Big Stories

khushboo Election Campaign: కుష్బూ అలక వీడినట్టే.. మరో రెండురోజుల్లో..!

Actress khushboo election campaign start april 4th

- Advertisement -

khushboo election campaign: ఎన్నికలు వచ్చాయంటే సినీ స్టార్స్ హంగమా అంతాఇంతా కాదు. వాళ్లని చూసేందుకు జనం కూడా ఎగబడతారు. కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ తమ అభిమాన నటీనటుల సభలకు వస్తుంటారు. సార్వత్రిక ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. 15 రోజుల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని అన్నిస్థానాలకు తొలి విడతలోనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు నటి ఖుష్బూ ఆనవాళ్లు లేవు. ఇంతకీ ఖుష్బూ ప్రచారానికి వస్తారా? లేక డుమ్మా కొడతారా? ఇవే ప్రశ్నలు తమిళ తంబీలను వెంటాడుతున్నాయి.

- Advertisement -

నటి ఖుష్బూ ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ హైకమాండ్ ఆమెని దూరం పెట్టింది. ఆ పార్టీలో చేరిన మరో నటి రాధికా శరత్‌కుమార్‌కు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. అన్నామలై, మురుగన్, తమిళిసై వంటి నేతలకు సీట్లు కేటాయించింది. కానీ ఖుష్బూకు మాత్రం మొండిచేయి చూపింది. దీంతో ఆవేదనతో లోలోపల కుమిలిపోతున్నారట ఖుష్బూ. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఖుష్బూ ఓటమి పాలయ్యారు. సరైన కేడర్ లేని కారణంగానే ఓటమి పాలయ్యానని భావించారామె. లోక్‌సభ ఎన్నికల్లో ఛాన్స్ వస్తుందని చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది.

తమిళ కమలనాధులు మాత్రం ఆమెకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదని, ఒక్కోసారి మాటలు కాస్త పార్టీకి ఇబ్బంది పెడతాయని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్‌ను గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేరని, ఎంపీ సీటు ఇంకా కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తంచేసినట్లు సమాచారం ఈ క్రమంలో ఆమెకు సీటు నిరాకరించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూ ఉంది. ఆమె ప్రచారంలో ఎప్పుడు పాల్గొంటారనే చర్చ జోరుగా సాగుతోంది. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ఎన్నికల ప్రచారం చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని అధికారులు క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రచారానికి రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ALSO READ: లెక్కల్లో మాంచి దిట్ట.. కారు, ఇల్లు లేని యువరాజు

అంతా అనుకున్నట్లు జరిగితే గురువారం నుంచి ప్రచారానికి రావచ్చని చెబుతున్నారు. షెడ్యూల్ కూడా రెడీ అయ్యిందని అంటున్నారు. రెండురోజులపాటు వేలూరు, ఆరున చెన్నై, తొమ్మిదిన ముంబై పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. 11న కృష్ణగిరి, 12, 13న నామక్కల్, 14న తిరుప్పూర్ రోడ్ షోలకు హాజరుకానున్నారు. 20 నుంచి 24 వరకు కేరళలో ప్రచారం చేయనున్నట్లు సమాచారం.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News