E-Paper
Advertisement

Viral Video: భర్తను చావగొట్టిన భార్య.. గుండెలపై కూర్చొని పిడిగుద్దులు.. అదేం కొట్టుడురా నాయనా!

Viral Video: భర్తను చావగొట్టిన భార్య.. గుండెలపై కూర్చొని పిడిగుద్దులు.. అదేం కొట్టుడురా నాయనా!
Advertisement

Viral Video: దేశంలో ప్రతీ నిమిషానికి ఒక మహిళ హింసకు గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే స్త్రీలపై జరిగే దాడులకు వ్యతిరేకంగా గృహ హింస వంటి కఠిన చట్టాలు ఉన్నాయి. అదే మగవారికి ఇంట్లో గృహ హింస ఎదురైతే అతడి పరిస్థితి ఏంటన్న ప్రశ్న.. పురుష సంఘాల నుంచి నిత్యం వస్తూనే ఉంటుంది. అయితే ఈ వాదనకు మరింత బలం చేకూర్చే ఘటన తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగింది. తన భర్తపై ఓ భార్య అతి దారుణంగా దాడిచేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?

మధ్య ప్రదేశ్ లోని సత్నా ప్రాంతంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్య చేతిలో గృహ హింసకు గురైనట్లుగా చెప్పబడుతున్న వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. వైరల్ వీడియోను గమనిస్తే.. ఓ మహిళ తన భర్తను మంచం మీదకు తోసి ముఖంపై పదే పదే దాడి చేసింది. అతడి తప్పించుకునేందుకు పక్కకు జరగ్గా.. గుండెల మీద కూర్చొని ముఖంపై ఆపకుండా చెంప దెబ్బలు కొట్టింది. దెబ్బలకు తాళలేక ఆ భర్త.. కొద్దిసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని వీడియోలో గమనించవచ్చు.

Advertisement

భార్య అడ్డుకోకుండా.. మౌనంగా..

భర్తపై దాడి చేస్తున్న సమయంలో అక్కడికి ఓ మహిళ రావడం వీడియోలో గమనించవచ్చు. ఈ దాడిని అడ్డుకునేందుకు ఆమె కొద్దిగా ప్రయత్నించినప్పటికీ భార్య ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఆమె చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత అక్కడికి మరో వ్యక్తి వచ్చినప్పటికీ.. బాధితుడ్ని కాపాడేందుకు ప్రయత్నించలేదు. భార్య పదే పదే ముఖంపై దాడి చేస్తున్నప్పటికీ ఆమెను అడ్డగించే ప్రయత్నం చేయకుండా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు.

సీక్రెట్ కెమెరా పెట్టిన భర్త

Advertisement

భార్య నిత్యం వేధిస్తుండటాన్ని తట్టుకోలేకనే బాధితుడు.. తన ఇంట్లోని గదిలో సీక్రెట్ కెమెరా పెట్టాడని తెలుస్తోంది. దీనిని గమనించని భార్య.. యాథావిధిగా భర్తపై దాడి చేసినట్లు సమాచారం. తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేస్తానని భార్య పదే పదే భర్తను బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లు ఆమె అరాచకాలను భరిస్తూ వచ్చినట్లు సమాచారం. చివరికీ సహనం నశించి.. తన భార్య నిజస్వరూపం యావత్ ప్రపంచానికి తెలియాలన్న ఉద్దేశంతో ఇలా సీక్రెట్ కెమెరా పెట్టి దాడి దృశ్యాలను భర్త చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

Also Read: Tirumala: తిరుమలలో ఈ సంవత్సరం అద్భుతం జరగనుంది – ఏంటో తెలుసా..?

నెటిజన్ల రియాక్షన్..

భార్య దాడి వీడియో నెట్టింట వైరల్ కావడంతో అవి చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ విషయంలో పోలీసుల జోక్యాన్ని కోరుతున్నారు. స్త్రీలపై ఒక చిన్న దాడి జరిగితేనే భూతద్దంలో చూపించే ఈ సమాజంలో.. మగాడిపై ఈ స్థాయిలో భార్య దాడి చేస్తే పట్టించుకునే నాధుడే లేడా? అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం భర్తపై సెటైర్లు వేస్తున్నారు. అది గృహ హింస కాదని రిఫరీ లేకుండా జరిగిన WWW స్మాక్ డౌన్ మ్యాచ్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Gold Silver Prices: మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్.. ఎంతేంత పెరిగాయంటే?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×