను పెళ్లి చేసుకుందంటూ మొదటి భార్య రాధిక కేసు వేసింది. ఇప్పుడు లేటెస్ట్‌గా తన మెడలో తాళి కట్టిందని.. రేప్ అటెంప్ట్ చేసిందని.. 3 లక్షలు కాజేసిందంటూ మరో మహిళ ముందుకొచ్చింది. ఇప్పటికైతే మూడు కేసులు అఘోరీపై నమోదయ్యాయి. ముందుముందు ఇంకెంత మంది బాధితులు బయటకు వస్తారో చూడాలి. పాపం శ్రీవర్షిణి.. సనాతనం, ధర్మం అంటూ అఘోరీ వలకు చిక్కింది. ఇప్పుడు వదల్లేక, ఉండలేక.. తెగ ఇదై పోతున్నట్టుంది. లేడీ అఘోరీ మాటలు అట్లుంటాయ్ మరి. ఆడదానిగా మారినా.. మగాడి బుద్దులు శ్రీనివాస్‌ను ఇంకా వదిలిపెట్టినట్టు లేవు.

Related News

Watch Video: లక్ అంటే నీదే రా అబ్బాయ్.. గుంత నుండి గండం తప్పించుకున్నావ్

Viral Video: ఏంటమ్మా, సాయం చేసినా తప్పేనా? దానికి కూడా కోప్పడితే ఎలా?

Himachal Pradesh News: మేనల్లుడుతో మేనత్త ఓయోలో కస్సమిస్సా.. ట్విస్ట్ ఏంటంటే..

Dinosaur Condom: డైనోసార్ కండోమ్.. రాయిని బద్దలకొడితే ఇది బయటపడింది, సైజ్ ఏంటీ సామి అంత ఉంది?

Viral video: రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై రిస్క్ చేసిన దంపతులు.. దూసుకొచ్చిన వందే భారత్!

Woman Sprays Pepper: ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే?

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Big Stories

×