BigTV English

OTT Movie : శ్రీలంక రౌడీకి బుద్ధి చెప్పే ఇండియన్ సిటిజెన్ … మిస్ కాకుండా చూడాల్సిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్

OTT Movie : శ్రీలంక రౌడీకి బుద్ధి చెప్పే ఇండియన్ సిటిజెన్ … మిస్ కాకుండా చూడాల్సిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్

OTT Movie : తెలుగు దర్శకులు హిందీలో కూడా తమ సత్తా చాటుతున్నారు. సందీప్ రెడ్డి వంగా యనిమల్ సినిమాతో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా గోపీచంద్ మలినేని కూడా, ఒక యాక్షన్ మూవీని థియేటర్లలోకి తీసుకొచ్చాడు. సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అదరగొట్టాయి. తొందర్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ బాలీవుడ్ యాక్షన్ డ్రామా మూవీ పేరు ‘జాట్’ (Jaat). 2025 లో విడుదలైన ఈ మూవీకి గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సన్నీ డియోల్, రణ్‌దీప్ హుడా, రెజీనా కాసాండ్రా, సాయామి ఖేర్, వినీత్ కుమార్ సింగ్ వంటి నటులు నటించారు. ఈ స్టోరీ ఆంధ్రప్రదేశ్‌లోని మోటుపల్లి అనే గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ క్రూరత్వం, నేరాలు ఆధిపత్యం చెలాయిస్తాయి. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ తొందర్లోనే స్ట్రీమింగ్ కు రాబోతోందని సమాచారం.


స్టోరీలోకి వెళితే

శ్రీలంకలో టైగర్ ఫోర్స్ ఆధిపత్యం 2009 లో ముగిసిపోతుంది. ఆ తర్వాత రణతుంగ అనే కూలీ, శ్రీలంక నుండి బంగారు బిస్కెట్లతో భారతదేశానికి పారిపోతాడు. అతను శ్రీలంక సైన్యాన్ని హతమార్చి, ఆంధ్రప్రదేశ్‌లోని మోటుపల్లి గ్రామంలో తన నేర సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. రణతుంగ, తన సోదరుడు సోములు, భార్య భారతి సహాయంతో, గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తాడు. అక్కడి అధికారులను కూడా తన నియంత్రణలో పెట్టుకుంటాడు. ఈ గ్రామంలో బ్లాక్ మనీ, హత్యలు, సర్వసాధారణం అయిపోతాయి. గ్రామ ప్రజలు అతని పేరు చెప్పడానికి కూడా భయపడతారు. ఈ సమయంలో బల్దేవ్ ప్రతాప్ సింగ్ అలియాస్ జాట్, చెన్నై నుండి అయోధ్యకు రైలులో ప్రయాణిస్తుంటాడు. రైలు చీరాల వద్ద ఒక ప్రమాదం కారణంగా ఆగిపోతుంది. భోజనం కోసం బయటకు వచ్చిన జాట్, స్థానిక గుండాలతో చిన్న గోడవలో చిక్కుకుంటాడు. ఇది అతడు టిఫిన్ చేస్తుండగా మొదలవుతుంది.

ఈ చిన్న సంఘటన జాట్‌ను రణతుంగతో తలపడేలా చేస్తుంది. జాట్ ఆక్కడ ఉండే గ్రామస్తులను, రణతుంగ దౌర్జన్యం నుండి కాపాడాలని నిర్ణయించుకుంటాడు. అతను రణతుంగ, అతని గ్యాంగ్‌తో పోరాడుతూ అక్కడ ఉన్న ప్రజలకు మంచి చేయాలని చూస్తాడు. ఈ క్రమంలో స్థానిక పోలీసు అధికారి విజయలక్ష్మి అతనికి సహాయం చేస్తుంది. ఇక్కడ జాట్ కి కూడా గతంలో ఒక ఫ్లాష్ బ్యాగ్ ఉంటుంది. ఇక తన శక్తిని అంతా ఉపయోగించి రణతుంగ పై తలపడతాడు. ఈ యాక్షన్ సీన్స్ ఒక యుద్ధంలా తలపిస్తాయి.  చివరికి రణతుంగ నేర సామ్రాజ్యాన్ని జాట్ అంతం చేస్తాడా ? జాట్ గతం ఏమిటి ?మోటుపల్లి గ్రామస్తులు స్వేచ్చగా తిరుగుతారా ? ఈ విషయాలను తెలుసుకోవాలంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : హత్యలు చేసి నుదుటి మీద సంతకం … గ్యాంగ్ స్టర్ పోలీస్ ఎలా అయ్యాడు ? వామ్మో ఏందిరా సామీ ఈ ట్విస్ట్లు

Related News

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

OTT Movie : ఈ సైకో చేతికి అమ్మాయి దొరికితే అరాచకమే… వదలకుండా అదే పని… గూస్ బంప్స్ తెప్పించే కథ

OTT Movie : దొంగతనం చేసే పిల్లి… థ్రిల్లింగ్ ట్విస్టులు… ఊహించని సర్ప్రైజ్ లతో థ్రిల్ ఇచ్చే మలయాళ మూవీ

OTT Movie : పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన ఏజ్ లో వేషాలేస్తే ఇదే గతి

OTT Movie : మిస్టీరియస్ ప్లేస్ లో అమ్మాయి ట్రాప్… ఒక్కో ట్విస్ట్ కు మతి పోవాల్సిందే

OTT Movie : హెయిర్ కట్ కోసం ఇదెక్కడి అరాచకం సామీ… మనసును కదిలించే కన్నడ మూవీ

Big Stories

×