E-Paper
Advertisement

బ్యాక్ కెమెరా చూస్తూ సెల్ఫీలు తీసుకునేలా ఒప్పో సరికొత్త యాక్సెసరీ.. Reno 16 ఫోన్ల ధర, ఫీచర్లు ఇవే!

బ్యాక్ కెమెరా చూస్తూ సెల్ఫీలు తీసుకునేలా ఒప్పో సరికొత్త యాక్సెసరీ.. Reno 16 ఫోన్ల ధర, ఫీచర్లు ఇవే!
Advertisement

Oppo Reno 16 Series: ఒప్పో నుంచి సరికొత్త ప్రీమియం మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్లు Reno 16, Reno 16c భారత మార్కెట్లో విక్రయానికి వచ్చాయి. వీటితో పాటు ఒప్పో బబుల్ అనే సరికొత్త కెమెరా యాక్సెసరీ కూడా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఈ-స్టోర్లతో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్లు దొరుకుతున్నాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా బ్యాంకు కార్లపై 10% క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ, రూ.5,000 ఎక్స్ఛేంజ్ బోనస్, అలాగే 6 నెలల స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ వంటి ఆఫర్లు ఉన్నాయి.

అదరగొడుతున్న Oppo Reno 16

ధర విషయానికి వస్తే.. Reno 16 బేస్ వేరియంట్ (8GB + 256GB) ధర రూ.61,999గా ఉంది. ఈ ఫోన్ 6.32 ఇంచుల కాంపాక్ట్ అమోలెడ్ డిస్‌ప్లేతో, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే దీనిలో 6,700mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ వెనుక వైపు మూడు 50MP కెమెరాలు (ప్రైమరీ, అల్ట్రా‌వైడ్, టెలిఫోటో), ముందు వైపు 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మంచి డిజైన్, అద్భుతమైన కెమెరా, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీరు రెనో 14 వాడుతుంటే దీనికి అప్‌గ్రేడ్ అవ్వచ్చు.

Advertisement

Also Read: గూగుల్ షాకింగ్ రూల్.. ఒకే అకౌంట్‌తో ఎక్కువ ఫోన్లు వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే!

తక్కువ ధరలో Reno 16c:

Reno 16c ప్రారంభ ధర రూ.46,999 గాఉంది. ఇది 6.57 ఇంచుల పెద్ద డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో వస్తుంది. దీనిలో మరింత పెద్దదైన 7,000mAh బ్యాటరీ ఉంది. తక్కువ ధరలో టెలిఫోటో లెన్స్, ప్రీమియం లుక్, మంచి బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి ఇది కరెక్ట్ ఛాయిస్. అయితే పనితీరు పరంగా మార్కెట్లో దీనికి గట్టిపోటీ ఉంది.

ఆకట్టుకుంటున్న ఒప్పో బబుల్:

Advertisement

ఈ ఫోన్లతో పాటు రూ.7,999 ధరతో లాంచ్ అయిన ‘ఒప్పో బబుల్’ అందరినీ ఆకర్షిస్తోంది. ఇది ఒక చిన్న వృత్తాకార డిస్‌ప్లే ఉన్న కెమెరా యాక్సెసరీ. దీని సాయంతో ఫోన్ వెనుక కెమెరాలను చూస్తూ ఈజీగా సెల్ఫీలు తీసుకోవచ్చు. ఇది వేరే బ్రాండ్ ఫోన్లకు కూడా సపోర్ట్ చేయడం విశేషం. స్టయిలిష్ లుక్, మంచి కెమెరాలు కావాలనుకునే వారికి ఈ కొత్త ఒప్పో ఫోన్లు మంచి ఎంపిక అవుతాయి.

Also Read: మెటా వివరణ ఇచ్చినా తీరని అనుమానాలు.. WhatsApp కొత్త రూల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

Related News

వన్‌ప్లస్ ఫోన్లలో ఇక సరికొత్త లుక్ అండ్ స్పీడ్.. ColorOS 17 అప్‌డేట్ ఎలా చేసుకోవాలంటే?

ఔటింగ్స్, పార్టీల కోసం పర్‌ఫెక్ట్ స్పీకర్..రూ.1,999కే అదిరిపోయే సౌండ్!

ఆఫ్‌సీజన్‌లో ఇంత తక్కువకా? అమెజాన్ సేల్‌లో సగానికి సగం తగ్గిన 5-స్టార్ ఏసీల ధరలు!

సూపర్ ప్రాసెసర్, కొత్త డిజైన్‌తో iPad Mini 8.. కానీ ఆ విషయంలో యాపిల్ నిరాశపరిచింది!

సేల్‌లో..టీవీలపై భారీ డిస్కౌంట్! ఎగబడి కొంటున్న జనం

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధమాకా..HP లాప్‌టాప్స్‌ ఇప్పుడు సగం ధరకే !

మీ ఐఫోన్ మెమరీ ఉన్నట్టుండి ఫుల్ అయిందా? ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేస్తే 14GB మీ సొంతం!

తక్కువ ధరలో..మంచి పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా ?

Big Stories

Advertisement
×