BigTV English

Snake viral vedio: చెప్పునెత్తుకుపోయిన పాము..వీడియో వైరల్

Snake viral vedio: చెప్పునెత్తుకుపోయిన పాము..వీడియో వైరల్

Snake steals woman’s slipper and quickly slithers away vedio viral: కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ చెప్పిన కవితలా..కాదేదీ పాముకు అనర్హం అని మార్చుకోవాల్సి వస్తోంది. పాములు సాధారణంగా ఎలుకలు, కప్పల కోసం ఇళ్లలోకి వస్తుంటాయి. పాల కోసం కూడా వస్తుంటాయి. అదేమిటో ఆ పాముకు పాపం ఆకలేసిందో ఏమిటో ఓ మహిళకు సంబంధించిన చెప్పును అలా అమాంతం నోట కరుచుకుని వయ్యారంగా వెళిపోవడం కనిపించింది. అప్పుడెప్పుడో విఠలాచార్య సినిమాలోపాము తన నాగస్వరాన్ని తానే ఊదుకుంటున్నట్లు చూపించారు. అలాగే ట్రైయిన్డ్ పాములు వాటంతట అవే తలుపుల గొళ్లాలను తొలగించుకుని వెళ్లిపోతుంటాయి. అప్పట్లో తెలుగు సినిమాలు అలానే ఉండేవి.


సోషల్ మీడియాలో వైరల్ గా…

అయితే ఇక్కడ ఓ పాము కూడా ట్రైయిన్డ్ పాము మాదిరిగా యాక్షన్ షురూ చేసింది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ కొందరు హఠాత్తుగా ఇళ్ల మధ్యకు వచ్చిన ఓ పాము తనని ఎవరూ చూడటం లేదని అనుకుందో ఏమో గానీ ఓ ఇంటి ముంగిట వదిలిన మహిళ తాలూకు చెప్పును నోట కరుచుకుని అలా ఎత్తుకుపోయింది. పామును చూసి అక్కడి జనమంతా భయంతో పరుగులు తీయగా..కొందరు కేకలు పెట్టారు. ఈ హడావిడిలో పాము కాస్తా చెప్పును నోట కరుచుకుని అక్కడే ఉన్న చెట్ల పొదల మధ్యకు దూరిపోయింది. పాములు ఇలా కూడా చేస్తాయా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే పాత తెలుగు సినిమాలు గుర్తుచేసుకుంటున్నారు. అచ్చంగా సినిమాలలో మాదిరిగా పాము తిరగడం చూసి కామెంట్స్ చేస్తున్నారు అంతా.


Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×