Water Bike: పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడు బండి బయటకు తీయాలంటేనే భయపడిపోతున్న రోజులివి. ఇలాంటి తరుణంలో కేవలం ఒక్క లీటర్ నీటితో ఏకంగా 500 కిలోమీటర్లు ప్రయాణించే వినూత్న బైక్‌ను ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు తెలంగాణకు చెందిన ఒక సామాన్య మేధావి. పెట్రోల్ అవసరం లేకుండా, పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా నీటితోనే నడిచేలా రూపొందించిన ఈ సరికొత్త సాంకేతికత ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. శాస్త్రవేత్తలకే సవాల్ విసిరేలా ఉన్న ఈ ఆవిష్కరణ వాహన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికేలా కనిపిస్తోంది.
శంకర్ గౌడ్ అద్భుత ఆవిష్కరణ
ఈ అసాధారణ ప్రయోగానికి వేదికైంది తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇక్కడికి చెందిన శంకర్ గౌడ్ అనే వ్యక్తి సుదీర్ఘ పరిశోధనలు, కృషితో ఈ ‘వాటర్ బైక్’ను ప్రాణం పోశాడు. పెద్ద పెద్ద చదువులు, ల్యాబ్‌లు లేకపోయినా.. కేవలం తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, పట్టుదలతో ఈ ఘనత సాధించాడు. సాధారణంగా బైక్‌లు నడవడానికి పెట్రోల్ ఇంధనంగా పనిచేస్తే, శంకర్ గౌడ్ తయారు చేసిన బైక్‌లో నీరే ప్రధాన ఇంధనంగా మారుతుంది. ఈ ఆవిష్కరణను చూసిన స్థానికులు ఆయన ప్రతిభను అభినందిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
నీటితో బైక్ ఎలా నడుస్తుంది? దీని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటి?
కేవలం నీటితో బైక్ ఎలా నడుస్తుందనే అనుమానం అందరిలోనూ రావడం సహజం. దీని వెనుక ఒక ప్రత్యేకమైన శాస్త్రీయ ప్రక్రియ దాగి ఉంది. నీటిలో ఉండే హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులను వేరు చేసే విధంగా ఒక ప్రత్యేక కిట్‌ను ఈ బైక్‌కు అమర్చారు. హైడ్రోజన్‌కు మండే స్వభావం చాలా ఎక్కువ. ఈ సాంకేతికత ద్వారా నీటి నుండి విడుదలయ్యే హైడ్రోజన్ వాయువును ఇంజిన్‌లోకి పంపి, బైక్ రన్ అయ్యేలా చేస్తారు. లీటర్ నీటితో 500 కిలోమీటర్ల మైలేజ్ రావడం అనేది నమ్మశక్యం కాకపోయినా, హైడ్రోజన్ ఇంధన సామర్థ్యం పెట్రోల్ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండటం వల్లే ఇది సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
భవిష్యత్తు ఇంధనానికి సరికొత్త దిక్సూచి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ (Green Energy), హైడ్రోజన్ ఇంధనంపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. కాలుష్యాన్ని పూర్తిగా నివారించేందుకు ఈ వాటర్ బైక్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ బైక్ నుండి వచ్చే పొగ వల్ల వాతావరణం అస్సలు కలుషితం కాదు. ప్రభుత్వాలు లేదా పెద్ద ఆటోమొబైల్ సంస్థలు శంకర్ గౌడ్ లాంటి గ్రామీణ మేధావులను గుర్తించి, ప్రోత్సహిస్తే.. ఇలాంటి సాంకేతికతను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావచ్చు. తక్కువ ఖర్చుతో పర్యావరణహిత ప్రయాణాన్ని అందించే ఈ వాటర్ బైక్ నిజంగానే భవిష్యత్తు రవాణా రంగానికి ఒక దిక్సూచి లాంటిదనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: మొదలవుతున్న భాగ్యనగర సంబురం.. గోల్కొండ బోనాలకు మంత్రి మార్క్ ఏర్పాట్లు!