Lady Aghori : లేడీ అఘోరీ చుట్టూ వివాదం ముదురుతోంది. శ్రీవర్షిణితో పెళ్లి తర్వాత గొడవ నెక్ట్స్ లెవెల్‌కు చేరింది. ఒక్కొక్కటిగా అఘోరీ ఘోరాలన్నీ బయటకు వస్తున్నాయి. యో*ని పూజ చేస్తానంటూ ఓ మహిళ నుంచి 10 లక్షలు వసూలు చేసిన ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. లేటెస్ట్‌గా లేడీ అఘోరీ శ్రీనివాస్‌పై మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ పీఎస్‌కు మరో కంప్లైంట్ కూడా వచ్చింది.
అఘోరీపై పీఎస్‌లో ఫిర్యాదు
సనాతన ధర్మం పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడని.. అఘోరి పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడని.. జోగిని సంధ్య కంప్లెయింట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ అసలు అఘోరియే కాదని, హిజ్రా కూడా కాదని చెప్పారు. అక్కడ కాల్చితే.. సర్జరీ చేసుకున్నాడని జోగిని సంధ్య చెబుతోంది. ఇప్పటికే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని వదిలేశాడని.. ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని.. వాడిని అలా ఊరికే వదిలేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
రూ.3 కోట్లకు వర్షిణితో బేరం?
మరోవైపు, కృష్ణశర్మ సైతం లేడీ అఘోరీ, శ్రీవర్షిణి ఎపిసోడ్‌పై సంచలన కామెంట్స్ చేశారు. వర్షిణిని 3 కోట్ల రూపాయలకు ఆమె తల్లిదండ్రులే అఘోరీకి బేరం పెట్టారని ఆరోపించారు. లేడీ అఘోరీ ఇప్పటికీ వర్షిణి పేరెంట్స్‌తో టచ్‌లో ఉందని అన్నారు. అఘోరీకి బినామీ పేరుతో రూ.3 కోట్లు ఖరీదు చేసే విల్లా కూడా ఉందని చెప్పారు. శ్రీవర్షిణితో అఘోరీ నగ్న పూజలు చేసిందని చెప్పారు. అఘోరీకి కన్యలు కావాలని.. అందుకే వర్షిణిని పెళ్లి చేసుకుందని కృష్ణశర్మ అన్నారు.
మొదటి భార్యతో గొడవేంటి?
లేడీ అఘోరీపై వివాదాలు అన్నీఇన్నీ కాదు. ఇప్పటికే తాను మొదటి భార్యనంటూ రాధిక రచ్చ చేస్తోంది. అఘోరీతో ఫోటోలు, వాయిస్ కాల్స్ లీక్ చేసింది. వర్షిణి జీవితం నాశనం అవుతుందని హెచ్చరించింది. మరో యువతిని మోసం చేయకుండా అఘోరీని అరెస్ట్ చేయాలని రాధిక డిమాండ్ చేస్తోంది. ఇన్ని గొడవలు బయటకు వస్తున్నా.. లేడీ అఘోరీ మాత్రం తగ్గేదేలే అంటోంది. రాధిక ఎపిసోడ్ బయటకు రాగానే.. శ్రీవర్షిణిని ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకుంది. ఈసారి ఆ పెళ్లి లైవ్ టెలికాస్ట్ కూడా చేసింది. రాధిక ఆరోపణలన్నీ అబద్దమని.. దమ్ముంటే తమకు పెళ్లి అయినట్టు సాక్షాలు ఉంటే చూపించమని డిమాండ్ చేస్తోంది. తాను అనేకసార్లు డబ్బులు కూడా ఇచ్చానని.. ఆ బ్యాంక్ స్టేట్‌మెంట్స్ కూడా కావాలని అంటోంది. ఇక శ్రీవర్షిణియే తన భార్య అని.. జీవితాంతం తామిద్దరం కలిసే ఉంటామని చెబుతోంది ఆ జంట. తమను ఎవరైనా విడదీయాలని చూస్తే.. తమ జోలికి వస్తే.. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు ఆ ఇద్దరు.
Also Read : వీర్యకణాల రేసింగ్ పోటీలు.. ఎక్కడో తెలుసా?
అఘోరీ ఆగడాలు ఆగేనా?
ఇలా అఘోరీ, వర్షిణిల మేటర్ హాట్ హాట్‌గా సాగుతున్న సమయంలోనే.. కృష్ణశర్మ ఎంటర్ అయ్యారు. రూ. 3 కోట్లకు వర్షిణిని అఘోరీ కొనుక్కుందంటూ సంచలన కామెంట్లు చేశారు. నగ్న పూజలు చేసేందుకే.. వర్షిణి మెడలో తాళి కట్టిందని చెబుతున్నారు. అటు, జోగిని సంధ్య మాత్రం మరో వెర్షన్ వినిపిస్తోంది. అసలు వాడు అఘోరీ కాదు, హిజ్రా కూడా కాదని.. ముందు అతన్ని అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. మరి, ముందుముందు లేడీ అఘోరీ గురించి ఇంకెన్ని విషయాలు వినాల్సి వస్తుందో.