E-Paper
Advertisement

Barbie Doll: హే ప్రభూ.. బార్బీలా మారాలనుకుని.. చివరికి జాంబీలా తయారైందేంటి

Barbie Doll: హే ప్రభూ.. బార్బీలా మారాలనుకుని.. చివరికి జాంబీలా తయారైందేంటి
Advertisement

Barbie Doll: సోషల్ మీడియా ప్రభావంతో ఫేమస్ అవ్వాలని ముఖానికి ఏది పడితే అది వాడేస్తున్నారు. మార్కెట్లో దొరికే కెమికల్ కాస్మెటిక్స్‌తో ముఖాన్ని పాడు చేసుకుంటున్నారు. మహిళలకు బార్బీలు అంటే చాలా ఇష్టం. ఎంతో అందంగా చక్కటి రూపంతో ఉండే బార్బీ బొమ్మలను చాలా ఇష్టపడుతుంటారు. అయితే తాజాగా ఓ మహిళ తానే బార్బీలా తయారవ్వాలని అనుకుంది. చివరికి బార్బీ కాదు కదా.. తన అందం అంతా కోల్పోయి ఓ జాంబీలా తయారైంది.

Advertisement

అందంగా కనిపించడానికి ముఖానికి చిన్న చిన్న సర్జరీలు కూడా చేయించుకుంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే ఇలా చేసినా వార్తలు ఎన్నో వింటూనే ఉన్నాం. శృతిహాసన్, సమంత,. నయనతార ఇలా ఎంతో మంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకుని మరి ముఖాన్ని అందంగా మార్చుకున్న విషయం తెలిసిందే. కానీ అందరికీ కూడా ఈ సర్జరీలు వర్క్ కాలేదు. అందంగా కనిపించాలనే ఆలోచనతో ఏవేవో ప్రమాదకరమైనవి వాడేసి ఉన్న అందాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ అందంగా బార్బీ బొమ్మలా కనిపించాలనుకుంది. కానీ చివరికి అంద వికారంగా తయారైంది. కనీసం చూడడానికి కూడా నచ్చని విధంగా మారిపోయింది.

Also Read: ఒక్కసారిగా భారీ కుదుపు.. షాపింగ్ మాల్‌లో భయంకరమైన సీన్

Advertisement

ఇరాక్‌లోని బాగ్దాద్‌కు చెందిన దాలియా అనే ఓ మహిళ నటిగా, ప్రెజెంటర్‌గా పనిచేస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా ఫేమస్. ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఈమెకు ఇన్ స్టాగ్రామ్ లో ప్రస్తుతం 9 లక్షల 95 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమె ఇందులో రీల్స్ చేస్తూ చాలా మంచి ఫ్యాన్ బేస్ కూడా సొంతం చేసుకుంది. అయితే ఒక రోజు బార్బీలా మారాలని అనుకుంది. దీంతో సర్జరీలు చేయించుకుంది.

బార్బీ బొమ్మలా తయారవ్వాలని మొత్తం 43 సార్టు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది. దీంతో బార్బీలా కావాలనుకున్న ఆమె కళ కాస్త చెదిరిపోయింది. చివరికి ఆమె ముఖం అందవికారంగా మారింది. ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు విభిన్న రకాల కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది ఆమెను జాంబీ అని కామెంట్లు చేస్తుండగా.. మరికొంత మంది ఇరాకీ బార్బీ అంటూ వెక్కిరిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమెనే హాట్ టాపిక్ అవుతోంది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×