Xiaomi Smart Band 11: షావోమి తన నెక్స్ట్ జనరేషన్ ఫిట్‌నెస్ ట్రాకర్లపై శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవలే ‘షావోమి స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో’ను మార్కెట్లోకి తీసుకురాగా.. కొద్ది రోజులకే దాని తదపరి మోడల్స్ పై చైనీస్ దిగ్గజం ఫోకస్ పెట్టింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ‘షావోమి స్మార్ట్ బ్యాండ్ 11’ (Mi Band 11) సిరీస్‌కు సంబంధించిన పనులు ఇప్పటికే మెుదలైపోయాయి. ఇటీవలే తైవాన్ ఎన్‌సీసీ (NCC) డేటాబేస్‌లో ఈ పరికరం కనిపించగా.. ఇప్పుడు వాటికి సంబంధించిన నెట్ వర్క్ యాక్సెస్ అనుమతులు సాధించడం ఆసక్తికరంగా మారింది.
చైనాకు చెందిన ‘మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ (MIIT) తాజాగా రెండు షావోమి బ్లూటూత్ పరికరాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి ‘M2616B1’, ‘M2617B1’ మోడల్ నంబర్లతో రిజిస్టర్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ ‘ఎక్స్‌పీరియన్స్ మోర్’ (Experience More) అందించిన సమాచారం ప్రకారం.. ఇవి రాబోయే ‘షావోమి స్మార్ట్ బ్యాండ్ 11’, అలాగే ‘షావోమి స్మార్ట్ బ్యాండ్ 11 ఎన్‌ఎఫ్‌సీ’ వెర్షన్లు. ఇవి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ బ్యాండ్ 10, బ్యాండ్ 10 NFC మోడళ్లకు అప్‌గ్రేడెడ్ వర్షన్లుగా రానున్నాయి. మరో లీకర్ ‘స్మార్ట్ పికాచు’ సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇవి మార్కెట్లోకి రాబోతున్నాయి.
ఇదిలా ఉంటే గతంలో షావోమి తన ఫ్లాగ్‌షిప్ బ్యాండ్ల విడుదలకు ముందు కూడా ఇదే తరహా సర్టిఫికేషన్ ప్రక్రియను అనుసరించింది. గతంలో వచ్చిన బ్యాండ్ 10 ప్రో మోడల్స్ వరుసగా M2551B1, M2553B1 మోడల్ నంబర్లతో స్టాండర్డ్, NFC వర్షన్లుగా వచ్చాయి. అలాగే మే నెలలో సింగపూర్, తైవాన్ సర్టిఫికేషన్ డేటాబేస్‌లలో M2561B1 మోడల్ నంబర్‌తో ఒక ‘స్మార్ట్ బ్రాస్‌లెట్’ సైతం కనిపించింది. వీటన్నింటినీ విశ్లేషిస్తే.. షావోమి తన కొత్త తరం వేరబుల్స్ లాంచ్‌కు పక్కాగా రంగం సిద్ధం చేస్తోందని స్పష్టమవుతోంది.
Mi బ్యాండ్ 11 పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా అధికారికంగా బయటకు రానప్పటికీ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ బ్యాండ్ 10 ఫీచర్లను బట్టి కొత్త బ్యాండ్ ఎలా ఉండబోతుందోనన్న అంచనాలు ఇప్పటి నుంచే మెుదలయ్యాయి. ప్రస్తుత బేస్ మోడల్ 1.72-ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, 1500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 21 రోజుల బ్యాటరీ లైఫ్ ఇచ్చే 233mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది హైపర్‌ఓఎస్ 2.0 సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. ఇక దీని ‘ప్రో’ వేరియంట్ 1.74-ఇంచుల డిస్‌ప్లే, 2000 నిట్స్ బ్రైట్‌నెస్, హెచ్‌ఆర్‌వి ట్రాకింగ్, ఇన్‌బిల్ట్ జీఎన్‌ఎస్‌ఎస్, యాపిల్ హెల్త్ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్లతో వచ్చింది.
Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు!
రాబోయే ‘Mi బ్యాండ్ 11’ లో కూడా కంపెనీ దాదాపు పాత బ్యాటరీ సైజునే కొనసాగించే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే బ్యాటరీ సామర్థ్యం పెంచే బదులు, సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్, కొత్త సెన్సార్లు, మెరుగైన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లపై షావోమి ఎక్కువ దృష్టి పెట్టనుందని పేర్కొంటున్నాయి. లాంచ్ సమయం దగ్గరపడే కొద్దీ ఈ స్మార్ట్ బ్యాండ్ సిరీస్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు వస్తున్నాయని టెక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: కంపెనీ vs లోకల్ మెకానిక్.. ఫ్రిజ్, ఏసీ, టీవీ పాడైతే.. ఎవరితో రిపేర్ చేయిస్తే బెస్ట్?