BigTV English

Lady Aghori – SriVarshini : అఘోరీని కలిసిన శ్రీవర్షిణి.. హ్యాపీ ఎండింగ్!

Lady Aghori – SriVarshini : అఘోరీని కలిసిన శ్రీవర్షిణి.. హ్యాపీ ఎండింగ్!

Lady Aghori – SriVarshini : మళ్లీ లేడీ అఘోరీ దగ్గరికి చేరింది శ్రీవర్షిణి. ఇక లైఫ్‌ టైమ్ అఘోరీతోనే ఉంటానంటోంది. తమను విడదీయడానికి ఎవరూ ప్రయత్నం చేయొద్దని.. అలా చేస్తే ఈసారి ప్రాణాలు తీసుకుంటామని చెబుతోంది. వర్షిణి లేకుంటే తాను సైతం ఈ లోకాన్ని వదిలేస్తానంటూ అఘోరీ కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే తమ లాస్ట్ ఇంటర్వ్యూ అంటూ బిగ్ టీవీతో ప్రత్యేకంగా లైవ్‌లో మాట్లాడారు అఘోరీ-శ్రీవర్షిణి జంట.


కారులోనే కాపురం చేస్తారా?

10 రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఆ ఇద్దరు కలిశారు. నువ్వు లేక నేను లేను అంటున్నారు. ఒకరికి ఒకరం అంటూ ప్రమాణాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ ఓ గుర్తు తెలియని ప్రదేశంలో ఉన్నారు. వారున్న లొకేషన్ చెప్పడానికి ఇష్టపడలేదు. ఎప్పుడూ ఇలా కారులోనే తిరుగుతారా? కారులోనే కాపురం చేస్తారా? అనే ప్రశ్నకు ఆసక్తికర ఆన్సర్ చెప్పారు. ఇప్పటికే తాము ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నామని.. త్వరలోనే అక్కడ ఇల్లు కట్టుకుని మంచిగా సెటిల్ అవుతామని చెబుతున్నారు. అప్పటి వరకు తమ జోలికి ఎవరూ రావొద్దని కోరారు. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటామని అన్నారు. భవిష్యత్తులో తాము ఏం చేయబోతున్నామనే కార్యచరణను ఇప్పుడే బయటకు చెప్పమని తెలిపారు.


అఘోరీతో వర్షిణి పెళ్లి.. తర్వాత ఏం జరిగిందంటే..

శుక్రవారం సాయంత్రం బిగ్ టీవీ స్టూడియోలో ప్రత్యక్షమయ్యారు శ్రీవర్షిణి. ఇంటర్వ్యూల సంచలన విషయాలు చెప్పారు. లేడీ అఘోరీ, తాను పెళ్లి చేసుకున్నామని చెప్పారు. బెజవాడ, కనకదుర్గమ్మ గుడిలో ఒకసారి.. తన ఇంట్లో, తల్లిదండ్రుల సమక్షంలో మరోసారి.. రెండుసార్లు అఘోరీ తన మెడలో తాళి కట్టిదని తేల్చిచెప్పారు శ్రీవర్షిణి. తన పేరెంట్స్ పైతం తమ పెళ్లిని అంగీకరించారని చెప్పారు. కోడలు పిల్లా అంటూ అఘోరీని తమ కుటుంబంలో కలిపేసుకున్నారని అన్నారు. అయితే, విష్ణునే తమ లవ్ స్టోరీలో విలన్ అయ్యాడని మండిపడింది శ్రీవర్షిణి. తన పేరెంట్స్‌కు లేనిపోనివి చెప్పి.. మమ్మల్ని విడదీయాలని విష్ణు ప్రయత్నిస్తున్నాడని.. గతంలో పలుసార్లు తనను దారుణంగా కొట్టాడని ఆరోపించారు. మొదట్లో తమ పెళ్లిని ఒప్పుకున్న తల్లిదండ్రులు.. విష్ణు మాయలో పడి ఇప్పుడు విడదీయాలని చూస్తున్నారని అన్నారు. తాను మేజర్‌నని.. ఎవరితోనైనా కలిసి ఉండే హక్కు తనకుందనేది శ్రీవర్షిణి వాదన.

సెక్స్.. పిల్లలు.. ఫుల్ క్లారిటీ?

పెళ్లి అంటే మగవారితోనే చేసుకోవాలని ఏం లేదని.. అందుకే తాను లేడీ అఘోరీతో జీవితం పంచుకున్నానని చెబుతోంది శ్రీవర్షిణి. తనకు సెక్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదని.. పిల్లలు కావాలంటే అనాథాశ్రయం నుంచి తెచ్చుకుని పెంచుకుంటామని క్లారిటీ ఇస్తోంది. ఇక తన జీవితం అఘోరీతోనే అని తేల్చిచెబుతోంది. అన్నట్టుగానే శుక్రవారం నైట్ అఘోరీ చెప్పిన ప్లేస్‌కు చేరుకొని.. ఆమెతో వెళ్లిపోయింది. ఒకరిని ఒకరు చూసుకొని బోరున ఏడ్చేశారు ఇద్దరు. ఇక నుంచి తమ బతుకు తాము బతుకుతాం మని.. తమను విడదీయాలని చూస్తే చనిపోతామని చెబుతున్నారు.

Also Read : సూట్‌కేసులో గర్ల్‌ఫ్రెండ్.. బాయ్స్ హాస్టల్‌లో ఏం జరిగిందంటే..

ఏవండీ.. ఓ పాట పాడండీ…

అఘోరీపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ.. ఓ అద్భుతమైన పాట కూడా పాడారు శ్రీవర్షిణి.. “నీ పాట మధురం.. నీ మాట మధురం.. ఓ నాటి వరము.. ఏ జన్మ ఫలము.. ఇంత మోహమా.. అది అవసరమా.. ఇంక ప్రాణమా.. ఇది పరవశమా.. నా పాటలో ఇంత మహిమ.. కొంచెం ఆగుమా..” ఇలా సాగింది ఆ సాంగ్. శ్రీవర్షిణి ఆ పాట పాడగానే.. ఆ ఇద్దరూ ఒక్కసారిగా ఏడ్చేశారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి…

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×