Aamir Khan: తెలుగు, హిందీ అని తేడా లేకుండా చాలామంది సీనియర్ హీరోలు.. యంగ్ హీరోలకు పోటీగా కథలను ఎంపిక చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. కానీ కొందరు సీనియర్ హీరోలు మాత్రం ఇక సినిమాలే వద్దు అన్నట్టుగా పక్కన పెట్టేశారు. అలాంటి వారిలో బాలీవుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ కూడా ఒకరు. అసలు తను ఇంక సినిమాలే చేయనని కోవిడ్ సమయంలోనే ప్రకటించేశాడు అమీర్ ఖాన్. దాదాపుగా ఇది తన రిటైర్మెంట్‌తో సమానమని అన్నాడు. కానీ అమీర్‌కు కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడే రిటైర్మెంట్ ఇవ్వడని చాలామంది అనుకున్నారు. కానీ తాజాగా ఈ సీనియర్ హీరో చేసిన పని చూస్తుంటే తనకు ఇక సినిమాలు ఇంట్రెస్ట్ లేవేమో అన్న డౌట్ వస్తోంది.
బయోపిక్ నుండి తప్పుకున్నాడు
అమీర్ ఖాన్‌కు మహాభారతాన్ని సినిమాగా తెరకెక్కించాలనే కోరిక ఉందనే ఎప్పుడో బయటపెట్టాడు. ఆ సినిమాను తాను నిర్మించడంతో పాటు తానే నటిస్తానని ముందే ప్రకటించాడు. ఆ ఒక్క సినిమానే అమీర్ ఆఖరి సినిమా అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. గత కొంతకాలంగా తను వెండితెరపై అంత యాక్టివ్‌గా లేడు. మళ్లీ నిర్మాతగానే బిజీ అయ్యాడు. ప్రస్తుతం తను ‘తారే జమీన్ పర్’ అనే మూవీలో మాత్రమే నటిస్తున్నాడు. ఆ తర్వాత అమీర్ చేస్తున్న అప్‌కమింగ్ సినిమాలపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఒక భారీ బడ్జెట్ బయోపిక్‌లో తను నటిస్తాడనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ బయోపిక్ నుండి కూడా తప్పుకున్నాడట అమీర్ ఖాన్.
హీరో కోసం ప్రయత్నాలు
ఉజ్వల్ నికమ్ అనే ఫేమస్ లాయర్ బయోపిక్‌లో అమీర్ ఖాన్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ విషయం బయటికి రాగానే ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. మామూలుగా బయోపిక్స్‌కు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే ఉజ్వల్ నికమ్ బయోపిక్ కూడా కచ్చితంగా హిట్ అవుతుందని ప్రేక్షకులు నమ్మారు. అందుకే అమీర్ ఖాన్ ఖాతాలో పక్కా హిట్ పడుతుందని వారు భావించారు. ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ అమీర్ ఖాన్ (Aamir Khan) ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని బీ టౌన్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ బయోపిక్ నుండి అమీర్ తప్పుకోవడం వల్ల వేరే హీరోల పేర్లను పరిగణనలోకి తీసుకుంటున్నారట మేకర్స్.
Also Read: అందంగా ఉన్నందుకే అవకాశాలు రావట్లేదు.. మిల్కీ బ్యూటీ ట్యాగ్‌పై తమన్నా రియాక్షన్
అదే కారణం
ఉజ్వల్ నికమ్ బయోపిక్ నుండి అమీర్ ఖాన్ తప్పుకోవడానికి వేర్వేరు కారణాలు కూడా ఉన్నాయని బీ టౌన్‌లో గాపిక్స్ వినిపిస్తున్నాయి. మేకర్స్‌కు, అమీర్ ఖాన్‌కు మధ్య క్రియేటివ్ తేడాలు రావడం వల్లే ఈ స్టార్ హీరో ఈ నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది. అయితే ఇలా తను చేయాల్సిన ప్రతీ సినిమా నుండి అమీర్ తప్పుకోవడం వల్ల అసలు తనకు ఇక సినిమాల్లో నటించే ఇంట్రెస్టే లేదా అని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. నిజంగానే తను చెప్పినట్టుగానే త్వరలోనే హీరోగా రిటైర్మెంట్ తీసుకొని పూర్తిగా నిర్మాతగా ఫిక్స్ అయిపోతాడా అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. అలా నిర్మాతగా అమీర్ ఖాన్ తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది.