E-Paper
Advertisement

డైనోసార్ తోలుతో హ్యాండ్ బ్యాగ్.. రూ.4 కోట్లు ఉంటే మీ సొంతం!

డైనోసార్ తోలుతో హ్యాండ్ బ్యాగ్.. రూ.4 కోట్లు ఉంటే మీ సొంతం!
Advertisement

T-Rex Hand Bag: డైనోసార్ తోలుతో చేసిన ప్రత్యేకమైన హ్యాండ్ బ్యాగ్ ను ఆమ్ స్టర్ డామ్ లో అమ్మకానికి పెట్టారు. ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన డైనోసార్ స్కిన్ తో ఈ హ్యాండ్‌బ్యాగ్‌ను తయారు చేశారు. దీనిలో టైరన్నోసారస్ రెక్స్ శిలాజాలకు సంబంధించిన కొల్లాజెన్‌ ఉన్నట్లు రూపకర్తలు తెలిపారు. ఈ బ్యాగ్ ను ప్రస్తుతం నెదర్లాండ్స్ లోని ఆమ్‌స్టర్‌డామ్‌ ఆర్ట్ జూ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఇక్కడ టి. రెక్స్ డైనోసార్ ప్రతిరూపంలో ఉన్న రాయిపై ఈ బ్యాగ్ ను డిస్ ప్లే పెట్టారు. టీల్ కలర్ లో ఉన్న ఈ బ్యాగ్ మే 11 వరకు ప్రదర్శనకు ఉంచుతారు. ఆ తర్వాత దీనిని వేలం వేయనున్నారు. ఈ బ్యాగ్ స్టార్టింగ్ ధర రూ.4 కోట్లుగా నిర్ణయించారు.

డైనోసార్ అవశేషాలతో

ఈ హ్యాండ్‌బ్యాగ్ ను జెనోమిక్ ఇంజినీరింగ్ కంపెనీ ఆర్గానాయిడ్, క్రియేటివ్ ఏజెన్సీ వీఎంఎల్, ల్యాబ్ గ్రోన్ లెదర్ లిమిటెడ్ సంస్థలు అభివృద్ధి చేశాయి. ఈ హ్యాండ్‌ బ్యాగ్ తయారీలో డైనోసార్ అవశేషాల నుంచి సేకరించిన పురాతన శిలాజాలను ఉపయోగించారు. ఈ శిలాజాలను ఒక జంతువు కణాలలోకి ప్రవేశపెట్టి కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేశారు. ఆ తర్వాత దానిని తోలుగా మార్చారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యమైన ‘ది ఆర్గానాయిడ్ కంపెనీ’ సీఈవో థామస్ మిచెల్ ఈ విషయాలు తెలిపారు. ఈ ప్రక్రియలో అనేక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొన్నామని చెప్పారు.

కృత్రిమ మీట్ బాల్

Advertisement

2023లో ఆర్గానాయిడ్, వీఎంఎల్ సంస్థలు ఏనుగు DNAను గొర్రె కణాలతో కలిపి ఒక భారీ మీట్‌బాల్‌ను సృష్టించాయి. ల్యాబ్ గ్రోన్ లెదర్ లిమిటెడ్ సీఈవో చె కానన్, టి. రెక్స్‌ డైనోసార్ తో సంబంధం ఉన్న ఈ బ్యాగ్ ఆకర్షణగా నిలుస్తుంది. తోలుతో చేసే బ్యాగ్ లకు ప్రత్యామ్నాయంగా, సాంకేతికతతో ఈ బ్యాగ్ ను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. సంప్రదాయ లెదర్ బ్యాగ్ లతో పోలిస్తే, ల్యాబ్ తో చేసిన టి. రెక్స్ లెదర్‌ను ఒక అత్యంత విలాసవంతమైన వస్తువుగా నిలిస్తుందని ఆయన అన్నారు. ఈ నూతన ఆవిష్కరణ ఫ్యాషన్ పరిశ్రమను మరో కోణంలో చూపిస్తుందన్నారు.

Also Read:  రంగులు మార్చే ఊసరవెల్లి బ్యాగ్ ఇది.. జస్ట్ ఇలా చేస్తే నచ్చిన డిజైన్‌, కలర్‌కు మారిపోద్ది

Advertisement

మేరీల్యాండ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త థామస్ ఆర్. హోల్ట్జ్ జూనియర్.. టి. రెక్స్ శిలాజాలలోని కొల్లాజెన్ చర్మం నుంచి కాకుండా, ఎముకల నుండి తయారైందని చెప్పారు. డైనోసార్ చర్మాన్ని పునః సృష్టి చేసి తయారు చేసిన ఈ బ్యాగ్ పై ఫ్యాషన్ ప్రపంచంలో క్రేజ్ మొదలైంది. వేలంలో పాల్గొని ఈ బ్యాగ్ ను సొంతం చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×