BigTV English

Drunked Man Hulchul: మద్యం మత్తులో యువకుడి వీరంగం.. ఏకంగా కరెంట్ తీగలపై పడుకున్నాడు

Drunked Man Hulchul: మద్యం మత్తులో యువకుడి వీరంగం.. ఏకంగా  కరెంట్ తీగలపై పడుకున్నాడు

Drunked Man Hulchul: న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులు చేసిన హంగామాకు హద్దే లేకుండా పోయింది. ఎవరితో మాట్లాడుతున్నాం? ఏం మాట్లాడుతున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయారు. అటు వారి చేష్టలకు పోలీసులు తలలు పట్టుకోవాల్సింది వచ్చింది. నిన్న రాత్రి ఒక్కో మందుబాబు కథ ఒక్కో సినిమా సీన్ ను తలపించింది.


కొందరు వ్యక్తులు ఆటోలు, బైకులపై హల్చల్ చేశారు. రెండు ఆటోలను పక్కపక్కనే నడిపిస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. అంతేకాదు కొందరు మందుబాబులు ఆ రెండు ఆటోపై నిల్చొని ప్రమాదకమైన స్టంట్‌లు చేశారు. అక్కడ ఆటోలు లేదా మందుబాబులు బ్యాలెన్స్ తప్పితే చాలా ప్రమాదమే జరిగి ఉండేది. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇక ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ.. మందుతాగిన ప్రతీ ఒక్కరికి తెగ ఇన్ల్ఫూయెన్స్ వచ్చేస్తుంది. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని అనుకున్నా.. లైసెన్స్, ఆర్సీ చూపించమని అడిగినా.. మా బాబాయ్ తోపు, మా అబ్బాయ్ ఊపు అంటారు. 5 నిమిషాల్లో మీకు కాల్ వస్తుంది చూడండి అని పోలీసులకే బెదిరిస్తారు. అలాంటి మందు మహానుబావుడు నిన్న నైట్ పోలీసులకు తగిలాడు. మనోడితో మీటర్ ఊదించడానికి పోలీసులు తెగ కష్టపడ్డారు.


రూల్స్ గురించి దైర్యంగా మాట్లాడాలంటే మాకు మేమే పోటీ.. మాతో మాకే సాటి అన్నట్టు ఉంటారు మందుబాబులు. తాగిన విషయాన్ని ఒప్పుకోకుండా తిప్పి తిప్పి రూల్స్ అన్ని మాట్లాడుతారు. నిన్నరాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నన్ను ఆపడానికి మీరెవరు అని పోలీసులపై ఎదురు తిరిగాడో మందుబాబు. ఇది నా షాపు.. ఇది నా బండి.. నా షాపు దగ్గర నా బండి పార్క్ చేస్తే తప్పేంటీ? అని పుష్ప రేంజ్‌లో పోలీసులతో ఆర్గ్యూ చేశాడు. అడ్డుకున్న తన ఫ్రెండ్ కి కూడా చెంప చెల్లుమనిపించాడు. మందు ఏస్తే అలా ఉంటుంది మరి.

ఇదిలా ఉంటే.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో మందుబాబు హల్చల్ చేశాడు. ఎం.సింగపురంలో యజ్జల వెంకన్న అనే యువకుడు మద్యం మత్తులో విద్యుత్ తీగలుపై పడుకున్నాడు. కాసేపు అక్కడే విన్యాసాలు చేశాడు. వెంటనే స్పందించిన గ్రామస్తులు ట్రాన్స్ ఫార్మర్ డీపీ స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ తీగలపై యువకుడు వెళ్లడంపై ఆరా తీశారు.

Also Read: అటు సంక్షేమం, ఇటు రాష్ట్రాభివృద్ధి.. ప్రజల సహకారంతో చేస్తామన్న సీఎం.. ప్రజలకు శుభాకాంక్షలు

పోలీసుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అన్నట్టు మారింది నిన్న రాత్రి పరిస్థితి. 1300 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైంది. కనీసం 1000 మందితోనైనా పోలీసులు నానా తంటాలు పడి ఉంటారు. తనిఖీల్లో అడ్డంగా దొరికిన వాళ్లు కూడా పోలీసులకు సహకరించలేదు. చేతనైతే బండి తీసుకుపోండి.. తాళం మాత్రం ఇచ్చేదే లేదు.. ఇది పోలీసులకు మందుబాబు చెప్పిన మాట. ఆ డైలాగ్ విన్న పోలీసులు మాకెందుకుకయ్యా ఈ కష్టాలు అన్నట్టు చూశారు.

పోలీసుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అన్నట్టు మారింది నిన్న రాత్రి పరిస్థితి. 1300 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైంది. కనీసం 1000 మందితోనైనా పోలీసులు నానా తంటాలు పడి ఉంటారు. తనిఖీల్లో అడ్డంగా దొరికిన వాళ్లు కూడా పోలీసులకు సహకరించలేదు. చేతనైతే బండి తీసుకుపోండి.. తాళం మాత్రం ఇచ్చేదే లేదు.. ఇది పోలీసులకు మందుబాబు చెప్పిన మాట. ఆ డైలాగ్ విన్న పోలీసులు మాకెందుకుకయ్యా ఈ కష్టాలు అన్నట్టు చూశారు.

నిన్న తనిఖీల్లో దొరికిన ఒక్కో క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ పోతే 2026లోకి కూడా ఎంటర్ అయిపోతాం. ఒక్కొక్కరు ఒక్కో ఆణిముత్యం. ఓ మందుబాబు పోలీసులు, మీడియా ఇద్దరి మీద ఒకేసారి హల్చల్ చేశాడు. కేసు పెట్టుకో.. వీడియో తీసుకో.. ఏం చేస్తారో చేసుకోండి.. ఇది ఆ మహానుబావుడి మాస్ డైలాగ్. ఓ మహిళ ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎవరిమాట వినేలాలేడు మనోడు.

నిన్న దొరికిన మరో ఆణిముత్యం ఈయన. కరెంట్ బిల్లులా చూపిస్తున్న ఈ బిల్లు మనోడి మందు మీటర్. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో 100 పాయింట్లు వస్తే బాబోయ్ అంటారు. అలాంటిది టెన్త్ పరీక్షల్లో టాప్ ర్యాంకర్ మార్కుల్లా ఏకంగా మనోడికి 550 పాయింట్లు వచ్చాయి. ఆ రిజల్ట్ రిపోర్టు చూసిన పోలీసులు ఖంగుతున్నారు. దీంతో పోలీసులు మనోడి వాహనం సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానా విధించారు.

ఒక్కొక్కరు ఒక్కో పెర్ఫార్మెన్స్ ఇస్తూ పోలీసులను నానా ఇబ్బందులకు గురిచేశారు. అయితే.. అక్కడ మందుబాబులు ఎంత హల్చల్ చేస్తున్న పోలీసులు మాత్రం ఓపిగ్గా, సహనంగా పనిచేస్తూ పోయారు.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×