One Nation, One Election | జమిలి ఎన్నికలు దేశానికి చాలా అవసరమని.. ప్రాక్టికల్ గా చూస్తే దేశ హితం కోసం అలా చేయక తప్పదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ అన్నారు. జనవరి 8, 2025 న జాయింట్ పార్లమెంటరి కమిటీ జమిలి ఎన్నికల అంశంపై చర్చలు ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ ని కూడా అమలు పరిచేందుకు కసరత్తు చేస్తోందని చెప్పారు.
మంగళవారం డిసెంబర్ 31, 2025న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “దేశం హితం కోసమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాలు తీసుకుంటారు. తుది నిర్ణయం ఆయనది మాత్రమే అవుతుంది. జమిలి ఎన్నికలు కూడా ఆయన ఆలోచనే. ఆయన నిర్ణయమే. ఆయన రెండోసారి 2019లో దేశ ప్రధానిగా ఎన్నికైనప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం చేసి జమిలి ఎన్నికల అంశాన్ని చర్చించారు. ఆ సమావేశంలో అన్ని పార్టీల అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు. ఇప్పటికే జమిలి ఎన్నికలు ఎలా నిర్వహించాలో ప్రాక్టికల్ గా దీనిపై కార్యాచరణ చేపట్టాం. ఈ పద్ధతి ఫెడరల్ స్ఫర్తికి విరుద్ధం కాదు. రాష్ట్రాల హక్కులని, రాష్ట్ర ఓటర్ల హక్కులని ఎవరూ హరించడం లేదు. రాజ్యంగం లోని ఆర్టికల్ 368 ప్రకరామే దీని ప్రక్రియ కొనసాగుతుంది. కేంద్ర ఎన్నికల జాబితా, రాష్ట్ర ఎన్నికల జాబితాలను దృష్టిలో ఉంచుకొనే అన్ని అమలవుతాయి” అని తెలిపారు.
Also Read: 2024లో భారత్ కోల్పోయిన మహానుభావులు వీరే..
డిసెంబర్ 18, 2024న వన్ నేషన్ వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) బిల్లుని లోక్ సభలో ప్రవేశ పెట్టాం. కాని దాన్ని ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యతిరేకించింది. అందుకే ఆ బిల్లుని పరిశీలించాలని 39 మంది సభ్యులు గల జాయింట్ పార్లమెంటరి కమిటీ (జెపిసి) కి పంపించారు.
యూనిఫామ్ సివిల్ కోడ్
కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్‌వాల్ యూనిఫామ్ సివిల్ కోడ్ (యుసిసి) పై కూడా మాట్లాడారు. “బిజేపీ మ్యానిఫెస్టోలో యుసిసి ఒక భాగం. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను మేము తగిన సమయంలో అమలు చేసేందుకు చర్యలు చేపతాం. కొన్ని రాష్రాలు దీన్ని అమలు చేస్తున్నాయి. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీలు దీన్ని ఆమోదించాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఈ చట్టాన్ని తీసుకురావడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ అంశంపై భారత లా కమిషన్ పరిశీలిస్తోంది.” అని అర్జున్ మేఘ్ వాల్ చెప్పారు.
డిసెంబర్ 2024 నెల ప్రారంభంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్ సభలో ప్రసంగం చేస్తే.. దేశంలో సెకులర్ సివిల్ కోడ్ తీసుకురావడానికి పూర్తి బలంతో ముందుకెళుతోందని వ్యాఖ్యానించారు.
“యూనిఫామ్ సివిల్ కోడ్.. ఒక బర్నింగ్ ఇష్యూ.. నేను దీని గురించి చర్చించాలనుకుంటున్నాను. ఈ అంశాన్ని కాన్సిటిటూయెంట్ అసెంబ్లీ నిర్లక్ష్యం చేసే ప్రసక్తి లేదు. యూనిఫామ్ సివిల్ కోడ్‌పై కాన్సిటిటూయెంట్ అసెంబ్లీ సుదీర్ఘంగా, లోతుగా చర్చించింది, పరిశీలించింది. చర్చల్లో అన్ని అంశాలు పరిశీలించిన తరువాత తదుపరి ఏ ప్రభుత్వం అధికారంలో ని వచ్చినా యూనిఫామ్ సివిల్ కోడ్ ని దేశంలో అమలు చేయాల్సిందే.
ఈ నిర్దేశాలు రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ స్వయంగా అప్పటి కాన్సిటిటూయెంట్ అసెంబ్లీకి నిర్దేశించారు. అయితే ఈ విషాయన్ని రాజ్యాంగాన్ని, దేశాన్ని గౌరవించనివారు అర్థం చేసుకోలేరు. వారు కేవలం అధికారం మాత్రమే తపిస్తూ ఉంటారు. అంబేడ్కర్ ని వారు పూర్తిగా అర్థం చేసుకోలేరు. మతపరంగా ఉన్న వ్యక్తిగత చట్టాలను నిషేధించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ బలంగా వాదించేవారు. ” అని ప్రధాని మోదీ అన్నారు.