Viral Video : వాళ్లిద్దరూ లవర్స్. తెగ లవ్ చేసుకుంటున్నారు. సినిమాలు, షికార్లకు తిరుగుతున్నారు. పార్కులకు, మాల్స్‌కు వెళ్తున్నారు. టూర్లు గట్రా చుట్టేస్తున్నారు. బయట మాట్లాడుకోవడం.. బయట తిరగడం బాగానే ఉన్నా.. ఏకాంతం మిస్ అవుతోందని తెగ ఫీల్ అయ్యారు. ఒకే గదిలో కలిసుంటే.. ఆ కిక్కే వేరనుకున్నారు. మరి, ఎలా? ఏం చేద్దాం? ఇద్దరూ స్టూడెంట్సే. ఇద్దరూ హాస్టల్స్‌లోనే ఉంటారు. మరి, రూమ్ ఎలా? ఏ హోటల్‌లోనో.. ఏ ఓయో రూమ్‌లోనో.. ఉందామంటే ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ ఉండలేం అనుకున్నారు. బాగా డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే, వాళ్లిద్దరూ కలిసి ఓ సూపర్ ఐడియా వేశారు. అది దాదాపు వర్కవుట్ అయింది కానీ.. లాస్ట్‌లో దొరికిపోయి అడ్డంగా బుక్ అయ్యారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే..
సూట్‌కేస్ ఐడియా అదుర్స్ కానీ…
అతడు యూనివర్సిటీకి చెందిన బాయ్స్ హాస్టల్‌లో ఉంటాడు. ఏదో ఒక రకంగా తన గర్ల్‌ఫ్రెండ్‌ను రూమ్‌కు తీసుకొస్తే.. కొన్నిరోజులు ఇద్దరూ కలిసే ఉండొచ్చని స్కెచ్ వేశాడు. అందుకు తన లవర్ సైతం వెంటనే ఓకే చెప్పేసింది. మరి, బాయ్స్ హాస్టల్‌కు అమ్మాయిని ఎలా తీసుకెళ్లాలి? వార్డన్ ఒప్పుకోడుగా? మిగతా బాయ్స్ చూస్తే ప్రమాదంగా? అనుకున్నారు. బాగా ఆలోచించి ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. పెద్ద సూట్‌కేస్ ఒకటి కొన్నారు. అందులో ఆ యువతిని కూర్చోబెట్టి జాగ్రత్తగా క్లోజ్ చేశాడు. ఆ సూట్‌కేసును లగేజ్ మాదిరి తన హాస్టల్‌కు తీసుకొచ్చాడు ఆ బాయ్‌ఫ్రెండ్.
Also Read : లేడీ అఘోరీతో శ్రీవర్షిణి పెళ్లి.. సెక్స్ కోసం…
అలా దొరికిపోయారు..
మొదట హాస్టల్ సెక్యూరిటీకి అంతగా అనుమానం రాలేదు. కానీ, ఆ సూట్‌కేస్ చాలా బరువు ఉండటంతో.. అతడు అతికష్టం మీద తీసుకెళ్తున్నాడు. అది చూసి స్టాఫ్‌కు డౌట్ వచ్చింది. అతన్ని ఆపి సూట్‌కేస్‌లో ఏముందని ప్రశ్నించారు. ఏం లేదు.. బట్టలు, ల్యాప్‌ట్యాప్ గట్రా ఉన్నాయన్నాడు. డ్రెస్సెస్ అయితే ఇంత బరువు ఎందుకు ఉంటాయని ఎదురు ప్రశ్నించారు. ఎందుకైనా మంచిదని సూట్‌కేస్ ఓపెన్ చేయమన్నారు. అతను మొదట అందుకు ఒప్పుకోలేదు. ఓపెన్ చేయనంటే చేయనని పట్టుబట్టాడు. కానీ, సెక్యూరిటీ మాత్రం వదల్లేదు. సూట్‌కేస్ ఓపెన్ చేయాల్సిందేనని బలవంతంగా తెరిచారు. అంతే. అక్కడ ఉన్నవాళ్లంతా షాక్. ఆ సూట్‌కేస్‌లో యువతి ఉంది. ఆమె అతని లవర్ అని తెలిసి అవాక్కయ్యారు. హాస్టల్‌లో ఇదేం పని అని ఆశ్చర్యపోయారు. విషయం యూనివర్సిటీ అధికారులకు చెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను అదే హాస్టల్‌లో ఉండే మరో స్టూడెంట్ సెల్‌ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సూట్‌కేస్ ఐడియా భలే ఉంది బాసూ అని కొందరు.. గాలి ఆడక ఆ సూట్‌కేసులోనే ఆమె చనిపోతే ఏం చేస్తావ్ బ్రో అంటూ మరికొందరు.. ఇలా రకరకాల కామెంట్లు వస్తున్నాయి. హర్యానాలోని జిందాల్ యూనివర్సిటీలో జరిగింది ఈ ఘటన.
A boy tried sneaking his girlfriend into a boy's hostel in a suitcase.
Gets caught.
Location: OP Jindal University pic.twitter.com/Iyo6UPopfg
— Squint Neon (@TheSquind) April 12, 2025